తమిళసినిమా : నటి నివేదాపేతురాజ్‌కో సూపర్ ఆఫర్ తలుపు తట్టింది. ఈ అమ్మడు నటించిన రెండు చిత్రాలు గతేడాది తెరపైకి వచ్చినా, ఓ ఫట్ అన్నట్టుగా ఆడాయి. అయినా నివేదాకు అవకాశాలు మాత్రం వరుస కడుతున్నాయి. దుబాయిలో పెరిగిన ఈ తమిళ అమ్మాయి గ్లామర్ పాత్రల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలకే ప్రాముఖ్యతనిస్తోంది. ప్రస్తుతం వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటించిన పార్టీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మంచి విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది. కాగా ప్రస్తుతం ప్రభుదేవాకు జంటగా పోన్ మాణిక్యవేల్ చిత్రంలో పాటు, విష్ణువిశాల్‌తో జగజల కిల్లాడీ అనే కామెడీ కథా చిత్రంలో నటిస్తోంది.
దీనికి ఎళిల్ దర్శకుడు. వీటితో పాటు ఒక తెలుగు చిత్రం ఈమె చేతిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నివేదాపేతురాజ్‌ను జాక్‌పాట్ లాంటి అవకాశం వరించిందన్నది తాజా సమాచారం. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతితో రోమాన్స్ చేసే లక్కీచాన్స్ వరించింది. అవును విజయ్‌సేతుపతి వాలు, స్కెచ్ చిత్రాల ఫేమ్ విజయ్‌చందర్ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఇందులో ఇప్పటికే నటి రాశీఖన్నా ఒక కథానాయకిగా ఎంపికైంది. మరో నటిగా నివేదాపేతురాజ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. మొత్తం మీద విజయ్‌సేతుపతి ఇద్దరు బ్యూటీస్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment