Mukhachitram Director Revealed Heroine Ayesha Khan Injured While Shooting - Sakshi
Sakshi News home page

Mukhachitram Heroine Ayesha Khan: షూటింగ్‌లో హీరోయిన్‌కి కారు ప్రమాదం.. ఆలస్యంగా వెలుగులోకి!

Published Fri, Dec 9 2022 12:58 PM | Last Updated on Fri, Dec 9 2022 2:23 PM

Mukhachitram Director Revealed Heroine Ayesha Khan Injured While Shooting - Sakshi

షూటింగ్‌లో హీరోహీరోయిన్లు గాయపడం సాధారణంగా వింటూనే ఉంటాం. తాజాగా ఓ యంగ్‌ హీరోయిన్‌లో షూటింగ్‌ గాయపడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ముఖచిత్రం. శుక్రవారం(డిసెంబర్‌ 9న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో చిత్ర డైరెక్టర్‌ గంగాధర్‌ ఆసక్తిర విషయం బయటపెట్టాడు. కాగా చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించిన విషయం తెలిసిందే.

అందులో ముంబైకి చెందిన కొత్త నటి అయోషా ఖాన్‌ ఒకరు. ఈ మూవీతో ఆమె టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇక మూవీ ప్రమోషన్స్‌లో హీరోహీరోయిన్లతో పాటు ఇంటర్య్కలో పాల్గొన్న డైరెక్టర్‌ గంగాధర్‌ చిత్ర విశేషాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా అయోషా షూటింగ్‌లో గాయపడినట్లు వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఓ కారు యాక్సిడెంట్‌ సీన్‌ ఉంటుంది. ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో హీరోయిన్‌ అయేషాకు తీవ్రంగా గాయపడింది. అనుభవం లేకపోవడం వల్ల తను ఆ సిచ్చువేషన్‌ను హ్యాండిల్‌ చేయలేకపోయింది.

దీంతో కింద పడటంతో తన నడుము, వెన్నుభాగంలో గాయమైంది. చెప్పాలంటే ఆ గాయాలు చాలా తీవ్రమైనవి. దానివల్ల తను జీవితాంత వీలు చేర్‌పైనే కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ తను తక్కువ బరువు ఉండటం వల్ల పెద్దగా ప్రమాదం జరగలేదు. కొద్ది రోజుల్లోనే తను ఈ గాయం నుంచి కోలుకుంది. లేదంటే జీవితాంతం వీల్‌ చైర్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఉండేది’ అంటూ డైరెక్టర్‌ గంగాధర్‌ పేర్కొన్నాడు. అనంతరం అయేషా చాలా బాగా నటించిందని, ఈ సినిమాతో తర్వాత తనకు మంచి మంచి అవకాశాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.  

చదవండి: 
మాల్దీవుల్లో యాంకర్‌ రష్మీ రచ్చ.. వీడియో వైరల్‌
పెళ్లి పీటలు ఎక్కబోతున్న ‘సూర్య’ వెబ్‌ సిరీస్‌ నటి, వరుడు ఎవరంటే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement