Mukhachitram Movie
-
షూటింగ్లో గాయం, పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న హీరోయిన్
షూటింగ్లో హీరోహీరోయిన్లు గాయపడం సాధారణంగా వింటూనే ఉంటాం. తాజాగా ఓ యంగ్ హీరోయిన్లో షూటింగ్ గాయపడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ముఖచిత్రం. శుక్రవారం(డిసెంబర్ 9న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో చిత్ర డైరెక్టర్ గంగాధర్ ఆసక్తిర విషయం బయటపెట్టాడు. కాగా చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించిన విషయం తెలిసిందే. అందులో ముంబైకి చెందిన కొత్త నటి అయోషా ఖాన్ ఒకరు. ఈ మూవీతో ఆమె టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇక మూవీ ప్రమోషన్స్‌లో హీరోహీరోయిన్లతో పాటు ఇంటర్య్కలో పాల్గొన్న డైరెక్టర్ గంగాధర్ చిత్ర విశేషాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా అయోషా షూటింగ్లో గాయపడినట్లు వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఓ కారు యాక్సిడెంట్ సీన్ ఉంటుంది. ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో హీరోయిన్ అయేషాకు తీవ్రంగా గాయపడింది. అనుభవం లేకపోవడం వల్ల తను ఆ సిచ్చువేషన్ను హ్యాండిల్ చేయలేకపోయింది. దీంతో కింద పడటంతో తన నడుము, వెన్నుభాగంలో గాయమైంది. చెప్పాలంటే ఆ గాయాలు చాలా తీవ్రమైనవి. దానివల్ల తను జీవితాంత వీలు చేర్పైనే కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ తను తక్కువ బరువు ఉండటం వల్ల పెద్దగా ప్రమాదం జరగలేదు. కొద్ది రోజుల్లోనే తను ఈ గాయం నుంచి కోలుకుంది. లేదంటే జీవితాంతం వీల్ చైర్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉండేది’ అంటూ డైరెక్టర్ గంగాధర్ పేర్కొన్నాడు. అనంతరం అయేషా చాలా బాగా నటించిందని, ఈ సినిమాతో తర్వాత తనకు మంచి మంచి అవకాశాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. చదవండి: మాల్దీవుల్లో యాంకర్ రష్మీ రచ్చ.. వీడియో వైరల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న ‘సూర్య’ వెబ్ సిరీస్ నటి, వరుడు ఎవరంటే..! -
ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసేలా 'ముఖచిత్రం'
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'ముఖచిత్రం'. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ఈనెల 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శకుడు, మీడియాతో పంచుకున్నారు. (ఇది చదవండి: నన్ను డస్కీ అని పిలిచేవారు.. ప్రియాంక చోప్రా ఆవేదన) రచయిత సందీప్ రాజ్ మాట్లాడుతూ.. 'లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నా అభిమాన దర్శకుడు బాలచందర్ సినిమాలోని ఓ సందర్భాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కథ సిద్ధం చేసుకున్నా. కరోనా పాండమిక్ తర్వాత ప్రేక్షకులు పెద్ద పెద్ద చిత్రాలనే చూసేందుకు వస్తున్నారు. కానీ ఈ సినిమా దాన్ని బ్రేక్ చేస్తుందని నమ్మకంగా ఉన్నాం. మా చిత్రాన్ని విశ్వక్ సేన్‌తో పాటు రవితేజ కూడా చూశారు.' అని అన్నారు. దర్శకుడు గంగాధర్ మాట్లాడుతూ..'నేను పిల్ల జమీందార్, భాగమతి సినిమాలకు వర్క్ చేశా. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే మంచి సందేశాన్నిచ్చే సినిమా ఇది. ఈ సినిమాలో ఒక న్యాయవాది పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం విశ్వక్ సేన్ అయితే బాగుంటుందని భావించాం. విశ్వక్ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.' అని అన్నారు. -
ద్యావుడా.. ఒకే రోజు 17 సినిమాలు...ఎందుకిలా?
ఒకే వారంలో నాలుగైదు చిన్న సినిమాలు రిలీజ్ అవ్వడం టాలీవుడ్‌కి కొత్తేమి కాదు. ఒక్కోసారి 7-8 సినిమాలు కూడా రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ వారంతం ఒకటి కాదు రెండు కాదు.. ఒకేసారి 17 సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాయి. టాలీవుడ్లో ఇదో రికార్డు అని చెప్పొచ్చు. సాధారణంగా పండుగ సీజన్స్‌లో పెద్ద సినిమాలు ఎక్కువగా విడుదలవుతాయి కాబట్టి చిన్న చిత్రాలు వెనక్కి తగ్గి.. పోటీలేని టైమ్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఈ క్రమంలో చిన్న చిత్రాల మధ్య బాక్సాఫీస్ వార్ మొదలవుతుంది. ‘తగ్గేదే లే’ అన్నట్లుగా ఒకేసారి ఐదారు బరిలోకి దిగుతాయి. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు సేఫ్ జోన్లోకి వెళ్లిపోతాయి. కానీ నెగెటివ్ టాక్ వస్తే.. మరుసటి రోజే థియేటర్స్ నుంచి బయటకు వెళ్లాల్సిందే. అందుకే పోటీగా ఎక్కువ చిత్రాలు ఉన్నా.. విడుదలకు వెనక్కి తగ్గరు చిన్న నిర్మాతలు. (చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!) అయితే ఈ వారం మాత్రం బాక్సాఫీస్ పోరు మాములుగా లేదు. ఈ ఏడాది చివరి మాసం కావడం.. సంక్రాంతి బరిలో వరుసగా పెద్ద చిత్రాలు ఉండడంతో.. డిసెంబర్ 9న ఏకంగా 17 చిన్న చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఎన్ని థియేటర్స్ దొరికాయి.. ఎక్కడెక్కడ దొరకలేదు అనే విషయాన్ని పట్టించుకోకుండా.. మన సినిమా విడుదలైతే చాలు..అదే పదివేలు అన్నట్లుగా చిన్న నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాల జాబితాలో గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం, ముఖచిత్రం, ప్రేమదేశం, చెప్పాలని ఉంది, లెహరాయి, నమస్తే సేట్జీ, ప్రేమదేశం(ఈ ఓల్డ్ చిత్రం మళ్లీ థియేటర్స్‌లో విడుదలవుతుంది), రాజయోగం, డేంజరస్, విజయానంద్, ఏపీ 04 రామపురం, ఐ లవ్ యు ఇడియట్, మనం అందరం ఒక్కటే, ఆక్రోశం, ఏయ్ బుజ్జి నీకు నేనే, సివిల్ ఇంజనీర్ చిత్రాలు ఉన్నాయి. వీటిలో గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం, డేంజరస్తో పాటు మరో రెండు, మూడు చిత్రాలు మాత్రమే ప్రచారం ప్రారంభించాయి. మిగతా చిత్రాలన్ని కేవలం పోస్టర్, ట్రైలర్ విడుదల చేసి నేరుగా థియేటర్స్‌లోకి వస్తున్నాయి. మరి వీటిలో ఏ సినిమాలు ప్రేక్షకులను మెప్పించి విజయం సాధిస్తాయో చూడాలి. -
షూటింగ్ టైమ్‌లో యాక్సిడెంట్..ఇప్పటికీ పెయిన్ తగ్గలేదు: హీరోయిన్
‘ముఖచిత్రం’ నా తొలి తెలుగు సినిమా. మొదటి చిత్రంలోనే ఓ డిఫరెంట్ రోల్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో యాక్సిడెంట్ సీన్స్ చేసేప్పుడు కష్టపడ్డాను. నాకూ గాయాలయ్యాయి. రెండు నెలలు రెస్ట్ తీసుకున్నాను. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ లో జరిగిన యాక్సిడెంట్ వల్ల పెయిన్స్ వస్తుంటాయి. ఏమైనా కష్టపడితే గానీ లైఫ్ లో ఏదీ దక్కదు అన్నట్లు ఈ సినిమాకు గాయపడినా మంచి చిత్రంలో భాగమవడం సంతృప్తిగా ఉంది’అని హీరోయిన్ అయేషా ఖాన్ అన్నారు. వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "ముఖచిత్రం". ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందించగా, గంగాధర్ దర్శకత్వం వహించారు. ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియా వడ్లమాని మాట్లాడుతూ...నేను ఇప్పటిదాకా ఐదు సినిమాల్లో నటించాను. ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటించాను. ఈ చిత్రంలో ఒక మంచి సందేశాన్ని చూపిస్తున్నాం. మన రియల్ లైఫ్ లో చాలాసార్లు విన్నదే, చూసిందే కానీ ఇప్పటిదాకా తెరపై ఇలాంటి పాయింట్ ను ఎవరూ తెరకెక్కించలేదు. . మేము మా విజన్ కంటే దర్శకుడు సందీప్ ఎలా మమ్మల్ని తెరపై చూపించాలనుకుంటున్నాడు అనే విజన్ ను నమ్మాము. దాన్నే ఫాలో అయ్యాము. సందీప్ ఒక కొత్త తరహా సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాడు. తప్పకుండా ఆదరిస్తాని కోరుకుంటున్నాను అన్నారు. హీరోయిన్ అయేషా ఖాన్ మాట్లాడుతూ...ఈ సినిమాలో సిటీ గర్ల్ మాయా ఫెర్నాండేజ్ పాత్రలో నటించాను. లైఫ్ లో ఎలా ఉండాలనే విషయంలో కంప్లీట్ గా అవేర్ నెస్ ఉన్న అమ్మాయి తను. దేనికీ కాంప్రమైజ్ కాకుండా, తను అనుకున్న పని చేస్తుంటుంది. నాకు తెలుగులో తొలి సినిమా. మొదటి చిత్రంలోనే ఓ డిఫరెంట్ రోల్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ చిత్రం నా డెబ్యూ మూవీగా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.