niveda peturaj
-
ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసిన హీరోయిన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రముఖ తారలు వెబ్‌సిరీస్‌లో నటించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ఎందుకంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులకు దగ్గర కావచ్చు. ఈ క్రమంలో హీరోయిన్ నివేదా పేతురాజ్‌ను కూడా అలాంటి లక్కీఛాన్స్కు ఓకే చెప్పింది. ఇంతకు ముందు పలు చిత్రాలలో కథానాయికగా నటించిన ఈమె ఆ తరువాత తెలుగులోనూ సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించింది. తాజాగా కాలా అనే వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అవినాష్ తివారీ కథానాయకుడిగా నటించిన ఇందులో రోహన్ వినోద్ మెహ్రా, నితిన్ గులాటి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. బిజాయ్ నంబియార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌ను భూషణ్ కుమార్, కిషణ్ కుమార్, బిజాయ్ నంబియార్ కలిసి నిర్మించారు. ఈ సిరీస్ ఈ నెల 15వ తేది నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది మనీ లాండరింగ్, హవాలా కుంభకోణంతో సాగే క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అని నటుడు అవినాష్ తివారీ పేర్కొన్నారు. తను ఐబీ ఆఫీసర్‌గా నటించినట్లు చెప్పారు. తాను కూడా ఐబి అధికారిణిగా నటించినట్లు నివేద పేతురాజ్ పేర్కొంది. తాను నటించిన తొలి వెబ్‌సిరీస్ ఇదేనని చెప్పింది. ఇందులో నటించడం సరికొత్త అనుభవంగా పేర్కొంది. కాలా వెబ్‌సిరీస్‌లో పలు యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అలాంటి సీన్లలో నటించేందుకు అవినాష్ తివారీ ఎంతగానో సహకరించారని తెలిపింది. ఈ వెబ్‌సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేసింది. దీంతో పాటు తెలుగులో పరువు అనే మరో వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నానంది. అదేవిధంగా తమిళంలోనూ చిత్రాలు చేయబోతున్నట్లు తెలిపింది. చదవండి: 6 ఏళ్ల తర్వాత సడన్‌గా ఫోటోలు లీక్.. అంటే ముందే ప్లాన్.. ఇలాంటి పనులు చేసేముందు ఆలోచించాలి.. రాహుల్ ఫైర్ -
‘ధమ్కీ’ సినిమాకు చాలా ఖర్చు పెట్టాను : విశ్వక్ సేన్
‘‘నేను సినిమాలు చేస్తున్నది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు.. సినిమాలు తీయడానికే. ‘ధమ్కీ’ సినిమాకు చాలా ఖర్చు పెట్టాను. నటనతో పాటు నిర్మాణం, దర్శకత్వం అంశాల్లోనూ చాలా నిజాయితీగా పని చేశాను. ప్రేక్షకులపై నమ్మకంతో చాలా రిస్క్‌లు తీసుకుని నేను చేసిన ఈ సినిమా నా జీవితాన్ని మార్చుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలోని సెకండాఫ్‌ను విశ్వక్ మాత్రమే తీయగలడు అనేలా ఉంటుంది. మా నాన్న నన్నెంతో భరించారు. ఆయనకు ఈ సినిమా డబ్బులు తీసుకుని రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నటుడు, దర్శక–నిర్మాత విశ్వక్సేన్. ఆయన నటించి, స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించారు. -
ఫస్ట్ టైమ్ ఎక్కువగా డ్యాన్స్ చేశా!
‘‘ఒక హీరో నిర్మాతగా చేయడం వేరు. కానీ, హీరోగా నటిస్తూనే దర్శకత్వం చేయడం గ్రేట్. ‘దాస్ కా ధమ్కీ’కి హీరో, నిర్మాత, డైరెక్టర్.. ఇలా మూడు బాధ్యతలని విశ్వక్ చక్కగా నిర్వర్తించారు. నేను పని చేసిన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్‌గారి తర్వాత అంత ఎనర్జీ ఉన్న దర్శకుడిని విశ్వక్‌లో చూశాను’’ అని హీరోయిన్ నివేదా పేతురాజ్ అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఈ సినిమా రేపు (బుధవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా నివేదా పేతురాజ్ మాట్లాడుతూ– ‘‘విశ్వక్‌తో ‘పాగల్’ మూవీ చేశాను. ఆ తర్వాత ‘దాస్ కా ధమ్కీ’ కథ యూనిక్‌గా అనిపించడంతో ఓకే చెప్పాను. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిది. నా కెరీర్లో తొలిసారి ఈ చిత్రంలో గ్లామరస్ రోల్‌తో పాటు ఎక్కువగా డ్యాన్స్ చేశాను. విశ్వక్‌లో అద్భుతమైన ఐడియాలు ఉన్నాయి. అయితే తానే నటుడిగా నటిస్తూ డైరెక్షన్ చేయడం కాకుండా వేరే హీరోలని డైరెక్ట్ చేస్తే బావుంటుందని నా అభిప్రాయం. తన కెరీర్లో ‘దాస్ కా ధమ్కీ’ ఒక మైలురాయిగా నిలుస్తుంది. నేను కేవలం సినిమాలపైనే ఆధారపడటం లేదు. చెన్నైలో రెస్టారెంట్, ఫ్లవర్ షాప్ వ్యాపారాలు చేస్తున్నాను. దర్శకత్వం చేయాలని ఉంది కానీ, అందుకు ఇంకా టైమ్ పడుతుంది. నిర్మాతల కష్టాలు కళ్లారా చూసిన నాకు సినిమా నిర్మించే ఆలోచన లేదు. ప్రస్తుతం సుస్మితగారు నిర్మిస్తున్న ఓ సినిమా, హిందీలో టీ సిరీస్ వారి సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
అప్పుడే నేను మళ్లీ పుట్టాను.. విశ్వక్ డైరెక్షన్ మానేయాలి: తారక్
‘‘సినిమా పట్ల విశ్వక్ సేన్‌కి ఎంతో పిచ్చి ఉంది. ఆ పిచ్చి తగ్గిపోకూడదు. ఇలాంటివాళ్లను ప్రోత్సహిస్తేనే పరిశ్రమ ఇంకా ముందుకెళుతుంది. ‘దాస్ కా ధమ్కీ’ హిట్ అవ్వాలి’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్ హీరోయిన్. కరాటే రాజు (విశ్వక్ సేన్ తండ్రి) నిర్మించిన ‘దాస్ కా ధమ్కీ’ ఈ నెల 22న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘ఒకే చట్రంలో ఇరుక్కుపోతున్నానని చాలా కాలం తర్వాత రియలైజ్ అయిన నేను, మీరు (అభిమానులు) కాలర్ ఎత్తుకునే సినిమాలు చేస్తానని మాట ఇచ్చాను.. ఆ మాట అన్నప్పుడే నటుడిగా నేను మళ్లీ పుట్టాను. వైవిధ్యమైన నటన కోసం నేను తాపత్రయపడుతున్నాను కాబట్టే మిమ్మల్ని కాలర్ ఎగరేసుకునేలా చేస్తున్నానని అనుకుంటున్నాను. విశ్వక్ కూడా ఒకే తరహా పాత్రల నుంచి బయటికొచ్చి, కొత్తగా చేస్తున్నాడు. ‘దాస్ కా ధమ్కీ’ బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఆ తర్వాత తను దర్శకత్వం మానేయాలి. ఎందుకంటే కొత్త యువ దర్శకులకు నీలాంటి వాళ్లు అవకాశాలు ఇవ్వాలి. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచ చిత్ర పటంలో ఆల్‌టైమ్ టాప్‌లో ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ ఈ రోజు ప్రపంచ చిత్రపటంలో నిలబడిందంటే, ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుందంటే దానికి మా యూనిట్‌తో పాటు యావత్ తెలుగు, భారతదేశ చిత్రపరిశ్రమ, ప్రేక్షక దేవుళ్లు కూడా కారణం. కీరవాణి, చంద్రబోస్‌గార్లు ఆస్కార్ అవార్డు తీసుకుంటున్నప్పుడు నాకు వాళ్లు కనిపించలేదు.. ఇద్దరు భారతీయులు కనిపించారు.. ఇద్దరు తెలుగువాళ్లు కనిపించారు’’ అన్నారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఇండియాలో బెస్ట్ యాక్టర్ ఎవరంటే ఎన్టీఆర్ అన్న అని నేను ఎప్పుడో చెప్పాను. నా సినిమాని ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ వచ్చాడు. ఆయన రాకతో నా సినిమా బ్లాక్‌బస్టర్ స్టార్ట్ అయిపోయినట్లే’’అన్నారు. ‘‘ఫలక్‌నుమా దాస్’ తీసినప్పుడు మా అబ్బాయి విశ్వక్ ఎవరికీ తెలియదు. ఎంతో పబ్లిసిటీ చేసి, సినిమా విడుదలకి ముందే స్టార్డమ్ తెచ్చుకున్నాడు. ‘దాస్ కా ధమ్కీ’ కోసం 15 నెలలు కష్టపడ్డాడు’’ అన్నారు కరాటే రాజు. -
షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విశ్వక్ సేన్.. వీడియో రిలీజ్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దాస్ కా దమ్కీ'. ఇందులో నివేదా పేతురాజు హీరోయిన్గా నటిస్తుంది.రావు రమేశ్, పృథ్విరాజ్, హైపర్ ఆది ప్రధాన పాత్రలు పోషించగా,లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. విశ్వక్సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్టర్స్, ట్రైలర్ ఇప్పటికే మూవీపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది. తాజాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుపుతూ మేకర్స్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. -
రిలీజ్ తర్వాత పాన్ ఇండియా అవుతుంది
‘‘నటన, దర్శకత్వం నాకు రెండు కళ్లు. హీరోగా సక్సెస్ అయి, ఆ తర్వాత ఓ 30 ఏళ్లకు డైరెక్షన్ చేయాలనుకున్నాను. కానీ సరైన అవకాశాలు దొరక్క నా తొలి సినిమా ‘ఫలక్‌నుమా దాస్’కి నా బ్యానర్లో నేనే దర్శకత్వం వహించాల్సి వచ్చింది. దర్శకుడిగా నాకు పూర్తి సంతృప్తి దక్కలేదు. ఎందుకంటే ఇది రీమేక్ చిత్రం. ప్రస్తుతం నేను చేస్తున్న దాస్కా ‘దమ్కీ’ చిత్రం నాలోని దర్శకత్వ ప్రతిభను చూపిస్తుందనే నమ్ముతున్నాను’’ అని విశ్వక్ సేన్ అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘దమ్కీ’. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్. వన్మయీ క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో వేసిన సెట్లో యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. ఇంకా ఓ సాంగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. శుక్రవారం జరిగిన ఈ సినిమా విలేకరుల సమావేశంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో హోటల్లో వర్క్ చేసే కృష్ణదాస్ అనే పాత్రలో కనిపిస్తాను. యాక్షన్ కొత్తగా ఉంటుంది. బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్–జుజితో అద్భుతమైన క్లయిమాక్స్ సీన్స్‌ను ప్లాన్ చేశాం. ఈ కథలో కలర్స్ మారుతుంటాయి. ఆడియన్స్ నవ్వుతుంటారు.. అలాగే చెమటలు పడతాయి. కథలో అంత బలం ఉంది. అవుట్‌పుట్‌పై నమ్మకం ఉంది. అందుకే ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నాం. రిలీజ్ తర్వాత పాన్ ఇండియా సినిమా అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నవరసాలు ఉంటాయి’’ అన్నారు కరాటే రాజు. -
స్క్రిప్ట్ చదివే నిర్మాతలు ఇద్దరే!
‘స్రవంతి’ రవికిశోర్‌గారికి నేను చాలా రుణపడి ఉంటాను. స్క్రిప్ట్‌ను మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకూ చదివే నిర్మాతలు ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరు రామానాయుడుగారు, మరొకరు రవికిశోర్‌గారు. నా కెరీర్ మొదట్లోనే నాలుగు సినిమాలు రవికిశోర్‌గారితో పనిచేసే అదృష్టం నాకు దక్కింది’’ అంటూ రవికిశోర్‌కి పాదాభివందనం చేశారు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ‘రెడ్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘రామ్‌ను ‘దేవదాస్’ సినిమాలో చూసినప్పుడు రవికిశోర్‌గారితో మెరుపుతీగలా ఉన్నాడు అన్నాను. చూసినంత సులువు కాదు.. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి సినిమాలో నటించటం’’ అన్నారు. రామ్ మాట్లాడుతూ– ‘‘మా పెదనాన్నగారితో చాలా సినిమాలు చేశాను. కానీ స్టేజ్ మీద ఎప్పుడూ ఆయన గురించి మాట్లాడలేదు. నా దృష్టిలో ‘రెడ్’ సినిమాకి రియల్ హీరో పెదనాన్న రవికిశోర్‌గారు. ఈ సినిమాని చంటిబిడ్డలా కాపాడుతూ వచ్చారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన రవికిశోర్‌గారికి, మంచి విజువల్స్ ఇచ్చిన సమీర్‌రెడ్డి గారికి థ్యాంక్స్’’ అన్నారు కిశోర్ తిరుమల. ఈ కార్యక్రమంలో మాళవికా శర్మ, అమృతా అయ్యర్, నివేదా పేతురాజ్, ఆర్ట్ డైరెక్టర్ ఏయస్ ప్రకాశ్, ఎడిటర్ జునైద్ తదితరులు పాల్గొన్నారు. రవికిశోర్‌కి పాదాభివందనం చేస్తున్న త్రివిక్రమ్ -
లేడీ విజయ్ సేతుపతి అనిపించుకోవాలనుంది
‘‘తెలుగు సినిమాల్లో రెండో హీరోయిన్ పాత్రలే చేస్తున్నారెందుకు? అని అడుగుతున్నారు.. నేను నా పాత్ర గురించి మాత్రమే ఆలోచిస్తా.. ప్రాధాన్యం ఉంటే చాలు.. అది మొదటి హీరోయినా? రెండో హీరోయినా? అనేది చూడను’’ అన్నారు హీరోయిన్ నివేదా పేతురాజ్. రామ్ హీరోగా, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా నివేదా పేతురాజ్ చెప్పిన విశేషాలు. ► వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా’ చేశాను. కిశోర్‌గారి దర్శకత్వంలో ‘చిత్రలహరి’ ఇప్పుడు ‘రెడ్’ సినిమా చేశా. వీరిద్దరి ప్రతిభపై నాకు నమ్మకం ఉంది. వీళ్ల సినిమాలంటే కథ ఏంటి? నా పాత్ర ఏంటి? అని అడగకుండా ఒప్పుకుంటా. ► ‘రెడ్’ సినిమాలో నాది ఇన్నోసెంట్ పోలీస్ పాత్ర. కానీ బయటకు రఫ్‌గా ఉంటాను. పోలీస్ పాత్ర కోసం ప్రత్యేకించి హోమ్‌వర్క్ చేయలేదు. ఎందుకంటే తమిళంలో ఓ సినిమాలో పోలీస్ పాత్రలో నటించాను. ఆ అనుభవం ఈ పాత్రకి బాగా ఉపయోగపడింది. ► ‘చిత్రలహరి’లో నాది చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర. ‘అల వైకుంఠపురములో’ చిత్రం చేసినందుకు ఎలాంటి బాధ లేదు. ఆ సినిమా చాలామందికి రీచ్ అయింది. ‘రెడ్’ సినిమాలో నాది పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర. ఇందులో రామ్ చేసిన రెండు పాత్రలతో నాకు సీన్లు ఉన్నాయి కానీ హీరోయిన్లతో లేవు. ► నాకు కామెడీ పాత్రలంటే ఇష్టం. అయితే తెలుగులో అన్నీ సీరియస్ పాత్రలే వస్తున్నాయి. అది కూడా హోమ్లీగా ఉండేవే. గ్లామరస్ రోల్స్ చేయడానికి అభ్యంతరం లేదు. ఏ ఇండస్ట్రీలో అయినా ప్రస్తుత పరిస్థితుల్లో హీరోయిన్లు ఎక్కువ రోజులు ఉండలేరు. అందుకే ఉన్నన్ని రోజులూ అన్ని రకాల పాత్రలూ చేయాలనుంది. తమిళ హీరో విజయ్ సేతుపతి అన్ని పాత్రలూ చేస్తున్నారు. నాకూ ఆయనలా చేయాలనుంది. నాకు లేడీ విజయ్ సేతుపతి అనిపించుకోవాలనుంది. ► కెరీర్ ప్రారంభంలో తమిళ్లో వరుసగా ఎనిమిది సినిమాలు ఒప్పుకున్నాను. అవి ఎందుకు ఒప్పుకున్నానా? అని ఆ తర్వాత అనిపించింది. ఇప్పుడు ఏ పాత్ర నాకు సరిపోతుందో దాన్నే ఎంచుకుంటున్నాను. ∙‘విరాటపర్వం’లో నాది అతిథి పాత్ర. విశ్వక్ సేన్ ‘పాగల్’లో నా పాత్ర సరదాగా ఉంటుంది. మరో తెలుగు సినిమా సైన్ చేశాను. -
మా `రెడ్` యూనిట్‌కు అలాంటి అనుభవాలే..
‘‘కొన్ని సంఘటనలను అవతలివాళ్లు చెబుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మరికొన్నిసార్లు నమ్మబుద్ధి కాదు. ఆ మాటల్లో అతిశయోక్తులు ధ్వనిస్తాయి. కానీ అలాంటి సంఘటనలు మన జీవితంలో ఎదురైనప్పుడు? అవే దృశ్యాలు మళ్లీ మళ్లీ కళ్ల ముందు మెదులుతుంటాయి. ఇప్పుడు మా `రెడ్` యూనిట్ సభ్యులకు కూడా అలాంటి అనుభవాలే మెదిలినట్టు. మా`రెడ్`టీమ్‌లో ఈ మధ్య దీనికి సంబంధించిన చర్చే ఎక్కువగా జరుగుతోంది`` అని అంటున్నారు ప్రముఖ నిర్మాత `స్రవంతి` రవికిశోర్. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం`రెడ్`. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇందులో హీరోగా నటించారు. ఫిబ్రవరి లో ఈ చిత్రంలోని రెండు పాటల చిత్రీకరణ ఇటలీలో జరిగింది. కోవిడ్-19తో అల్లాడుతున్నఇటలీ గురించి, అక్కడ ఆ వైరస్ సోకడానికి కొన్నాళ్ల ముందు గడిపిన క్షణాల గురించి`స్రవంతి` రవికిశోర్ వివరించారు. (‘మణిశర్మ మెలోడీ వచ్చేది ఎప్పుడంటే?’) `స్రవంతి` రవికిశోర్ మాట్లాడుతూ.. ``సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో -5 డిగ్రీల ఉష్ణోగ్రతతో, ఎటుచూసినా స్వచ్ఛంగా సుందరంగా ఉంటుంది డోలమైట్స్. ఈ పర్వత తీర ప్రాంతంలో ఇప్పటిదాకా పలు హాలీవుడ్ సినిమాల షూటింగులు జరిగాయి. తెలుగు సినిమాల షూటింగ్‌లు ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు రామ్‌తో తీస్తున్న `రెడ్` షూటింగ్ అక్కడ చేద్దామని మా డైరక్టర్ కిశోర్ తిరుమల అన్నారు. అప్పటికే ఆ ప్రాంతం గురించి తెలుసు కాబట్టి వెంటనే ఓకే అనుకున్నాం. రెండు పాటలు చిత్రీకరించడానికి టీమ్‌తో ఇటలీ చేరుకున్నాం. టుస్కాన్, ఫ్లారెన్స్, డోలమైట్సలో హీరో రామ్, హీరోయిన్ మాళవికా శర్మ మీద పాటలు చిత్రీకరించాం. ఇటీవల రిలీజ్ చేసిన ‘నువ్వే నువ్వే’ లిరికల్ సాంగ్‌లో లేక్‌గార్డ్ అందాలు కూడా కనిపిస్తాయి. లేక్‌గార్డ్ ప్రస్తావన ఎందుకంటే... ఈ ప్రాంతం బెర్గామోకి కేవలం గంటం పావు ప్రయాణ దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఇటలీలో కోవిడ్-19కి ఎపిక్ సెంటర్‌గా బెర్గామో గురించి అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి15న లేక్ గార్డలోనూ, ఫిబ్రవరి 16న డోలమైట్స్లోనూ షూటింగ్ చేశాం. మేం అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఆరు రోజులకు... అంటే ఫిబ్రవరి 22న డోలమైట్స్కు బ్రిటిష్ స్కై టీం వెళ్లీంది’’ అని చెప్పారు. (ఇలాంటి కేస్ ఇదే ఫస్ట్ టైమ్..) ఇక ‘‘అక్కడికి వెళ్లిన 22 మందిలో 17 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అప్పటిదాకా సుందరంగా, అద్భుతమైన అనుభవంగా అనిపించిన డోలమైట్ గురించి ఆలోచించగానే మమ్మల్ని కరోనా కలవర పెట్టింది. కేవలం వారం రోజులు ముందుగా అక్కడి నుంచి వచ్చిన మా యూనిట్ అంతా సురక్షితంగా ఉంది. ఇలాంటి విషయాల గురించి ఆలోచించినప్పుడు అదృష్టం కాక మరేంటి? అని అనిపిస్తుంది. ఈ విషయాన్నే అక్కడ పాటలకు కొరియోగ్రఫీ చేసిన శోభి మాస్టర్, మా యూనిట్ సభ్యులు గుర్తుచేస్తున్నారు. ఇటలీలోనే కాదు మన దగ్గరా కరోనా కలవరపెడుతోంది. ఈ వైరస్ బారి నుంచి తప్పించుకోవడమే మన ముందున్న కర్తవ్యం. మానవాళి సురక్షితంగా ఉండాల్సిన ఈ తరుణంలో వినోదం గురించి ఆలోచించడాన్ని మేం కూడా వాయిదా వేశాం. అయితే ఏప్రిల్ 9న ‘రెడ్’ విడుదల చేయాలనుకున్నాం కానీ ప్రస్తుతం పరిస్థుతులు అనుకూలంగా లేవు. సమాజం మామూలు స్థితికి వచ్చాక, అప్పుడు `రెడ్` విడుదల గురించి ప్రకటిస్తాం. కరోనా కోరల్లో చిక్కుకోకుండా ఉండాలంటే అందరూ ఇళ్లల్లోనే ఉండాలి. పరిశుభ్రతను పాటించాలి`` అని అన్నారు. (ఆనందంగా ఉన్నప్పుడే వినోదం ) కాగా రామ్, నివేదా పేతురాజ్,మాళవికా శర్మ, అమృతా అయ్యర్ తదితరులు నటిస్తున్న చిత్రం ‘రెడ్’. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: జునైద్, సమర్పణ: కృష్ణ పోతినేని, నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్, దర్శకత్వం: కిశోర్ తిరుమల. -
బర్త్‌డే స్పెషల్
రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రెడ్’. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య పోతినేని సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఇందులో నివేదా పేతురాజ్ కథానాయికగా నటించనున్నారు. శనివారం నివేదా పుట్టినరోజు సందర్భంగా ఆమెను కథానాయికగా ఖరారు చేసిన విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. ఆమె పుట్టినరోజు వేడుకలు కూడా ‘రెడ్’ చిత్రబృందం సమక్షంలో గోవాలో జరిగాయి. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. -
ద్విపాత్రాభినయం
సినిమా: సంఘ తమిళన్ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. వైవిధ్యానికి పెద్ద పీట వేసే నటుల్లో విజయ్‌సేతుపతి ఒకరని చెప్పవచ్చు. హీరో, విలన్ అన్న తారతమ్యాలు చూడకుండా పాత్ర నచ్చితే చేయడానికి రెడీ అంటున్నారు. అదే విధంగా తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లోనూ నటించేస్తున్నాడు. ఇలా బహుభాషా నటుడిగా తన పేరును విస్తరింపజేసుకుంటున్న విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సంఘతమిళన్. ప్రముఖ నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ పతాకంపై బి.భారతీరెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో విజయ్‌సేతుపతికి జంటగా అందాల తారలు రాశీఖన్నా, నివేదాపేతురాజ్ నటిస్తున్నారు. స్కెచ్ చిత్రం ఫేమ్ విజయ్‌చందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కారైక్కుడిలో ప్రారంభించుకుని పలు ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంది. తాజాగా సంఘ తమిళన్ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇందులో నటుడు విజయ్‌సేతుపతి ద్విపాత్రాభినయం చేయడం విశేషం. నటి సిమ్రాన్, సూరి అసుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న విషయాన్ని నటి రాశీఖన్నా తన ట్విట్టర్లో పేర్కొంది. దీంతో పాటు కొన్ని ఫొటోలను అందులో పోస్ట్ చేసింది. నటుడు విజయ్‌సేతుపతి ప్రస్తుతం ఒక మలయాళ చిత్రంలో నటిస్తున్నాడు. ఈయన తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటించిన భారీ చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రంలో ముఖ్యపాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. -
నివేదకు సూపర్ ఆఫర్
తమిళసినిమా : నటి నివేదాపేతురాజ్కో సూపర్ ఆఫర్ తలుపు తట్టింది. ఈ అమ్మడు నటించిన రెండు చిత్రాలు గతేడాది తెరపైకి వచ్చినా, ఓ ఫట్ అన్నట్టుగా ఆడాయి. అయినా నివేదాకు అవకాశాలు మాత్రం వరుస కడుతున్నాయి. దుబాయిలో పెరిగిన ఈ తమిళ అమ్మాయి గ్లామర్ పాత్రల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలకే ప్రాముఖ్యతనిస్తోంది. ప్రస్తుతం వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటించిన పార్టీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మంచి విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది. కాగా ప్రస్తుతం ప్రభుదేవాకు జంటగా పోన్ మాణిక్యవేల్ చిత్రంలో పాటు, విష్ణువిశాల్‌తో జగజల కిల్లాడీ అనే కామెడీ కథా చిత్రంలో నటిస్తోంది. దీనికి ఎళిల్ దర్శకుడు. వీటితో పాటు ఒక తెలుగు చిత్రం ఈమె చేతిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నివేదాపేతురాజ్ను జాక్‌పాట్ లాంటి అవకాశం వరించిందన్నది తాజా సమాచారం. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతితో రోమాన్స్ చేసే లక్కీచాన్స్ వరించింది. అవును విజయ్‌సేతుపతి వాలు, స్కెచ్ చిత్రాల ఫేమ్ విజయ్‌చందర్ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఇందులో ఇప్పటికే నటి రాశీఖన్నా ఒక కథానాయకిగా ఎంపికైంది. మరో నటిగా నివేదాపేతురాజ్ను ఎంపిక చేసినట్లు సమాచారం. మొత్తం మీద విజయ్‌సేతుపతి ఇద్దరు బ్యూటీస్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారన్నమాట. -
నివేదాకు లక్కీచాన్స్
తమిళసినిమా: యువ నటి నివేదా పేతురాజ్‌కు అవకాశాలు వరుసగా తలుపుతడుతున్నాయి. ఒరునాళ్ కూత్తు చిత్రంతో కోలీవుడ్‌లో హీరోయిన్గా పరిచయమైన ఈ దుబాయ్ రిటర్న్ తమిళ నటికి ఆ తరువాత కెరీర్ కాస్త తడబడ్డా తాజాగా వేగం పుంజుకుంది. నిజం చెప్పాలంటే జయంరవితో టిక్ టిక్ టిక్ చిత్రంలో రొమాన్స్ చేసే అవకాశం రావడంతోనే ఈ అమ్మడి లక్కు స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు. ఈ చిత్రం వచ్చే నెల తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తొలి ఇండియన్ స్పేస్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలనంతరం తన టైమ్ బాగుంటుందని భావించిన నివేదా పేతురాజ్‌కు అంతకు ముందే భారీ అవకాశాలు వరించడం విశేషమే. ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంటున్న ఈ బ్యూటీ నటించిన మూడు చిత్రాలు 2018లో వరుసగా తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. జయంరవితో నటించిన టిక్ టిక్ టిక్, వెంకట్‌ప్రభు నిర్మించిన పార్టీ, విజయ్‌ఆంథోనికి జంటగా నటిస్తున్న తిమిరు పుడిచవన్ చిత్రాలు ఈ ఏడాదిలో విడుదల కానున్నాయి. తాజాగా మరో లక్కీఛాన్స్ నివేదా పేతురాజ్‌ను వరించింది. డాన్సింగ్‌స్టార్ ప్రభుదేవాతో రొమాన్స్ చేసే అవకాశమే అది. అవును ప్రభుదేవా తాజాగా హీరోగా జపక్ నెమీచంద్ ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందుతో ప్రభుదేవా తొలిసారిగా పోలీస్ అధికారిగా నటించనున్నారు. మంచి యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఈ చిత్రం ఉంటుందంటున్నారు చిత్ర వర్గాలు. ఏసీ.మౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాయకిగా నివేదా పేతురాజ్‌ను ఎంపిక చేశారు. ఈమెతో పాటు ముఖ్యపాత్రల్లో సీనీయర్ దర్శకుడు మహేంద్రన్, సురేశ్‌మీనన్ నటించనున్నారు. మరోవిశేషం ఏమిటంటే ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించనున్నారు. అజిత్ నటిస్తున్న విశ్వాసం చిత్రం తరువాత ఈయన కమిట్ అయిన చిత్రం ఇదే అవుతుంది. -
డాన్సింగ్ కింగ్‌తో రొమాన్స్‌కు..
తమిళసినిమా: నృత్యదర్శకుడిగా దుమ్మురేపిన ప్రభుదేవా ఆ తరువాత దర్శకుడిగా కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ వరకూ సంచలనం సృష్టించారు. తాజాగా కథానాయకుడిగా యమ బీజీ అయిపోయారు. రెండు మూడు చిత్రాలు షూటింగ్లో మరో రెండు మూడు చిత్రాలు కమిట్మెంట్లో ఉన్నాయి. తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చదరం 2 చిత్రం ఫేమ్ దర్శకుడు సుమంత్ రాధాకృష్ణన్ తాజా చిత్రంలో ప్రభుదేవా కథానాయకుడిగా నటించనున్నారు. ఇందులో నివేదాపేతురాజ్ ఆయనతో రొమాన్స్ చేసే అవకాశాలున్నట్లు తాజా సమాచారం. తొలి చిత్రం ఒరునాళ్ కూత్తు చిత్రంలోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటీవల నటించిన పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రం పెద్దగా ప్రేక్షకాదరణను పొందలేకపోయింది. దీంతో జయం రవితో జత కడుతున్న టిక్ టిక్ టిక్ చిత్రంపైన చాలా అశలు పెట్టుకుంది. శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అంతరిక్షంలో జరిగే కథా చిత్రంగా తెరకెక్కుతోంది. దర్శకుడు సుమంత్ రాధాకృష్ణన్ ఇటీవల నటి నివేదాపేతురాజ్ను కలిసి కథను వినిపించారట. కథ నచ్చడంతో పాటు ప్రభుదేవాతో నటించడానికి ఈ అమ్మడు చాలా ఆసక్తిని కనబరచిందట. ఈ విషయాన్ని దర్శకుడు సుమంత్ రాధాకృష్ణన్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. త్వరలోనే ఆ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో రొమాన్స్ చేసే అవకాశాన్ని నివేదా పేతురాజ్ కొట్టేసిందన్నమాట. -
చాలా మంది ప్రపోజ్ చేశారు
నాకు చాలా మంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు అంటోంది నటి నివేదా పెతురాజ్. ఒరునాళ్ కూత్తు చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ అమ్మడు ఇప్పుడు ఉదయనిధిస్టాలిన్, జయంరవిలతో రొమాన్స్ చేస్తూ బిజీగా ఉంది.ఈ సందర్భంగా నివేదా పేతురాజ్‌తో చిన్న భేటీ.. నేను పుట్టింది తమిళనాట.పెరిగింది, చది వింది దుబాయ్‌లో. నాన్న పేతురాజ్ ఇంజినీర్.అమ్మ హౌస్‌మేకర్. తమ్ముడు ని శాంత్ కాలేజీ చదువు పూర్తి చేసి సీఏఎఫ్‌ఏ చేస్తున్నాడు. ప్ర: సినీ రంగ ప్రవేశం గురించి? జ: నేను మోడలింగ్ రంగం నుంచి వచ్చాను.యూఏఈలో మిస్ ఇండియా పోటీల్లో కిరీటాన్ని గెలుచుకున్నాను.ఆ తరువాత మోడలింగ్ చే యడం బోర్ అనిపించింది.ఎప్పుడూ ఓకే విధంగా దుస్తులు ధరించడం, ఫోజులివ్వడం నచ్చలేదు. అలాంటి సయమంలో తమిళంలో ఒరునాళ్ కూత్తు చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ కు జం టగా పొదువాగ ఎన్ మనసు తంగం,జయంరవితో కిక్ కిక్ కిక్ చిత్రాల్లో నటిస్తున్నాను. ప్ర: మీ సినీ హీరోల గురించి? జ: నటుడు దినేష్ నా తొలి హీరో. తొలిసారి నటిస్తున్నానన్న భయం కలగకుండా చాలా విషయాలు చెప్పారు. ఉదయనిధి స్టాలి్న్ కు జంటగా పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రంలో ఒక షెడ్యూల్లోనే నటించాను.ఎంతో ఉన్నత కుటుంబం నుంచి వచ్చి ఇంత సౌమ్యంగా ఉంటారా? అని ఉదయ్‌ను చూసి ఆశ్చర్యపోయాను. చాలా జెంటిల్మెన్ . తన అసిస్టెంట్లను కూడా గౌరవిస్తారు. అలాంటివన్నీ నేను ఉదయనిధి స్టాలిన్ చూసే నేర్చుకున్నాను. ఇక జయంరవికి జంటగా నటిస్తున్న కిక్ కిక్ కిక్ చిత్ర షూటింగ్లో పది రోజులే పాల్గొన్నాను. జయంరవిని ఒక్క రోజే కలుసుకున్నాను. అప్పుడు ఆయన భార్య,పిల్లలు కూడా ఉన్నారు. అలా కుటుంబంతో ఆయన్ని చూడడం చాలా సంతోషం కలిగింది. ప్ర: కొంచెం అందంగా ఉన్న అమ్మాయిలకే లవ్ ప్రపోజల్స్ గోల తప్పదు.అలాంటిది మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న మీకు? జ: అబ్బో దాని గురించి ఎందుకు అడుగుతారులెండి. నేను చదువుకుంటున్న సమయంలోనే తొలి ప్రపోజల్ అందుకున్నాను. రోజాపూలతో కూడిన కార్డుపై ఇంగ్లిష్‌లో ఏవేవో రాశాడు. అయితే అది చూడడానికి చాలా క్యూట్‌గా ఉంది.అయితే అప్పట్లో నాకు అబ్బాయిలంటే చాలా భయం. దూరంగా పారిపోయేదాన్ని. ఈ విషయాలు తలచుకుంటే ఇప్పుడు చాలా కామెడీగా అనిపిస్తుంది. ఇక దుబాయ్‌లో చాలా మంది ప్రపోజ్ చేశారు.అక్కడి అబ్బాయిలు చాలా పోకిరోళ్లు. బయట అమ్మాయిలెవరైనా కనిపిస్తే, అందంగా ఉన్నారనిపిస్తే వెంటనే వారి ఫోన్ నంబర్లు అడిగి తీసుకోవడం గానీ, తమ ఫోన్ నంబర్లు ఇవ్వడం గానీ చేస్తారు.అలా నేనెవరికీ ఫోన్ నంబర్ ఇవ్వలేదుగానీ, ఒక అబ్బాయి ఫోన్ నంబర్ మాత్రం అడిగి తీసుకుని వెంటనే దాన్ని పారేశాను. ప్ర: మీరు ఫిట్నెస్ ట్రైనర్ అటగా? జ: ఫిట్‌నెస్‌లో 1 లెవల్ వరకూ ట్రైనింగ్ తీసుకున్నాను. 2వ లెవల్ ట్రైనింగ్ అవడానికి ఇష్టం కలగలేదు.అయితే ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ పొందుతున్నాను.ఇప్పటికీ థాయ్‌ల్యాండ్‌కు ఎడాదిలో రెండు నెలలు శిక్షణ పొందుతుంటాను.అలగే కిక్బాక్స్, జూడో విద్యలు తెలుసు. జూడో లాంటి ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటే అమ్మాయిలకు అత్యాచారాల భయం ఉండదు.అలాంటి అమ్మాయిల వద్దకు రావడానికి అబ్బాయిలు భయపడతారు. -
ముగ్గురమ్మాయిలతో..
ఓ కాదల్ కణ్మణి చిత్రంతో రొమాంటిక్ హీరోగా తమిళ ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడైన ఈయన మాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న నటుడు. వాౖయె మూడి పేసు చిత్రం ద్వారా కోలీవుడ్‌కు రంగప్రవేశం చేశారు. ఆ చిత్రం మంచి పేరునే తెచ్చి పెట్టింది. ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో నిత్యామీనన్ తో కలిసి నటించిన రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం దుల్కర్సల్మాన్ ను మరో మెట్టు ఎక్కించింది. మణిరత్నం మరో అవకాశం ఇవ్వచూపగా దుల్కర్ దాన్ని అందుకోలేకపోయారు. నిజానికి కీర్తి నటిస్తున్న కాట్రు వెలియడై చిత్రంలో నటించే అవకాశం మొదట దుల్కర్ సల్మాన్ నే వరించింది. ఆయన మలయాళ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఇందులో నటించలేకపోయారని సమాచారం.అంతే కాదు మరిన్ని కోలీవుడ్ అవకాశాలు తలుపు తట్టినా అంగీకరించని దుల్కర్సల్మాన్ తాజాగా ఒక నవ దర్శకుడికి పచ్చజెండా ఊపారు. ఆర్.కార్తీక్ అనే నవ దర్శకుడు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు యువళ గీతాలు పాడనున్నారట.అందులో నటి మేఘా ఆకాశ్, నివేదా పేతురాజ్ ఇప్పటికే ఎంపికయ్యారు. మరో నటి ఎంపిక జరుగుతుందని చిత్ర వర్గాలు తెలిపారు. మేఘా ఆకాశ్ ఇప్పటికే ధనుష్ సరసన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇనై నోక్కి పాయుం తోట్టా చిత్రంలో నటిస్తున్నారన్నది గమనార్హం. ప్రస్తుతం మలయాళంలో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న దుల్కర్ సల్మాన్ ఈ చిత్రానికి మే నుంచి కాల్షీట్స్ కేటాయించినట్లు తెలిసింది.