‘ధమ్కీ’ సినిమాకు చాలా ఖర్చు పెట్టాను : విశ్వక్‌ సేన్‌ | Vishwak Sen About Dhamki Movie Press Meet | Sakshi
Sakshi News home page

‘ధమ్కీ’ సినిమాకు చాలా ఖర్చు పెట్టాను : విశ్వక్‌ సేన్‌

Published Wed, Mar 22 2023 2:59 PM | Last Updated on Wed, Mar 22 2023 3:47 PM

Vishwak Sen About Dhamki Movie Press Meet - Sakshi

‘‘నేను సినిమాలు చేస్తున్నది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు.. సినిమాలు తీయడానికే. ‘ధమ్కీ’ సినిమాకు చాలా ఖర్చు పెట్టాను. నటనతో పాటు నిర్మాణం, దర్శకత్వం అంశాల్లోనూ చాలా నిజాయితీగా పని చేశాను. ప్రేక్షకులపై నమ్మకంతో చాలా రిస్క్‌లు తీసుకుని నేను చేసిన ఈ సినిమా నా జీవితాన్ని మార్చుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలోని సెకండాఫ్‌ను విశ్వక్‌ మాత్రమే తీయగలడు అనేలా ఉంటుంది.

మా నాన్న నన్నెంతో భరించారు. ఆయనకు ఈ సినిమా డబ్బులు తీసుకుని రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నటుడు, దర్శక–నిర్మాత విశ్వక్‌సేన్‌. ఆయన నటించి, స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement