ఓటీటీలో శివన్న, ప్రభుదేవా సినిమా స్ట్రీమింగ్‌ | Karataka Damanaka Movie Streaming Now OTT | Sakshi
Sakshi News home page

ఓటీటీలో శివన్న, ప్రభుదేవా సినిమా స్ట్రీమింగ్‌

Published Sat, Jul 13 2024 1:04 PM | Last Updated on Sat, Jul 13 2024 3:38 PM

 Karataka Damanaka Movie Streaming Now OTT

శివ‌రాజ్‌కుమార్‌, ప్ర‌భుదేవా కాంబినేషన్‌లో వచ్చిన కన్నడ సినిమా 'క‌ర‌ట‌క ద‌మ‌న‌క'. ముఖ్యంగా ఈ సినిమాలోని ఒక సాంగ్‌ దేశవ్యాప్తంగా ఊపేసింది. యాక్ష‌న్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కన్నడ ప్రముఖ డైరెక్టర్‌  యోగరాజ్ భట్ తెరకెక్కించారు. రాక్‌లైన్ వెంకటేశ్‌ నిర్మించిన ఈ సినిమా మార్చి నెలలో విడుదలైంది. అయితే, తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో సడన్‌గా స్ట్రీమింగ్‌ అవుతుంది.

శివరాజ్ కుమార్‌తో   యోగరాజ్ భట్ మొదటి సారి ఈ సినిమా తెరకెక్కించారు. ఆపై శివన్న- ప్రభదేవా కాంబినేషన్‌లో నటించిన తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం.  దాదాపు ప‌న్నెండేళ్ల  త‌ర్వాత ప్ర‌భుదేవా హీరోగా క‌న్న‌డ ఇండ‌స్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉండటంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, వారు ఆశించనంతగా ఈ చిత్రం మెప్పించలేదని టాక్‌ వచ్చింది. అయితే, ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో కన్నడ వర్షన్‌ మాత్రమే స్ట్రీమింగ్‌ అవుతుంది. త్వరలో తెలుగు, తమిళ్‌ వర్షన్స్‌ కూడా విడుదల కానున్నాయని సమాచారం.

క‌ర‌ట‌క (శివ‌రాజ్‌కుమార్‌), ద‌మ‌న‌క (ప్ర‌భుదేవా) పాత్రలలో ఇద్దరూ పోటీపడి నటించారు. ఒక కేసు కారణంతో జైలులో ఉన్న వారిద్దరిని ఒక పనిచేసి పెట్టాలని జైలర్‌ విడుదల చేస్తాడు. అప్పుడు వారిద్దరూ ఒక పల్లెటూరుకు వెళ్తారు. అక్కడ ఊరును మోసం చేసి, దొంగతనాలు చేస్తూ జీవనం సాగించే మోసగాళ్లలా ఉంటారు. అదే గ్రామంలో నీటి కోసం అల్లాడుతున్న ప్రజల ఇబ్బందులు చూసి చలించిపోతారు. నీళ్లు లేకపోవడంతో కొందరు ప్రజలు అక్కడి నుంచి పట్టణాలకు వెళ్లిపోతారు. కానీ, ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా అక్కడే ఉండాలని కొందరు అనుకుంటారు. 

ఇలాంటి సమయంలో జిత్తులమారి నక్కలుగా ఉన్న వారిద్దరూ ఆ గ్రామం కోసం ఏం చేశారు. వారికి ఆ జైలర్‌ అప్పగించిన పని ఏంటి..? అనేది ఆసక్తిని పెంచుతుంది. ప్రియా ఆనంద్, నిశ్విక నాయుడు, రవిశంకర్, రంగాయణ రఘు, తనికెళ్ల భరణి తదితరలు ఈ సినిమాలో నటించారు. తనికెళ్ల భరణి పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రాన్ని ఇంటి వద్దే చూసేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement