![Vishwak Sen Das Ka Dhamki Shooting Wrapped Up - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/25/MAIN.jpg.webp?itok=MowvV21M)
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దాస్ కా దమ్కీ'. ఇందులో నివేదా పేతురాజు హీరోయిన్‌గా నటిస్తుంది.రావు రమేశ్, పృథ్విరాజ్, హైపర్ ఆది ప్రధాన పాత్రలు పోషించగా,లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. విశ్వక్‌సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్టర్స్, ట్రైలర్ ఇప్పటికే మూవీపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేస్తుంది.
తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది. తాజాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుపుతూ మేకర్స్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment