ఒకేసారి మూడు సినిమాలు! | Nani, sunil, Sai srinivas clash on feb 5th | Sakshi
Sakshi News home page

ఒకేసారి మూడు సినిమాలు!

Published Tue, Jan 19 2016 8:31 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

ఒకేసారి మూడు సినిమాలు! - Sakshi

ఒకేసారి మూడు సినిమాలు!

ఇన్నాళ్లు వెండితెర మీద పోటి పడటానికి సినీ తారలు ఇష్టపడ లేదు. ముఖ్యంగా బడ్జెట్ పెరిగిపోవటం, మార్కెట్ ఆశించిన స్థాయిలో ఉండకపోవటంతో రెండు మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి రిలీజ్లతో సీన్ మారిపోయింది. సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు రిలీజ్ అయి అన్ని మంచి టాక్తో పాటు, మంచి వసూళ్లను కూడా రాబడుతున్నాయి. దీంతో పోటా పోటి రిలీజ్లకు రెడీ అవుతున్నారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు.

సంక్రాంతిని తలపించే మరో భారీ పోటి త్వరలోనే మరోసారి వెండితెర మీద కనిపించనుంది. స్టార్ హీరోల సినిమాల రిలీజ్లతో ఒక్క అడుగు వెనక్కు వేసిన కుర్ర హీరోలు ఒకేసారి బరిలో దిగటానికి రెడీ అవుతున్నాడు. ఫిబ్రవరి 5న ఒకేసారి మూడు ఆసక్తికర సినిమాలు బరిలో దిగుతున్నాయి. భలే భలే మొగాడివోయ్ సినిమాతో మంచి విజయం సాధించిన నాని 'కృష్ణగారి వీర ప్రేమగాథ' సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షిచుకోవడానికి రెడీ అవుతున్నాడు.

అల్లుడు శీను సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'స్పీడున్నోడు'గా సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. చాలా రోజులుగా ఓ మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ కూడా 'కృష్ణాష్టమి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు, ఇలా మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్కు రెడీ అవుతుండటంతో మరోసారి తెలుగు సినీ అభిమానులు పండగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement