వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'ముఖచిత్రం'. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ఈనెల 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శకుడు, మీడియాతో పంచుకున్నారు.
(ఇది చదవండి: నన్ను డస్కీ అని పిలిచేవారు.. ప్రియాంక చోప్రా ఆవేదన)
రచయిత సందీప్ రాజ్ మాట్లాడుతూ.. 'లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నా అభిమాన దర్శకుడు బాలచందర్ సినిమాలోని ఓ సందర్భాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కథ సిద్ధం చేసుకున్నా. కరోనా పాండమిక్ తర్వాత ప్రేక్షకులు పెద్ద పెద్ద చిత్రాలనే చూసేందుకు వస్తున్నారు. కానీ ఈ సినిమా దాన్ని బ్రేక్ చేస్తుందని నమ్మకంగా ఉన్నాం. మా చిత్రాన్ని విశ్వక్ సేన్‌తో పాటు రవితేజ కూడా చూశారు.' అని అన్నారు.
దర్శకుడు గంగాధర్ మాట్లాడుతూ..'నేను పిల్ల జమీందార్, భాగమతి సినిమాలకు వర్క్ చేశా. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే మంచి సందేశాన్నిచ్చే సినిమా ఇది. ఈ సినిమాలో ఒక న్యాయవాది పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం విశ్వక్ సేన్ అయితే బాగుంటుందని భావించాం. విశ్వక్ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment