ఎంసెట్‌లో ర్యాంకుల పంట eamcet ranks are released | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌లో ర్యాంకుల పంట

Published Tue, Jun 10 2014 12:22 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ఎంసెట్‌లో ర్యాంకుల పంట - Sakshi

ఎంసెట్-2014 పరీక్షకు జిల్లాలో మొత్తం 11 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 8,800 మంది, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో 2,200 మంది పరీక్ష రాశారు.
 
ఇంజినీరింగ్‌లో ...
ఎంసెట్‌లో ఇంజినీరింగ్ విభాగంలో ర్యాంకుల సాధనలో స్థానిక శ్రీ చైతన్య విద్యార్థులు అగ్రగాములుగా నిలిచారు. ఒంగోలుకు చెందిన కొంపల్లి వెంకటసాయికిరణ్ ఇంజినీరింగ్ విభాగంలో 140/160 మార్కులతో రాష్ట్రస్థాయిలో 195వ ర్యాంకు సాధించారు. అదే విధంగా పసుమర్తి ఎస్.వి. సాయిశిరీష 137/160 మార్కులతో 273వ ర్యాంకు, వారణాసి సత్యలక్ష్మి 125/160 మార్కులతో 757వ ర్యాంకు, మరో ఐదుగురు విద్యార్థులు 2 వేల లోపు ర్యాంకులను సాధించారు. కొడాలి సత్యనారాయణరావు 118/160తో 1288 ర్యాంకు, కనగాల సుస్మిత 115/160 మార్కులతో 1522వ ర్యాంకు, జె.శ్యాంసుందర్ 115/160 మార్కులతో 1637వ ర్యాంకు, కొండపి వెంకటసాయి చైతన్య 114/160 మార్కులతో 1846వ ర్యాంకు, డి.కావ్యశ్రీ 113/160 మార్కులతో 1911వ ర్యాంకులు తెచ్చుకున్నారు.  
 
 మెడిసిన్‌లో...
 ఎంసెట్ మెడిసిన్ విభాగంలో పలువురు తమ సత్తా చాటారు. వెయ్యి లోపు ర్యాంకులు సాధించి తమకు తిరుగులేదని నిరూపించారు. ఒంగోలు నగర పరిధిలోని కొప్పోలు ఎయిడెడ్ పాఠశాలలో పని చేస్తున్న పి.శేషిరెడ్డి కుమార్తె శ్రీనిజ 145/160 మార్కులతో 313వ ర్యాంకు సాధించారు. ఒంగోలుకు చెందిన చలువాది మానస మెడిసిన్‌లో 519వ ర్యాంకు సాధించారు. అద్దంకికి చెందిన విజయ సాయికుమార్ 591వ ర్యాంకు తెచ్చుకున్నాడు. ఒంగోలుకు చెందిన తాటిపర్తి కావ్య 140/160 మార్కులతో 592వ ర్యాంకు తెచ్చుకుంది. కావ్య తల్లి నిర్మల నాగులుప్పలపాడు జిల్లా పరిషత్ హైస్కూలులో ఫిజికల్ సైన్స్ స్కూలు అసిస్టెంట్‌గా పని చేస్తుండగా, తండ్రి సుందరరామిరెడ్డి పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగంలో డీఈగా పని చేస్తున్నారు. నారు హరిప్రియరెడ్డి 1667వ ర్యాంకు సాధించారు.
 
 స్టేట్ ఫస్ట్ రావడం ఆనందంగా ఉంది
 సాయి శ్రీనివాస్ తల్లిదండ్రులు డాక్టర్‌లు మోహన్‌రామ్, రాధిక
 మా కుమారుడికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఆనందంగా ఉంది.  స్టేట్ ర్యాంక్ వస్తుందని ఆశిస్తున్నాం కానీ ఫస్ట్ ర్యాంక్ వస్తోందని ఊహించలేదు.   ప్రతి వారం విజయవాడ శ్రీ చైతన్య క్యాంపస్‌కు వెళ్లి మా అబ్బాయి చదువుతున్న తీరు, మార్కులపై విశ్లేషణ చేసేవాళ్లం. లెక్చరర్స్‌తో మాట్లాడి మెరుగైన ఫలితాల కోసం సూచనలు చేసే వాళ్లం. మంచి డాక్టరై పశ్చిమ ప్రకాశంలో ప్రజలకు సేవ చేయాలని మా అబ్బాయి శ్రీనివాస్‌కు సూచిస్తున్నాం. మొదటి నుంచి చదువులో మంచి ప్రతిభ కనబరిచేవాడు. ఇటీవల నిర్వహించిన వెల్లూరు సీఎంసీలో కూడా మెడికల్ సీటు వచ్చింది. బెనారస్ హిందూ యూనివర్శిటీలో కూడా సీటు వచ్చింది. ఎయిమ్స్ పరీక్ష రాశాడు. ఫలితాల కోసం చూస్తున్నాం. ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్‌లో కూడా ర్యాంక్ వచ్చింది.

Advertisement
 
Advertisement
 
Advertisement