రెండు ప్రేమకథలు | shubhalekha+lu movie first schedule completed | Sakshi
Sakshi News home page

రెండు ప్రేమకథలు

Published Tue, Sep 25 2018 4:16 AM | Last Updated on Tue, Sep 25 2018 4:16 AM

shubhalekha+lu movie first schedule completed - Sakshi

దీక్షశర్మ రైనా, శ్రీనివాస సాయి

పెళ్లంటే నూరేళ్ల పంట. అందులో అబద్ధాలకి తావులేదు. అన్నీ నిజాలే ఉండాలి అనుకుంటోంది నేటి యువత. ఈ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘శుభలేఖ+లు’. శ్రీనివాస సాయి, దీక్షశర్మ రైనా  జంటగా ప్రియా వడ్లమాని లీడ్‌ రోల్‌లో నటించారు. శరత్‌ నర్వాడే దర్శకత్వంలో సి.విద్యాసాగర్, జనార్థన్‌ ఆర్‌.ఆర్‌. నిర్మించిన ఈ సినిమా తొలి కాపీ సిద్ధమైంది. సి.విద్యాసాగర్, జనార్థన్‌ ఆర్‌.ఆర్‌.  మాట్లాడుతూ– ‘‘ఓ పెళ్లింట్లో జరిగిన రెండు ప్రేమ కథల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. నటీనటులందరూ దాదాపుగా కొత్తవారే అయినా ఎక్కడా ఆ ఫీలింగ్‌ ఉండదు.

సహజంగా నటించారు. వాళ్లని చూస్తే మన హైదరాబాద్‌లో ఇంతమంది టాలెంటెడ్‌ యాక్టర్లు ఉన్నారా?  అనిపిస్తుంది. జంధ్యాలగారి సినిమాను మధుర్‌ భండార్కర్‌ రీమేక్‌ చేస్తే ఎలా ఉంటుందో మా చిత్రం అలా ఉంటుంది. కె.ఎం.రాధాకృష్ణన్‌ ఓ సినిమా అంగీకరించారంటే అందులో సంగీతానికి ప్రాధాన్యం ఉన్నట్టే. ఆయన సంగీతం అందించిన ‘ఆనంద్, చందమామ’ చిత్రాల జాబితాలో మా సినిమా నిలుస్తుంది’’ అన్నారు. వంశీ నెక్కంటి, మోనా బేద్రే, అప్పాజీ, డా. ఇర్ఫాన్, తిరువీర్, సింధు తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: సి.సుధాసాగర్, కెమెరా: యస్‌. మురళీమోహన్‌ రెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement