ద్విపాత్రాభినయం | Vijay Sethupathi Movie Complete Shooting Schedule | Sakshi
Sakshi News home page

త్వరలో తెరపైకి సంఘ తమిళన్‌

Published Sat, Aug 3 2019 8:03 AM | Last Updated on Sat, Aug 3 2019 8:03 AM

Vijay Sethupathi Movie Complete Shooting Schedule - Sakshi

విజయ్‌సేతుపతితో రాశీఖన్నా

సినిమా: సంఘ తమిళన్‌ చిత్ర షూటింగ్‌ పూర్తి అయ్యింది. వైవిధ్యానికి పెద్ద పీట వేసే నటుల్లో విజయ్‌సేతుపతి ఒకరని చెప్పవచ్చు. హీరో, విలన్‌ అన్న తారతమ్యాలు చూడకుండా పాత్ర నచ్చితే చేయడానికి రెడీ అంటున్నారు. అదే విధంగా తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లోనూ నటించేస్తున్నాడు. ఇలా బహుభాషా నటుడిగా తన పేరును విస్తరింపజేసుకుంటున్న విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సంఘతమిళన్‌. ప్రముఖ నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్‌ పతాకంపై బి.భారతీరెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో విజయ్‌సేతుపతికి జంటగా అందాల తారలు రాశీఖన్నా, నివేదాపేతురాజ్‌ నటిస్తున్నారు. స్కెచ్‌ చిత్రం ఫేమ్‌ విజయ్‌చందర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కారైక్కుడిలో ప్రారంభించుకుని పలు ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంది. తాజాగా సంఘ తమిళన్‌ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇందులో నటుడు విజయ్‌సేతుపతి ద్విపాత్రాభినయం చేయడం విశేషం.

నటి సిమ్రాన్, సూరి అసుతోష్‌ రాణా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకున్న విషయాన్ని నటి రాశీఖన్నా తన ట్విట్టర్‌లో పేర్కొంది. దీంతో పాటు కొన్ని ఫొటోలను అందులో పోస్ట్‌ చేసింది. నటుడు విజయ్‌సేతుపతి ప్రస్తుతం ఒక మలయాళ చిత్రంలో నటిస్తున్నాడు. ఈయన తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటించిన భారీ చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రంలో ముఖ్యపాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement