Sai Srinivas
-
శుభలేఖ+లు మన ఇంట్లో సినిమా
సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘శుభలేఖ+లు’. ప్రియా వడ్లమాని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో వంశీ నెక్కంటి, మోనా బేద్రే ముఖ్య పాత్రలు చేశారు. ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి శిష్యుడు శరత్ నర్వాడే ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. హనుమా తెలుగు మూవీస్ పతాకంపై సి. విద్యాసాగర్, జనార్థన్ ఆర్.ఆర్ నిర్మించిన ఈ సినిమాను నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి ఫ్యాన్సీ రేటుతో సొంతం చేసుకున్నారు. ‘ఆనంద్, గోదావరి, చందమామ’ వంటి హిట్ సినిమాలకు సంగీతం అందించిన కేఎమ్ రాధాకృష్ణన్ ఈ సినిమాకు సంగీత దర్శకునిగా వ్యవహరించారు. వివాహం పట్ల నేటి యువతరం ఆలోచనా ధోరణి ఎలా ఉంది? అనే కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ చెప్పిన విశేషాలు.... సందర్భానుసారంగానే పాటలు నేను సంగీతం అందించిన మంచి సినిమాల్లో ‘శుభలేఖ+లు’ ఒకటి. ఈ సినిమాలో ఆరు పాటలు ఉన్నాయి. అన్నీ సందర్భానుసారంగానే వస్తాయి. ఇందులో ఉన్న ‘పద్మనాభ పాహి’ అనే పాట పాడింది నేనే. పెద్దాడ మూర్తిగారు రాశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు ‘వేదవాసిని’ అనే పాట పాడారు. ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇందులోని ‘శృంగారలహరి’ సాంగ్ నా ఫేవరెట్. ‘చెప్పక తప్పదు’ అనే సంగీత్ సాంగ్ ఓ ఆకర్షణ. దాదాపు 23 రోజులు ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్‌కి పట్టింది. అంత డీటైల్డ్‌గా చేశాను. నాకా సంతోషం ఉంది ఈ సినిమాలోని సాంగ్స్ కోసం మా టీమ్ జరిపిన సంభాషణలు నాకు మరింత మంచి పాటలు ఇచ్చే చాన్స్ కలిపించాయి. దర్శకుడు శరత్ కూల్‌గా ఉంటారు. నిర్మాత జనార్థన్ ఈ సినిమాకు కథ కూడా అందించారు. ఆయనతో నాకు ఉన్న స్నేహం నా బాధ్యతను మరింత పెంచింది. నా సినిమాలో ఆరు పాటలు హిట్ కావాలని నేను కోరుకుంటాను. అందుకే లిమిటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటాను. ఎక్కువ సినిమాలు చేస్తే మజ్జిగ పలచన అవుతుందనిపిస్తోంది. తక్కువ సినిమాలు చేయడం నాకు వ్యక్తిగతంగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ సక్సెస్ రేట్ పెరిగిన సంతోషం ఉంది నాకు. యువత ఆలోచనలకు దృశ్యరూపం వివాహం పట్ల యువతరం ఆలోచనా ధోరణి మారింది. అరేంజ్డ్ మ్యారేజేస్ విషయంలో వధూవరుల సొంత అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పెద్దలు చూసిన సంబంధాలకు అడ్జెస్ట్ అయ్యే ఒక ధోరణి ఉండేది. ఇప్పుడు అలా లేదు. పెళ్లి తర్వాత తమ జీవితం ఎలా ఉండబోతుందనే ఇన్సెక్యూరిటీ అమ్మాయిలు, అబ్బాయిలు.. ఇద్దర్లోనూ ఉంది. కొత్త ఇంట్లో ఎలా సర్దుకుపోవాలనే ఆలోచనలతో అమ్మాయిలు సతమతం అవుతుంటారు. నేటి పరిస్థితులను ప్రతిబింబించేలా శుభలేఖ+లు చిత్రం ఉంటుంది. సినిమాలోని ప్రతి పాత్రలోనూ బాధ్యతాయుతమైన ప్రవర్తన కనిపిస్తుంది. సిస్టర్ పెళ్లి కోసం హీరో పడే తపన, హీరోయిన్ పెళ్లి గురించి ఆలోచించే విధానం ఇలా ప్రతిదీ ప్రేక్షకులకు ఆసక్తికరంగానే ఉంటుంది. యూత్ అభిప్రాయాలకు, మనస్తత్వాలకు, ఆలోచనలకు దృశ్యరూపం ఇచ్చారు దర్శకుడు శరత్. రిలీజ్ ముందే సక్సెస్ అయ్యాం రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన లభిస్తోంది. మార్కెట్లో మంచి మౌత్ టాక్ వస్తోంది. సోషల్ మీడియాలో మంచి బజ్ ఉంది. ఆల్రెడీ మా సినిమాను నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డిగారు తీసుకున్నారు. దీంతో రిలీజ్ ముందే సక్సెస్ అయ్యాం అనుకుంటున్నాం. ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుందనే నమ్మకం ఉంది. అందుకే మాతో పాటు ఇతర సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయన్న టెన్షన్ లేదు. ఇది మన ఇంట్లో సినిమానే. మన ఇంట్లో జరుగుతున్న విధివిధానాలే ఈ సినిమా కథనం. వాటిని సిల్వర్‌స్క్రీన్‌పై చూపించాం. ఎస్పీబీతో హరికథ ప్రస్తుతం ‘ఊరంతా అనుకుంటున్నారు’ సినిమా చేస్తున్నాను. ఎస్పీ బాలూగారితో ‘భీష్మ’ అనే హరికథ ప్లాన్ చేస్తున్నాను. ఇంకో రెండు సినిమాలు కమిట్ అవ్వబోతున్నాను. -
అందరూ మెచ్చే శుభలేఖ+లు
‘‘పెళ్లి అనే శుభకార్యానికి ముందు అందులోని సమాచారాన్నంతా క్లుప్తంగా శుభలేఖలో రాసి కావాల్సిన బంధువులందరికీ పంచుతాం. మరి సినిమాకు శుభలేఖలంటే ‘టీజర్, ట్రైలర్స్’లే. బంధువులు ఎవరంటే ప్రేక్షకులే. పెళ్లి కార్డ్‌ని చూసి పెళ్లి ఏ రీతిలో జరగబోతోందో అని ఊహించినట్టుగా, ‘శుభలేఖ+లు’ చిత్రం కూడా బావుండబోతోందని టాక్ వినిపిస్తోంది. ‘మా ‘శుభలేఖ+లు’ చిత్రం కూడా కచ్చితంగా విజయం సాధిస్తుంది అనే నమ్మం ఉంది’’ అంటున్నారు చిత్రబృందం. సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ జంటగా ప్రియా వడ్లమాని ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘శుభలేఖ+లు’. శరత్ నర్వాడే దర్శకత్వంలో సి. విద్యాసాగర్, ఆర్.ఆర్. జనార్థన్ నిర్మించారు. చిత్రాన్ని వీక్షించి, బాగా నచ్చడంతో చిత్రం హక్కులను పుష్యమి ఫిల్మ్స్ అధినేత బెల్లం రామకృష్ణారెడ్డి కొనుగోలు చేశారు. ఈ చిన్న చిత్రాన్ని సుమారు మూడున్నర కోట్ల ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేశారని టాక్. ‘శుభలేఖ+లు’ డిసెంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం చెప్పిన విశేషాల్లో కొన్ని... ‘వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి జరిపించాలి అన్నది పాత నానుడి. ఇప్పటి యువత నాడి తెలిసిన దర్శక– నిర్మాతలు ఒక అబద్ధం ఆడకుండా ఒకరి బలహీనతలు ముందుగానే మరొకరికి పరిచయం చేసి ఎలా ఒక్కటవ్వాలనుకుంటున్నారు అనే పాయింట్‌తో ఈ చిత్రం ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలు వేరు కాపురాలు పెట్టేశాయి. నిర్ణయాలు కలిసి తీసుకోవడం నుంచి ఎవరికి తోచిన నిర్ణయాలు వాళ్లు తీసుకుని కేవలం నిర్ణయాలను తెలియజేస్తున్నారు. కొంచెం కష్టం అయినా సరే పెద్దలను ఒప్పించవచ్చు. ఇలాంటి కాంటెపరరీ సబ్జెక్ట్‌కి యువత బాగా కనెక్ట్ అవుతారు. పాటలకు విశేష స్పందన లభిస్తోంది. కథను ముందుకు తీసుకువెళ్లేలా పాటలుంటాయి. చిన్న చిత్రాలకు పెద్ద సంవత్సరం 2018 చిన్న సినిమాలకు చాలా పెద్ద సంవత్సరం. రిలీజ్ అప్పుడు చిన్న స్థాయిలో కనిపించినా, బాక్సాఫీస్ వద్ద పెద్ద సందడి చేస్తున్నాయి. మా సినిమా కూడా కచ్చితంగా అదే స్థాయిలో ఉంటుంది. ‘ఛలో, ఆర్ఎక్స్ 100, కంచరపాలెం, సమ్మోహనం, గూఢచారి’ లాంటి చిత్రాల జాబితాలో మా చిత్రం కూడా చోటు సంపాదించుకుంటుందని నమ్ముతున్నాం. కంటెంట్ బాగుంటే... పెద్ద సినిమాలకు పెట్టింది తిరిగొస్తే హిట్ అను కుంటాం. లాభాలు చూసేది చాలా తక్కువ ఉంటుంది. కానీ చిన్న సినిమాల విషయంలో అలా కాదు. సినిమా టాక్ని బట్టి ఎన్నింతలైనా లాభం చూడొచ్చు నిర్మాతలు. కంటెంట్ బావుంటే చిన్న హీరో, పెద్ద హీరో అనే బేధాలను బాక్సాఫీస్ అంకెల్లో ప్రేక్షకుడు చూపించడం లేదు. మా సినిమా విషయంలో కూడా అదే జరుగుతుందనే నమ్మకం ఉంది. మంచి ఇంపాక్ట్ అటెన్షన్ స్పాన్ తక్కువ ఉన్న ఈ రోజుల్లో కూడా ప్రేక్షకులు ‘శుభలేఖ+లు’ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూసున్నారంటే అది కచ్చితంగా టీజర్స్, ట్రైలర్స్, సినిమాలోని పాటలు క్రియేట్ చేసిన ఇంపాక్టే. సాయి శ్రీనివాస్, ప్రియా వడ్లమాని, దీక్షా శర్మ గుర్తుండిపోయేలా స్క్రీన్ ప్రెజెన్స్ కనబరిచారు. శరత్ నర్వాడ్ దర్శకత్వ ప్రతిభ గురించి ఎంతైనా చెప్పొచ్చు. డిసెంబర్ 7న విడుదల కానున్న ఈ చిత్రం కోసం పాటలు వింటూ, ట్రైలర్ చూస్తూ ఆసక్తిగా ఎదురు చూడటమే’’ అంటూ తమ చిత్రం గ్యారంటీగా హిట్ అనే నమ్మకాన్ని కూడా చిత్రబృందం వ్యక్తం చేశారు. -
ఒక్క ఫ్రేమ్ అశ్లీలత లేకుండా...
‘‘ఈ మధ్య వస్తున్న కొన్ని చిత్రాలు కుటుంబంతో కలసి చూసేలా ఉండటం లేదు. కానీ ‘శుభలేఖ+లు’ చిత్రం సకుటుంబంతో చూడొచ్చు. నాకు చాలా నచ్చింది. ఒక్క ఫ్రేమ్ కూడా అశ్లీలంగా అనిపించలేదు. అందుకే ఈ సినిమాను కొన్నాను. డిసెంబర్ 7న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు బెల్లం రామకృష్ణారెడ్డి. సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ జంటగా ప్రియా వడ్లమాని ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శుభలేఖ+లు’. శరత్ నర్వాడే దర్శకత్వంలో సి. విద్యాసాగర్, ఆర్.ఆర్. జనార్థన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న బెల్లం రామకృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు శరత్ మాట్లాడుతూ – ‘‘యూత్‌కి కనెక్ట్ అయ్యే సినిమా మాది. యువతని పెద్దలు ఎలా అర్థం చేసుకోవాలనే కాన్సెప్ట్‌ని చూపించాం. నిర్మాతలు మంచి సపోర్ట్ అందించారు. రాధాకృష్ణ సంగీతం స్పెషల్ హైలైట్’’ అన్నారు.‘‘కంటెంట్‌ని నమ్మి ప్రారంభించిన సినిమా ఇది. నచ్చి బెల్లం రామకృష్ణా రెడ్డి థియేట్రికల్, శాటిలైట్ హక్కులను కొనుక్కున్నారు. మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత జనార్థన్. ‘‘నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు శరత్ మేలు ఎప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు హీరో. -
టైటిల్లో ప్లస్ ఏంటి?
సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ జంటగా శరత్ నర్వాడే దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శుభలేఖ+లు’. ప్రియా వడ్లమాని, వంశీ నెక్కంటి, మోనా బేద్రే ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హనుమా తెలుగు మూవీస్ పతాకంపై సి.విద్యాసాగర్, ఆర్.ఆర్. జనార్ధన్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత ‘దిల్’ రాజు హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు శరత్ నర్వాడే మాట్లాడుతూ– ‘‘శుభలేఖ+లు’ డిఫరెంట్ సినిమా అని చెప్పను కానీ, మన ఇంట్లో చూసిన కథలానే ఉంటుంది. టైటిల్లో ప్లస్ గురించి చాలా మంది అడిగారు. ఒక పెళ్లి వల్ల కొందరి లవ్స్టోరీస్కి క్లియరెన్స్ వచ్చి మరో రెండు జంటలు పెళ్లికి సిద్ధమవుతాయి. అందుకే టైటిల్ అలా పెట్టాం’’ అన్నారు. ‘‘ఎప్పటి నుంచో సినిమా చేయాలనే ఆసక్తి ఉండేది. ఈ చిత్రం ఎంత గొప్పగా ఉంటుందో ఇప్పుడే చెప్పను. సినిమా సక్సెస్ తర్వాత మాట్లాడతా’’ అన్నారు జనార్ధన్. ‘‘నా హృదయానికి దగ్గరైన సినిమా ఇది. శరత్‌గారు హార్ట్ టచింగ్‌గా తెరకెక్కించారు’’ అన్నారు సాయి శ్రీనివాస్. దీక్షా శర్మ, రచయిత విస్సు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కేఎమ్ రాధాకృష్ణన్, కెమెరా: మురళీమోహన్ రెడ్డి. -
మినీ బాహుబలి చేశాం
‘‘జయ జానకి నాయక’ సినిమాకి ముందే శ్రీవాస్‌గారు ‘సాక్ష్యం’ కథ చెప్పారు. పంచభూతాల నేపథ్యంలో అద్భుతమైన కథ రెడీ చేశారాయన. ఇప్పటివరకూ చూడని సరికొత్త కథ.. చాలా బాగుంటుంది. పర్సనల్‌గా నాకు బాగా నచ్చింది’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘సాక్ష్యం’. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ పంచుకున్న విశేషాలు... ► పంచభూతాలే ఈ జగతికి సాక్ష్యం. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘సాక్ష్యం’. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ ఇలాంటి కథతో సినిమా రాలేదు. బహుశా.. మా సినిమా విడుదల తర్వాత ఈ జానర్లో మరిన్ని సినిమాలు వస్తాయనుకుంటున్నా. ఈ సినిమా కోసం 150 రోజులు పనిచేశాం. ► పాటలు, ఫైట్లు చక్కగా కుదిరాయి. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు పీటర్ హెయిన్స్‌గారు యాక్షన్స్ డిజైన్ చేశారు. ఈ చిత్రంలో డూప్ లేకుండా రిస్కీ ఫైట్స్ చేశా. ఎంత కష్టపడితే అంత మంచి భవిష్యత్ ఉంటుందని నా నమ్మకం. అందుకే జెన్యూన్‌గా కష్టపడ్డా. వెరీ హ్యాపీ. యాక్షన్ సీక్వెన్స్ చాలా సహజంగా ఉంటాయి. ► ఇది పక్కా కమర్షియల్ సినిమా. ఇందులో నేను వీడియోగేమ్ డిజైనర్‌గా చేశా. ‘సాక్ష్యం’ కథ వినగానే హిట్ అని తెలుసు. సూపర్ హిట్ చేయాలని యూనిట్ అంతా చాలా కష్టపడ్డాం. ఓ రకంగా మినీ ‘బాహుబలి’ చేశాం. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ చూడదగ్గ చిత్రమిది. ► ఏ సినిమాకైనా నా వైపు నుంచి బెస్ట్ ఇవ్వడానికి కృషి చేస్తా. మినిమం గ్యారంటీ సినిమాలు ఇస్తాడనే పేరు చాలు. నా మార్కెట్ పరిధికి మించి ఎవరూ ఖర్చు పెట్టరు. వసూళ్లు ఒక్కటే కాదు.. శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపితే నా సినిమాలకు నష్టం రాదు. బడ్జెట్ విషయంలో ఎవర్నీ ఒత్తిడి చేయను. నేనెప్పుడూ నిర్మాతల హీరోనే. ► ‘సాక్ష్యం’ వర్క్‌ని ప్రతిరోజూ ఎంజాయ్ చేస్తున్నా అని శ్రీవాస్‌గారు అన్నారు. మంచి విజన్‌తో ఈ కథ రెడీ చేశారు. రెండు పార్ట్‌లుగా తీయాల్సిన సినిమా ఇది. నా లైఫ్‌లో ‘సాక్ష్యం’ చిత్రాన్ని గర్వంగా ఫీలవుతా అని అభిషేక్ నామాగారు అన్నారు. ► కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నా. ఇందులో కాజల్ హీరోయిన్. 70శాతం షూటింగ్ పూర్తయింది. నవంబర్‌లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తేజగారి డైరెక్షన్లో చేస్తున్న సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. ఇది చాలా కొత్త కథ. ఫస్టాఫ్‌లో ఫైట్స్ ఉండవు. ఏడేళ్ల కిందటే ఆయన ఈ కథ తయారు చేసుకున్నారు. ఈ సినిమాలో కూడా కాజలే హీరోయిన్. యాక్చువల్లీ ఈ సినిమాకు నాకన్నా ముందే కాజల్‌ని ఫైనలైజ్ చేశారు. తర్వాత నేను వచ్చా. మా కాంబినేషన్ రెండోసారి అనుకోకుండా కుదిరింది. -
మాటిచ్చా... నిలబెట్టుకున్నా!
‘‘మన బ్లడ్‌కి ఓ కలర్... మన మాటకు ఓ విలువ... మనకు ఓ క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ కోసం నేనెంత దూరమైనా వెళతా. ‘సరైనోడు’ తర్వాత నాకు పెద్ద ఛాన్సులొచ్చాయి. కానీ, ఎప్పుడో సాయితో సినిమా చేస్తానని నేను మాటిచ్చా. అందుకని ఈ సినిమా చేశా. కానీ, చేసిది ఎలా ఉండాలి? పెద్ద స్థాయిలో ఉండాలి. ఏదో సినిమా చేయాలని చేయలేదు. నేను చేసిన ఆరు సినిమాల కంటే ఓ పాయింట్ ఎక్కువ వెళ్లా తప్ప... తక్కువ వెళ్లలేదు’’ అన్నారు బోయపాటి శ్రీను. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (సాయి), రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా ఆయన దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ‘జయ జానకి నాయక’ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా బోయపాటి చెప్పిన విశేషాలు... ⇒ నేను సినిమా తీసిన ప్రతిసారి ‘మీరు ప్రయోగాలు చేయరా? మారరా?’ అనడుగుతారు. ఓ అందమైన ప్రేమకథకు ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, మంచి పాటలు జోడించి ‘భద్ర’ తీశా. ఆ తర్వాత నేను చేసిన అందమైన ప్రేమకథే ఈ సిన్మా. ఒక్క మాటలో చెప్పాలంటే... ప్రతి ఒక్క గుండెను చేరే చిత్రమిది. ప్రతి ఒక్కరి మనసుల్ని స్పృశించే చిత్రమిది. కొత్తగానూ, కథానుగుణంగానూ ఉంటుందని ‘జయ జానకి నాయక’ టైటిల్ పెట్టాం. ప్రేమంటే ఏంటి? ఆడపిల్లంటే ఏంటి? వాళ్లను మనమెంత అపురూపంగా కాపాడుకోవాలనేది సినిమాలో చెప్పాను. ⇒ నా ప్రతి సినిమాలోనూ యాక్షన్ హైలైట్ అయినా అవెందుకు ఆడాయంటే.. యాక్షన్‌తో పాటు ఎమోషన్ కనెక్ట్ అయ్యుంటుంది గనుక! ప్రేక్షకుడు కొట్టు అన్నప్పుడే నా హీరో కొడతాడు. ఫైట్ ఫర్ ఫైట్, సాంగ్ ఫర్ సాంగ్ అన్నట్టు నేను తీయను. ప్రతిదీ కథలో భాగంగా ఉంటుంది. ఇందులోనూ అలాంటి ఎమోషనల్ ఫైట్స్ ఉన్నాయి. థియేటర్లో ప్రేక్షకుడు ‘వాణ్ణిప్పుడు హీరో కొట్టాలిరా’ అని ఫీలైనప్పుడే హీరో కొడతాడు. కథలో భాగంగానే పాటలొస్తాయి. అందువల్లే, కథలోంచి పాటలు రావడంతో నా వర్క్ సులభమైందని దేవిశ్రీ చెప్పాడు. అతను మంచి పాటలు ఇవ్వడంతో పాటు సూపర్బ్ రీ–రికార్డింగ్ ఇచ్చాడు. ⇒ ‘లెజెండ్’ తర్వాత బన్నీతో చేస్తున్నప్పుడు ‘తనతో మీకు ఎలా కుదురుతుంది?’ అనడిగారు. బన్నీ బాడీ లాంగ్వేజ్‌కి సరిపడినట్లే ‘సరైనోడు’ తీశా కదా! నాకు దొరికిన మెటీరియల్‌ను దృష్టిలో పెట్టుకుని చేస్తా తప్ప... ఎక్కడికో వెళ్లి చేయను. మైఖేల్ జాక్సన్ దొరికితే డ్యాన్స్ చేస్తా. మైక్ టైసన్ దొరికితే బాక్సింగ్ చేస్తా. సాయి ఓ ముడిసరుకు లాంటోడు. తన ప్లస్సులను ప్లస్ చేస్తూ, మైనస్‌లను తగ్గిస్తూ, తన బాడీ లాంగ్వేజ్‌కి సరిపడినట్లు సిన్మా తీశా. ⇒ ఈ సినిమా బడ్జెట్‌కు తగ్గట్టు బిజినెస్ జరిగింది. నాపై కొన్ని అంచనాలు ఉన్నాయి. కొత్త హీరో అని వాటి కంటే తక్కువగా నేనెందుకు సిన్మా తీస్తా? ఈ సంగతి మా నిర్మాతకు తెలుసు. ఆయనే మా సినిమాకు గ్రేట్ ఎసెట్. డబ్బు కాదు, మంచి సినిమా ముఖ్యమని తీశారు. సేమ్ టైమ్... ఆయన క్రెడిట్ కార్డు ఇచ్చారని ఎలా పడితే అలా వాడలేదు. నన్ను నమ్మి సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లను, నిర్మాతను డిజప్పాయింట్ చేసేలా సినిమా ఉండదు. ‘స్టార్‌తో కాకుండా కొత్త హీరోతో ఈ సినిమా తీయడం వల్ల బిజినెస్ పరంగా మీపై ఒత్తిడి పెరిగిందా?’ అనడిగితే... ‘ఒత్తిడి ఉంటుందని సాయితో సినిమా చేయాలనుకున్నప్పుడే తెలుసు. కానీ, ఒత్తిడి ఫీలవలేదు. ఎందుకంటే... మంచి కథ కుదిరింది’ అన్నారు బోయపాటి. ⇒ మూడు సినిమాలు ఒకే రోజున విడుదల కావడం వల్ల ఇబ్బంది ఏం లేదు. నిజానికి, జూన్ 23న లేదా జూలై తొలి వారంలో మా సినిమా విడుదల కావాలి. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఇంకా వెనక్కి వెళితే మా నిర్మాత నెలకు కోట్ల రూపాయల వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి. ఆల్రెడీ ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. సో, రిలీజ్ చేస్తున్నాం. మనకు 1200లకు పైగా థియేటర్లు ఉన్నాయి. అన్నిటిలోనూ మన సినిమాను విడుదల చేసుకోలేం కదా! మా సినిమా 750 నుంచి 800 థియేటర్లలో విడుదలవుతోంది. ⇒ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ తర్వాత చిరంజీవిగారు ఎప్పుడు? ఏం చేస్తారో? నాకు తెలీదు గానీ.. నేనైతే ఆయన కోసం ఓ కథ రెడీ చేశా. మహేశ్‌బాబుగారితో ఓ సరికొత్త జానర్ కథ గురించి డిస్కస్ చేశా. నాకు డేట్స్ ఎక్కువ కావాలనడిగా. వచ్చే ఏడాది మే–జూన్ నెలల్లో తప్పకుండా బాలకృష్ణగారితో ఓ సినిమా స్టార్ట్ చేస్తా. అఖిల్ కోసం రెండు లైన్లు రెడీ చేశా. అయితే... ఈ సినిమా హడావిడి పూర్తయిన తర్వాత, బాలకృష్ణగారి సినిమా మొదలయ్యేలోపు ఏం చేయాలి? ఏ సినిమా చేస్తే న్యాయం చేయగలను? అనేది చూస్తా! -
నమో వేంకటేశాయ...ఆ రోజు వస్తారయ!
‘‘ఏమో గ్రాఫిక్స్‌కి చాలా టైమ్ పట్టేటట్లుంది. అంత టైమ్ తీసుకుంటేనే సినిమా క్వాలిటీగా ఉంటుంది. అందుకని విడుదల తేదీ చెప్పడం కష్టం’’ అని ‘నమో వేంకటేశాయ’ గురించి నాగార్జున చెప్పి పది రోజులైంది. ఇప్పుడు గ్రాఫిక్స్‌కి ఎంత టైమ్ పడుతుందో చిత్ర దర్శక-నిర్మాతలు కె. రాఘవేంద్రరావు, ఎ. మహేశ్రెడ్డిలకు ఓ క్లారిటీ వచ్చేసినట్లుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడీ సాయి’ తర్వాత రాఘవేంద్రరావు -నాగార్జున కాంబినేషన్లో రూపొందుతోన్న భక్తిరసా త్మక చిత్రం ఇది. హాథీ రామ్ బాబాగా నాగ్, వేంకటేశ్వర స్వామిగా సౌరభ్ జైన్, భక్తు రాలు కృష్ణమ్మగా అనుష్క నటిస్తున్న ఈ చిత్రంలో ఇంకా పలు వురు ప్రము ఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. వారిలో ‘కంచె’ చిత్ర ఫేవ్‌ు అయిన కథానాయిక ప్రజ్ఞా జైస్వాల్ కూడా ఉన్నారు. నాగ్-ప్రజ్ఞా జైస్వాల్‌ల మీద ఇటీవల ఓ పాట చిత్రీకరించారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభించింది. సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో ఈ చిత్ర బిజినెస్ కూడా బాగుంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పని జరుగుతోంది’’ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు జోడీ... ప్రజ్ఞా జైస్వాల్ భక్తిరస్మాతక చిత్రం ‘నమో వేంకటేశాయ’ చిత్రంలో నటించిన తర్వాత ప్రజ్ఞా జైస్వాల్ ఓ లవ్ కమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని అంగీకరించారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో ఒక కథానాయికగా రకుల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రజ్ఞా జైస్వాల్‌ని మరో నాయికగా తీసుకున్నామని గురువారం నిర్మాత తెలిపారు. కథానాయికలిద్దరికీ సమాన ప్రాధాన్యం ఉంటుందనీ, ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేశామనీ అన్నారు. బోయపాటి మార్క్ యాక్షన్‌తో సాగే చిత్రమని కూడా తెలిపారు. -
ఫలించిన నిరీక్షణ
విశాఖ ఇంజినీర్‌ను విడిచిపెట్టిన కిడ్నాపర్లు 18 రోజుల తర్వాత విముక్తి స్వీట్లు పంచుకున్న కుటుంబ సభ్యులు భర్త శ్రీనివాస్‌తో స్కైప్‌లో మాట్లాడిన లలిత పెదవాల్తేరు : కన్నీటి స్థానంలో ఆనంద బాష్పాలు.. దీన వదనాల్లో సంతోష రేఖలు.. నైజీరియాలో కిడ్నాప్‌నకు గురైన ఇంజనీరు సాయిశ్రీనివాస్ ఇంట్లో సందడి వాతావరణం.. విడుదలైనట్టు క్షేమ వార్త తెలియడంతో 18 రోజుల తర్వాత శనివారం ఉత్కంఠ వీడింది. దీంతో కుటుంబమంతా ఆనందడోలికలలో మునిగితేలారు. నైజీరియాలోగల భారత రాయబారి బి.ఎన్.రెడ్డి ఈ సమాచారాన్ని తనే స్వయంగా ఫోన్ ద్వారా సాయిశ్రీనివాస్ భార్య లలితకు తెలిపారు. భారత హైకమిషన్, అక్కడి ఫెడరల్ గవర్నమెంట్‌తో పాటు, బెన్యూ రాష్ర్ట ప్రభుత్వం, డెంకోట్ ఇండస్ట్రీస్ చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. ప్రస్తుతం సాయిశ్రీనివాస్‌తోపాటు మరో భారతీయుడు అనిష్లు వారు పనిచేస్తున్న కంపెనీలో సురక్షింతంగా ఉన్నారు. వారికి అక్కడి ప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఫలించిన మంతనాలు డెంకోట ఇండస్ట్రీస్ యాజమాన్యం కిడ్నాపర్లతో జరిపిన చర్చలు ఫలించడంతో కిడ్నాపర్ల చెరలో ఉన్న ఇద్దరి భారతీయులను సురక్షింతంగా విడిచిపెట్టారు. దీంతోపాటు అక్కడి ఫెడరల్ గవర్నమెంట్, బెన్యూ రాష్ట్ర ప్రభుత్వాలపై నైజరియాలో గల భారత హైకమిషన్ ఒత్తిడి తీసుకురావడంతో కిడ్నాప్ ఉదంతానికి చెక్ పడింది. శనివారం ఉదయం 10.30గంటల సమయంలో నైజీరియాలో గల భారత రాయబారి బి.ఎన్.రెడ్డి ఫోన్ ద్వారా సమాచారం అందించారని సాయిశ్రీనివాస్ భార్య లలిత ఆనందభాష్పాల నడుమ తెలిపింది. ఈ 18 రోజులు క్షణమొక యుగంలా గడిచిందని, నరకయాతన అనుభవించామని ఉద్వేగంతో పేర్కొన్నారు. తెల్లవారితే ఏ కబురు వినాల్సి వస్తుందోనని నిద్రాహారాలు మాని గడిపామని బోరున విలపించారు. అందరికీ ధన్యవాదాలు నైజిరియాలో తన భర్త కిడ్నాప్‌నకు గురైన క్షణం నుంచి అతను సురక్షితంగా విడుదల కావాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని సాయిశ్రీనివాస్ భార్య లలిత ఉద్విగ్నంగా తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ, మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి,ఎంపీ హరిబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్లు తన భర్త సమస్యను భారత ైహైకమిషన్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఢిల్లీలోని ఆంధ్రభవన్ , నైజీరియాలో గల భారత రాయబారి బి.ఎన్.రెడ్డి కృషి మరవలేనన్నారు. వీరు ఎప్పటికప్పడు తనకు సమాచారం అందించి మనోస్థైర్యాన్ని నింపారన్నారు. క్షణమొక యుగంలా... రోజూ రక్షణ సిబ్బంది తోడుగా కార్యాలయానికి వెళ్లేవాడిని. ఆ రోజు సెక్యూరిటీ లేకుండానే విధులకు బయలుదేరాను. కొద్ది సేపటిలో కంపెనీకి చేరుకుంటామనగా అగంతకులు దాడి చేశారు. రెప్పపాటులో నన్ను, మరో ఇంజినీరు అనిష్‌ను వారి వాహనంలోకి తరలించి నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకుపోయారు. అక్కడ మా ఇద్దరినీ వేర్వేరు గదుల్లో ఉంచి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం కల్పించలేదు. కేవలం రొట్టె మాత్రమే ఆహారంగా ఇచ్చేవారు. 18 రోజులూ అది తినే బతికాం. ఎప్పుడు ఏం చేస్తారో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపాం. క్షణమొక యుగంలా గడిచింది. మళ్లీ కుటుంబ సభ్యులను కలుస్తామని అనుకోలేదు. ఆ భగవంతుడి దయ, భారత ప్రభుత్వం కృషి వల్ల సజీవంగా కిడ్నాపర్ల చెర నుంచి వీడాం. కిడ్నాపర్ల డిమాండ్లను నైజీరియా ప్రభుత్వంతోపాటు మా కంపెనీ త్వరగా తీర్చి ఉంటే ఇంకా ముందుగానే విడుదలయ్యేవాళ్లం. మీడియాలో వరుసగా వచ్చిన కథనాల వల్ల ఆలస్యమయింది. నా విడుదలకు ప్రయత్నించిన అందరికీ కృతజ్ఞతలు అంటూ ఉద్వేగంగా సాయి శ్రీనివాస్ ‘సాక్షి’తో మాట్లాడారు. అంతకుముందు స్కైప్‌లో భార్యతో మాట్లాడిన సాయిశ్రీనివాస్ మాసిన గెడ్డంతో నీరసంగా కనిపించారు. ఆరోగ్యం క్షీణించి ఉంటుందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
భర్త కబురు లేక కలవరం
కొలిక్కిరాని కిడ్నాప్ ఉదంతం రెండు రోజులపాటు నైజీరియా గవర్నమెంట్‌కు సెలవులు విశాఖపట్నం : రోజులు గడుస్తున్నా నైజీరియాలో కిడ్నాపైన విశాఖ ఇంజినీరు సాయిశ్రీనివాస్ జాడ కానరావడం లేదు. ఎనిమిది రోజులు గడిచినా కబురు లేకపోవడంతో కుటుంబ సభ్యులు కలవరపడుతున్నారు. ఇంట్లోని సెల్ మోగగానే చల్లని కబురు వస్తుందేమోనని ఆశ పడుతున్నారు. తీరా శ్రీనివాస్ ఆచూకీ కోసం బంధువులు ఫోన్ చేశారని తెలిసి నీరశించిపోతున్నారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లకుండా అమ్మతోనే ఉంటూ నాన్న కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీనివాస్ భార్య లలిత అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా కిడ్నాప్‌పై నైజీరియాలోని భారత హైకమిషన్ చేపడుతున్న చర్యలు తెలుసుకుంటున్నారు. నేడు, రేపు అంటూ కాలయాపన జరుగుతుందే తప్ప పురోగతి ఉండడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక కుటుంబ సభ్యులు దిగులు చెందుతున్నారు. మరో రెండు రోజుల తర్వాతే... రంజాన్ సందర్భంగా నైజీరియా గవర్నమెంట్‌కు రెండు రోజుల పాటు సెలవులు వచ్చాయని అక్కడి భారత హైకమిషన్ నుంచి సమాచారం వచ్చిందని శ్రీనివాస్ భార్య లలిత తెలిపారు. దీంతో మరో రెండు రోజుల తర్వాతే కిడ్నాప్ ఉదంతం కొలిక్కివచ్చే అవకాశం ఉంది. భారత హైకమిషన్ మాత్రం ఆందోళన చెంద వద్దని, సెలవుల అనంతరం కిడ్నాపర్ల చెర నుంచి సురక్షింతంగా శ్రీనివాస్‌ను విడుదల చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారని, దీంతో ఆశగా ఎదురు చూస్తున్నామని లలిత చెబుతున్నారు. -
వీడని ఇంజినీర్ కిడ్నాప్ మిస్టరీ
పెదవాల్తేరు (విశాఖ): నైజీరియాలో కిడ్నాపైన విశాఖ ఇంజినీర్ మంగిపూడి సాయి శ్రీనివాస్ ఉదంతం ఇంకా మిస్టరీగానే వుంది. కిడ్నాప్‌నకు గురై మూడు రోజులైనా దుండగుల నుంచి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సంప్రదింపులు జరపడంతో నైజీరియా ప్రభుత్వం స్పందించి శ్రీనివాస్ విడుదలకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని సుష్మాస్వరాజ్, ఇంజినీర్ కుటుంబ సభ్యులకు శుక్రవారం స్వయంగా ఫోన్ చేసి తెలిపారు. లోకల్ గ్యాంగ్‌లు కిడ్నాప్ చేసినట్టుగా భావిస్తున్నామని, ఎలాంటి భయాందోళన చెందనవసరం లేదని, ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి భరోసా ఇచ్చారు. శ్రీనివాస్ పనిచేస్తున్న డాంగోట్ గ్రూప్ కంపెనీ కూడా తన భర్త విడుదలకు అన్ని చర్యలు చేపడుతున్నట్టు ఇంజినీర్ భార్య లలిత కేంద్ర మంత్రికి తెలిపారు. నైజీరియాలో ఇద్దరు భారతీయ ఇంజినీర్లు మూడు రోజుల కిందట అపహరణకు గురైన విషయం తెలిసిందే. -
నైజీరియాలో ఇద్దరు ఇంజినీర్ల కిడ్నాప్
నైజీరియా: నైజీరియాలో ఇద్దరు భారతీయ ఇంజినీర్లు అపహరణకు గురయ్యారు. కిడ్నాప్ అయిన వారిలో ఆంధ్రప్రదేశ్ విశాఖకు చెందిన ఇంజినీర్ సాయి శ్రీనివాస్‌గా గుర్తించారు. సాయిశ్రీనివాస్ అపహరణతో ఆయన ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. తన భర్తకు ఏమైందోనని భార్య లలిత....తండ్రి ఎలా ఉన్నాడో అని కుమార్తె స్పూర్తి కన్నీటిపర్యంతమౌతున్నారు. సాయిశ్రీనివాస్ జిబోకోలోని డంకోట సిమెంట్ ఫ్యాక్టరీలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. కాగా గతంలో ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు కిడ్నాప్ కు గురైన విషయం తెలిసిందే. కిడ్నాపర్లు వారిని ఇప్పటి వరకూ వారిని విడుదల చేయలేదు. వారి రాక కోసం కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మరో పదేళ్లు గుర్తు పెట్టుకుంటారు!
- దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ‘శుభాకాంక్షలు’, ‘సూర్యవంశం’ వంటి కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని, ‘సుస్వాగతం’తో యువతరం ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు. ‘సుడిగాడు’ చిత్రం తర్వాత మూడేళ్లు స్క్రిప్ట్ వర్క్ చేసి, ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పీడున్నోడు’. తమిళ చిత్రం ‘సుందరపాండ్యన్’కి ఇది రీమేక్. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, సోనారిక జంటగా భీమనేని రోషితా సాయి సమర్పణలో గుడ్‌విల్ సినిమా పతాకంపై భీమనేని సునీత ఈ చిత్రాన్ని నిర్మించారు. డి.జె. వసంత్ అందించిన పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు వీవీ వినాయక్ సీడీని ఆవిష్కరించి హీరోయిన్ తమన్నాకు అందించారు. అనంతరం వినాయక్ మాట్లాడుతూ -‘‘బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా చేస్తున్నాడంటే తన తల్లిదండ్రుల తర్వాత ఆనందపడేది నేనే. ‘అల్లుడు శీను’లో డ్యాన్సులు, ఫైట్లు బాగా చేశాడని అందరూ అన్నారు. ఈ సినిమాతో బాగా నటించాడని పేరొస్తుంది. తను పెద్ద హీరో అవుతాడు’’ అని పేర్కొన్నారు. ‘‘భీమనేనిగారు చెప్పిన కథ నన్ను హాంట్ చేసింది. ఇంత మంచి క్లయిమాక్స్, నటనకు హై స్కోప్ ఉన్న మూవీని వదులుకోకూడదని ఈ చిత్రం చేశా. మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చినందుకు భీమనేనిగారికి థ్యాంక్స్’’ అని సాయి శ్రీనివాస్ తెలిపారు. ‘‘ఒక రీమేక్ చిత్రం కోసం మూడేళ్లు కష్టపడ్డాం. ‘సుడిగాడు’ తర్వాత వసంత్‌కు మంచి అవకాశాలు రాలేదు. ఈ మూడేళ్లు తను నాతో పనిచేశాడు. ప్రేక్షకులు నన్ను మరో ఐదు, పదేళ్లు గుర్తుపెట్టుకునే చిత్రం అవుతుంది’’ అని భీమనేని చెప్పారు. ఈ వేడుకలో నిర్మాత పోకూరి బాబూరావు, దర్శకుడు అనిల్ రావిపూడి, కళాదర్శకుడు-నిర్మాత చంటి అడ్డాల, కెమెరామెన్ విజయ్ ఉలగనాథన్, సంగీతదర్శకుడు ‘వందేమాతరం’ శ్రీనివాస్, రచయిత చంద్రబోస్, అభిషేక్ పిక్చర్స్ అభిషేక్, హీరోయిన్లు రకుల్ ప్రీత్‌సింగ్, రెజీనా, కేథరిన్, హెబ్బా పటేల్, పూర్ణ, సాక్షి చౌదరి, హాసిని తదితరులు పాల్గొన్నారు. -
ఒకేసారి మూడు సినిమాలు!
ఇన్నాళ్లు వెండితెర మీద పోటి పడటానికి సినీ తారలు ఇష్టపడ లేదు. ముఖ్యంగా బడ్జెట్ పెరిగిపోవటం, మార్కెట్ ఆశించిన స్థాయిలో ఉండకపోవటంతో రెండు మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి రిలీజ్‌లతో సీన్ మారిపోయింది. సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు రిలీజ్ అయి అన్ని మంచి టాక్‌తో పాటు, మంచి వసూళ్లను కూడా రాబడుతున్నాయి. దీంతో పోటా పోటి రిలీజ్‌లకు రెడీ అవుతున్నారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. సంక్రాంతిని తలపించే మరో భారీ పోటి త్వరలోనే మరోసారి వెండితెర మీద కనిపించనుంది. స్టార్ హీరోల సినిమాల రిలీజ్‌లతో ఒక్క అడుగు వెనక్కు వేసిన కుర్ర హీరోలు ఒకేసారి బరిలో దిగటానికి రెడీ అవుతున్నాడు. ఫిబ్రవరి 5న ఒకేసారి మూడు ఆసక్తికర సినిమాలు బరిలో దిగుతున్నాయి. భలే భలే మొగాడివోయ్ సినిమాతో మంచి విజయం సాధించిన నాని 'కృష్ణగారి వీర ప్రేమగాథ' సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షిచుకోవడానికి రెడీ అవుతున్నాడు. అల్లుడు శీను సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'స్పీడున్నోడు'గా సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. చాలా రోజులుగా ఓ మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ కూడా 'కృష్ణాష్టమి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు, ఇలా మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో మరోసారి తెలుగు సినీ అభిమానులు పండగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. -
' స్పీడున్నోడు' వర్కింగ్ స్టిల్స్
-
మద్యం మానితే వారి పిల్లలకు నజరానా
మద్యపాన నిషేధంపై మహిళలకు అవగాహన డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ మాకవరపాలెం : మద్యపాన నిషేధంపై డ్వాక్రా మహిళలతో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. జిల్లాలో ఉన్న నాలుగు లక్షల కుటుంబాల్లో 65 శాతం మంది మగవారు మద్యం సేవిస్తున్నట్టు తమ సర్వేలో తేలిందని తెలిపారు. వీరిని మద్యం మాన్పించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 350 మందితో మద్యం మాన్పించామని, వచ్చే మూడేళ్లలో 10 వేల మందిని మద్యానికి దూరం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఒక్కో డ్వాక్రా సభ్యురాలి నుంచి ఏడాదికి రూ.10ల చొప్పున వసూలు చేసి జిల్లా సమాఖ్యలో ఉంచుతామని, ఇందులో మద్యం మానేసిన వారి పిల్లల పేరున రూ.10 వేలు జమ చేస్తామని వివరించారు. రూ.650 కోట్ల రుణాలు: జిల్లాలో ఈ ఏడాది డ్వాక్రా మహిళలకు రూ.650 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించామని డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ సత్యసాయి శ్రీనివాస్ తెలిపారు. గతేడాది రూ.380 కోట్లు లక్ష్యం కాగా రూ.443 కోట్లు రుణాలుగా అందజేశామన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 44 వేల డ్వాక్రా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ రుణాలతోపాటు రూ.100 కోట్లు స్త్రీ నిధి రుణాలు కూడా ఇస్తామన్నారు. డ్వాక్రా మహిళల పిల్లలు 54 వేల మంది విద్యార్థులకు ఏడాదికి ఒక్కొక్కరికి రూ.1200ల చొప్పున రూ.5.66 కోట్ల స్కాలర్‌షిప్‌లుగా అందజేస్తున్నామని తెలిపారు. -
ఈ కథకు శ్రీనివాస్ యాప్ట్ : బోయపాటి
‘‘కథకి నప్పే హీరోతో సినిమా చేయడం నా అలవాటు. నా దగ్గర శ్రీనివాస్‌కి నప్పే కథ ఉంది కాబట్టే, నా అంతట నేను అడిగాను. ఈ కథకు భారీ బడ్జెట్ అవుతుంది. అందుకే, కథ విన్నాక, తానే నిర్మిస్తానని, బయటి బేనర్లో వద్దని బెల్లంకొండ సురేశ్ అన్నారు. ‘భద్ర’ తరహాలో లవ్, ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. తన ప్రేమను గెలిపించుకోవడానికి ఓ ప్రేమికుడు ఎలాంటి దారిలో వెళ్లాడన్నదే కథ’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బెల్లంకొండ సురేష్ సమర్పణలో బెల్లంకొండ గణేశ్ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. వినాయక్ ద్వారా హీరోగా పరిచయం కావడం, రెండో సినిమానే బోయపాటి శ్రీనుతో చేయడం తన అదృష్టమని శ్రీనివాస్ అన్నారు. బోయపాటితో మూడు హిట్ చిత్రాలకు పని చేశానని, తమ కాంబినేషన్లో మరో హిట్ ఖాయం అని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ చెప్పారు. ‘అల్లుడు శీను’తో శ్రీనివాస్‌ని వినాయక్ హీరోగా నిలబెట్టారని, ఆ సినిమా విడుదలకు ముందే బోయపాటి సినిమా చేస్తాననడం ఆనందంగా ఉందని బెల్లంకొండ సురేశ్ చెప్పారు. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించడం ఖాయమని బెల్లంకొండ గణేశ్ అన్నారు. నవంబరులో రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయిక. ఓ ప్రత్యేక పాత్రలో ప్రముఖ కథానాయిక నటించనున్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు: రత్నం. -
శనీశ్వరాలయానికి వస్తే సినిమా హిట్టే..
నర్శింగోలు(జరుగుమల్లి) : సినిమా ప్రారంభించడానికి ముందు శనీశ్వరాలయంలో పూజలు చేస్తే ఆ సినిమా హిట్టవుతుందని తన నమ్మకమని ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శీను పేర్కొన్నారు. మండలంలోని నర్శింగోలు రామలింగేశ్వర శనీశ్వరాలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బోయపాటి విలేకర్లతో ముచ్చటించారు. సినిమాలపై ఆసక్తి ఎలా కలిగింది ? మొదట్లో నేను ఫోటోగ్రాఫర్‌గా పని చేశా. ఆ ఆసక్తితోనే సినీ పరిశ్రమ వైపు అడుగులు వేశా. దమ్ము చిత్రం నిరుత్సాహపరిచింది కదా ? లేదు.. నా కెరీర్లో అది ఒక బెస్ట్ సినిమా. మళ్లీ ఎన్టీఆర్‌తో సినిమా ఎప్పుడు ? మంచి కథ దొరికితే తప్పకుండా సినిమా తీస్తా. రామ్‌చరణ్‌తో సినిమా ఎప్పుడు చేస్తున్నారు? నా కథకు రామ్‌చరణ్ సరిపోతే తప్పకుండా చేస్తా. బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమా ఎప్పుడు మొదలవబోతోంది? నవంబరులో సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం. జానపద, పౌరాణిక చిత్రాలేమైనా తీసే ఆలోచన ఉందా? జానపద, పౌరాణిక చిత్రాలు నిర్మించాలంటే భారీ బడ్జెట్ అవసరమవుతుంది. చక్కని కథతో పాటు నిర్మాత దొరికితే అలాంటి సినిమాలు చేస్తా. ప్రతి సినిమా ప్రారంభానికి ముందు శనీశ్వరాలయానికి వస్తున్నారు. ఏదైనా సెంటిమెంటా? అవును. నా సినిమా ప్రారంభించడానికి ముందు శనీశ్వరాయాలనికి వచ్చి ప్రత్యేకంగా పూజలు చేయించుకుని వెళ్తా. సినిమా హిట్టయిన తర్వాత మళ్లీ వచ్చి స్వామి వారికి మొక్కు చెల్లించుకుంటా. భద్ర, తులసి, దమ్ము, సింహా, లెజండ్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. శనీశ్వర స్వామిపై నమ్మకంతో ప్రత్యేక పూజలు చేస్తున్నా. ప్రతి రోజూ నా పేరుతో ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాజకీయాలపై మీ అభిప్రాయం? ప్రస్తుతం నా దృష్టంతా సినిమాల పైనే ఉంది. రాజకీయాలపై ఆసక్తి లేదు. -
శీను స్టెప్పులు కేక..!
అన్నం ఉడికిందో, లేదో ఒక్క మెతుకు చెప్పేస్తుంది. అలాగే.. హీరోగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఏంటో.. సినిమా కంటే ముందే ప్రచార చిత్రాలు చెప్పేస్తున్నాయి. ముఖ్యంగా నృత్యాల్లో శ్రీనివాస్ కనబరుస్తున్న ఈజ్‌కి ప్రశంసల వర్షమే కురుస్తోందంటే అతిశయోక్తి కాదు. ఓ స్టార్‌తో సినిమా చేస్తే తానెలా ఖర్చుపెడతారో అంతకంటే భారీగా, కోటి ఆశలతో కోట్లు ఖర్చుపెట్టి బెల్లంకొండ సురేశ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎలాగైనా తన తనయుడ్ని తెలుగు చిత్రసీమలోని స్టార్లలో ఒకడిగా నిలబెట్టడమే ప్రస్తుతం ఆయన ధ్యేయం. ఈ సినిమాకు దర్శకునిగా వి.వి.వినాయక్‌ని ఎంచుకోవడంలో కారణం కూడా అదే. తనను దర్శకునిగా నిలబెట్టిన బెల్లకొండ సురేశ్ రుణాన్ని తీర్చుకోవడానికి వినాయక్‌కి దక్కిన గొప్ప అవకాశం ‘అల్లుడు శీను’. అందుకే... ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారాయన. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు బెల్లంకొండ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘దేవిశ్రీప్రసాద్ స్వరాలు ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపు చేశాయి. ఇంత మంచి ఆడియో ఇచ్చిన దేవిశ్రీకి, నా కుమారుడు శ్రీనివాస్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేయబోతున్న వినాయక్‌కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా’’ అన్నారు. విడుదల రోజు నుంచే అమ్మకాల పరంగా పాటలు సంచలనం సృష్టిస్తున్నాయని ఆదిత్య ప్రతినిధులు చెప్పారు. ఈ చిత్రానికి రచన: కోన వెంకట్, బాబీ, కెమెరా: చోట కె.నాయుడు, కూర్పు: గౌతంరాజు, కళ: ఎ.ఎస్. ప్రకాశ్, నిర్మాత: బెల్లంకొండ గణేశ్‌బాబు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్. -
పింఛన్ల బట్వాడాకు ప్రత్యేక చర్యలు
23 నుంచి 28 వరకు వేలిముద్రల సేకరణ ఇదే ఆఖరి అవకాశం నక్కపల్లి: వేలిముద్రల సేకరణ పూర్తికాక జిల్లా వ్యాప్తంగా మూడు నెలలుగా నిలిచిపోయిన సామాజిక భద్రత పింఛన్ల బట్వాడా కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వేలిముద్రల సేకరణ కోసం ఈ నెల 23 నుంచి 28 వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీటి ప్రతులను డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ శనివారం అన్ని మండల కార్యాలయాలకు పంపించారు. మూడు నెలలుగా నిలిచిన పింఛన్లు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రస్తుతం మాన్యువల్ విధానంలో ఇస్తున్న పింఛన్లను ఇక నుంచి బయోమెట్రిక్ విధానంలో బట్వాడా చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఫినో సంస్థ ద్వారా బట్వాడా చేస్తున్న పింఛన్లను మే నెల నుంచి తపాలా కార్యాలయాల ద్వారా చెల్లిస్తోంది. బయోమెట్రిక్ విధానంలో పింఛన్ల పంపిణీకి లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు సేకరించింది. ఇలా వేలిముద్రలు ఇవ్వని వారు, కుష్టురోగులు, వయోవృద్ధులు, వేళ్లు సక్రమంగా లేనివారి వేలిముద్రలు లేకపోవడంతో పింఛన్లను మూడునెలలుగా నిలిపివే శారు. లబ్ధిదారులంతా గగ్గోలు పెట్టడంతో ప్రభుత్వం స్పందించింది. వేలిముద్రలు ఇవ్వలేని వారి తరపున వారి బంధువుల్లో ఒకరి వేలిముద్రలు తీసుకుని పింఛన్లను బట్వాడా చేయాలని, ఇలాంటి లబ్ధిదారులు, వారి తరపున పింఛన్ తీసుకునే వారి వివరాల జాబితాను ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించింది. ఈ నెల 23 నుంచి 28 వరకు ఫినో సంస్థ గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి వేలిముద్రలు సేకరించాలని పేర్కొంది. సిబ్బంది కొరత ఉంటే ఐకేపీ సిబ్బందిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి వేలిముద్రల సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మండల పరిషత్తులు, తపాలా శాఖను ప్రభుత్వం ఆదేశించింది. వారి పరిధిలోని గ్రామాల్లో ఎన్రోల్మెంట్ ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. వచ్చే నెల నుంచి బయోమెట్రిక్ ద్వారా పింఛన్లు జూలై నెల నుంచి పింఛన్లను బయోమెట్రిక్ విధానం ద్వారా లబ్ధిదారులకు లేదా వారి మెసెంజర్లకు బట్వాడా చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బయోమెట్రిక్‌కు వీలుకాని లబ్ధిదారుల వివరాలను ఫారం 2లో నమోదు చేసి సీఈవో సెర్ప్, హైదరాబాద్‌కు పంపించాలని ప్రభుత్వం పేర్కొంది. వేలిముద్రలు రాని వారి పింఛన్లను వారి తరపు బంధువుల ద్వారా చెల్లించేటప్పుడు లబ్ధిదారులకు సక్రమంగా అందాయో, లేదో సామాజిక తనిఖీ నిర్వహించాల్సిన బాధ్యత ఎంపీడీవోలదేనని ప్రభుత్వం పేర్కొంది. చనిపోయిన లేదా గ్రామం విడిచి వెళ్లిన లబ్ధిదారుల పేర్లను గ్రామ కార్యదర్శులు నమోదు చేసి ఎంపీడీవోల ద్వారా సెర్ప్ సంస్థకు పంపాలని కూడా పేర్కొంది. ఈ నెల 23 నుంచి 28 వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వేలిముద్రలు ఇవ్వని వారి పింఛన్లు నిలిచిపోతాయని, ఇదే ఆఖరి అవకాశమని ఈవోఆర్డీ కుమార్ స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
ఎంసెట్‌లో ర్యాంకుల పంట
ఎంసెట్-2014 పరీక్షకు జిల్లాలో మొత్తం 11 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 8,800 మంది, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో 2,200 మంది పరీక్ష రాశారు. ఇంజినీరింగ్‌లో ... ఎంసెట్‌లో ఇంజినీరింగ్ విభాగంలో ర్యాంకుల సాధనలో స్థానిక శ్రీ చైతన్య విద్యార్థులు అగ్రగాములుగా నిలిచారు. ఒంగోలుకు చెందిన కొంపల్లి వెంకటసాయికిరణ్ ఇంజినీరింగ్ విభాగంలో 140/160 మార్కులతో రాష్ట్రస్థాయిలో 195వ ర్యాంకు సాధించారు. అదే విధంగా పసుమర్తి ఎస్.వి. సాయిశిరీష 137/160 మార్కులతో 273వ ర్యాంకు, వారణాసి సత్యలక్ష్మి 125/160 మార్కులతో 757వ ర్యాంకు, మరో ఐదుగురు విద్యార్థులు 2 వేల లోపు ర్యాంకులను సాధించారు. కొడాలి సత్యనారాయణరావు 118/160తో 1288 ర్యాంకు, కనగాల సుస్మిత 115/160 మార్కులతో 1522వ ర్యాంకు, జె.శ్యాంసుందర్ 115/160 మార్కులతో 1637వ ర్యాంకు, కొండపి వెంకటసాయి చైతన్య 114/160 మార్కులతో 1846వ ర్యాంకు, డి.కావ్యశ్రీ 113/160 మార్కులతో 1911వ ర్యాంకులు తెచ్చుకున్నారు. మెడిసిన్‌లో... ఎంసెట్ మెడిసిన్ విభాగంలో పలువురు తమ సత్తా చాటారు. వెయ్యి లోపు ర్యాంకులు సాధించి తమకు తిరుగులేదని నిరూపించారు. ఒంగోలు నగర పరిధిలోని కొప్పోలు ఎయిడెడ్ పాఠశాలలో పని చేస్తున్న పి.శేషిరెడ్డి కుమార్తె శ్రీనిజ 145/160 మార్కులతో 313వ ర్యాంకు సాధించారు. ఒంగోలుకు చెందిన చలువాది మానస మెడిసిన్‌లో 519వ ర్యాంకు సాధించారు. అద్దంకికి చెందిన విజయ సాయికుమార్ 591వ ర్యాంకు తెచ్చుకున్నాడు. ఒంగోలుకు చెందిన తాటిపర్తి కావ్య 140/160 మార్కులతో 592వ ర్యాంకు తెచ్చుకుంది. కావ్య తల్లి నిర్మల నాగులుప్పలపాడు జిల్లా పరిషత్ హైస్కూలులో ఫిజికల్ సైన్స్ స్కూలు అసిస్టెంట్‌గా పని చేస్తుండగా, తండ్రి సుందరరామిరెడ్డి పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగంలో డీఈగా పని చేస్తున్నారు. నారు హరిప్రియరెడ్డి 1667వ ర్యాంకు సాధించారు. స్టేట్ ఫస్ట్ రావడం ఆనందంగా ఉంది సాయి శ్రీనివాస్ తల్లిదండ్రులు డాక్టర్లు మోహన్‌రామ్, రాధిక మా కుమారుడికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఆనందంగా ఉంది. స్టేట్ ర్యాంక్ వస్తుందని ఆశిస్తున్నాం కానీ ఫస్ట్ ర్యాంక్ వస్తోందని ఊహించలేదు. ప్రతి వారం విజయవాడ శ్రీ చైతన్య క్యాంపస్‌కు వెళ్లి మా అబ్బాయి చదువుతున్న తీరు, మార్కులపై విశ్లేషణ చేసేవాళ్లం. లెక్చరర్స్‌తో మాట్లాడి మెరుగైన ఫలితాల కోసం సూచనలు చేసే వాళ్లం. మంచి డాక్టరై పశ్చిమ ప్రకాశంలో ప్రజలకు సేవ చేయాలని మా అబ్బాయి శ్రీనివాస్‌కు సూచిస్తున్నాం. మొదటి నుంచి చదువులో మంచి ప్రతిభ కనబరిచేవాడు. ఇటీవల నిర్వహించిన వెల్లూరు సీఎంసీలో కూడా మెడికల్ సీటు వచ్చింది. బెనారస్ హిందూ యూనివర్శిటీలో కూడా సీటు వచ్చింది. ఎయిమ్స్ పరీక్ష రాశాడు. ఫలితాల కోసం చూస్తున్నాం. ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్‌లో కూడా ర్యాంక్ వచ్చింది.