అందరూ మెచ్చే శుభలేఖ+లు | bellam ramakrishna reddy bagged shubhalekha+lu rights | Sakshi
Sakshi News home page

అందరూ మెచ్చే శుభలేఖ+లు

Published Sun, Nov 4 2018 5:21 AM | Last Updated on Sun, Nov 4 2018 5:21 AM

bellam ramakrishna reddy bagged shubhalekha+lu rights - Sakshi

‘శుభలేఖ+లు’ పోస్టర్‌

‘‘పెళ్లి అనే శుభకార్యానికి ముందు అందులోని సమాచారాన్నంతా క్లుప్తంగా శుభలేఖలో రాసి కావాల్సిన బంధువులందరికీ పంచుతాం. మరి సినిమాకు శుభలేఖలంటే ‘టీజర్, ట్రైలర్స్‌’లే. బంధువులు ఎవరంటే ప్రేక్షకులే. పెళ్లి కార్డ్‌ని చూసి పెళ్లి ఏ రీతిలో జరగబోతోందో అని ఊహించినట్టుగా, ‘శుభలేఖ+లు’ చిత్రం కూడా బావుండబోతోందని టాక్‌ వినిపిస్తోంది. ‘మా ‘శుభలేఖ+లు’ చిత్రం కూడా కచ్చితంగా విజయం సాధిస్తుంది అనే నమ్మం ఉంది’’ అంటున్నారు చిత్రబృందం. సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ జంటగా ప్రియా వడ్లమాని ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘శుభలేఖ+లు’. శరత్‌ నర్వాడే దర్శకత్వంలో సి. విద్యాసాగర్, ఆర్‌.ఆర్‌. జనార్థన్‌ నిర్మించారు. చిత్రాన్ని వీక్షించి, బాగా నచ్చడంతో చిత్రం హక్కులను పుష్యమి ఫిల్మ్స్‌ అధినేత బెల్లం రామకృష్ణారెడ్డి కొనుగోలు చేశారు. ఈ చిన్న చిత్రాన్ని సుమారు మూడున్నర కోట్ల ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేశారని టాక్‌. ‘శుభలేఖ+లు’ డిసెంబర్‌ 7న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం చెప్పిన విశేషాల్లో కొన్ని...

 ‘వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి జరిపించాలి అన్నది పాత నానుడి. ఇప్పటి యువత నాడి తెలిసిన దర్శక– నిర్మాతలు ఒక అబద్ధం ఆడకుండా ఒకరి బలహీనతలు ముందుగానే మరొకరికి పరిచయం చేసి ఎలా ఒక్కటవ్వాలనుకుంటున్నారు అనే పాయింట్‌తో ఈ చిత్రం ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలు వేరు కాపురాలు పెట్టేశాయి. నిర్ణయాలు కలిసి తీసుకోవడం నుంచి ఎవరికి తోచిన నిర్ణయాలు వాళ్లు తీసుకుని కేవలం నిర్ణయాలను తెలియజేస్తున్నారు. కొంచెం కష్టం అయినా సరే పెద్దలను ఒప్పించవచ్చు. ఇలాంటి కాంటెపరరీ సబ్జెక్ట్‌కి యువత బాగా కనెక్ట్‌ అవుతారు. పాటలకు విశేష స్పందన లభిస్తోంది. కథను ముందుకు తీసుకువెళ్లేలా పాటలుంటాయి.

చిన్న చిత్రాలకు పెద్ద సంవత్సరం
2018 చిన్న సినిమాలకు చాలా పెద్ద సంవత్సరం. రిలీజ్‌ అప్పుడు చిన్న స్థాయిలో కనిపించినా, బాక్సాఫీస్‌ వద్ద పెద్ద సందడి చేస్తున్నాయి. మా సినిమా కూడా కచ్చితంగా అదే స్థాయిలో ఉంటుంది. ‘ఛలో, ఆర్‌ఎక్స్‌ 100, కంచరపాలెం, సమ్మోహనం, గూఢచారి’ లాంటి చిత్రాల జాబితాలో మా చిత్రం కూడా చోటు సంపాదించుకుంటుందని నమ్ముతున్నాం.

కంటెంట్‌ బాగుంటే...
పెద్ద సినిమాలకు పెట్టింది తిరిగొస్తే హిట్‌ అను కుంటాం. లాభాలు చూసేది చాలా తక్కువ ఉంటుంది. కానీ చిన్న సినిమాల విషయంలో అలా కాదు. సినిమా టాక్‌ని బట్టి ఎన్నింతలైనా లాభం చూడొచ్చు నిర్మాతలు. కంటెంట్‌ బావుంటే చిన్న హీరో, పెద్ద హీరో అనే బేధాలను బాక్సాఫీస్‌ అంకెల్లో ప్రేక్షకుడు చూపించడం లేదు. మా సినిమా విషయంలో కూడా అదే జరుగుతుందనే నమ్మకం ఉంది.

మంచి ఇంపాక్ట్‌
అటెన్షన్‌ స్పాన్‌ తక్కువ ఉన్న ఈ రోజుల్లో కూడా ప్రేక్షకులు ‘శుభలేఖ+లు’ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూసున్నారంటే అది కచ్చితంగా టీజర్స్, ట్రైలర్స్, సినిమాలోని పాటలు క్రియేట్‌ చేసిన ఇంపాక్టే. సాయి శ్రీనివాస్, ప్రియా వడ్లమాని, దీక్షా శర్మ గుర్తుండిపోయేలా స్క్రీన్‌ ప్రెజెన్స్‌ కనబరిచారు. శరత్‌ నర్వాడ్‌ దర్శకత్వ ప్రతిభ గురించి  ఎంతైనా చెప్పొచ్చు. డిసెంబర్‌ 7న విడుదల కానున్న ఈ చిత్రం కోసం పాటలు వింటూ, ట్రైలర్‌ చూస్తూ ఆసక్తిగా ఎదురు చూడటమే’’ అంటూ తమ చిత్రం గ్యారంటీగా  హిట్‌ అనే నమ్మకాన్ని కూడా చిత్రబృందం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement