తమిళసినిమా: నృత్యదర్శకుడిగా దుమ్మురేపిన ప్రభుదేవా ఆ తరువాత దర్శకుడిగా కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ వరకూ సంచలనం సృష్టించారు. తాజాగా కథానాయకుడిగా యమ బీజీ అయిపోయారు. రెండు మూడు చిత్రాలు షూటింగ్‌లో మరో రెండు మూడు చిత్రాలు కమిట్‌మెంట్‌లో ఉన్నాయి. తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చదరం 2 చిత్రం ఫేమ్ దర్శకుడు సుమంత్ రాధాకృష్ణన్ తాజా చిత్రంలో ప్రభుదేవా కథానాయకుడిగా నటించనున్నారు.
ఇందులో నివేదాపేతురాజ్ ఆయనతో రొమాన్స్ చేసే అవకాశాలున్నట్లు తాజా సమాచారం. తొలి చిత్రం ఒరునాళ్ కూత్తు చిత్రంలోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటీవల నటించిన పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రం పెద్దగా ప్రేక్షకాదరణను పొందలేకపోయింది. దీంతో జయం రవితో జత కడుతున్న టిక్ టిక్ టిక్ చిత్రంపైన చాలా అశలు పెట్టుకుంది. శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అంతరిక్షంలో జరిగే కథా చిత్రంగా తెరకెక్కుతోంది.
దర్శకుడు సుమంత్ రాధాకృష్ణన్ ఇటీవల నటి నివేదాపేతురాజ్‌ను కలిసి కథను వినిపించారట. కథ నచ్చడంతో పాటు ప్రభుదేవాతో నటించడానికి ఈ అమ్మడు చాలా ఆసక్తిని కనబరచిందట. ఈ విషయాన్ని దర్శకుడు సుమంత్ రాధాకృష్ణన్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. త్వరలోనే ఆ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో రొమాన్స్ చేసే అవకాశాన్ని నివేదా పేతురాజ్ కొట్టేసిందన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment