పదునైన చూపులు | Vijay Sethupathi Sanga Thamizhan first look and poster release | Sakshi
Sakshi News home page

పదునైన చూపులు

Published Sun, May 12 2019 4:15 AM | Last Updated on Sun, May 12 2019 4:15 AM

Vijay Sethupathi Sanga Thamizhan first look and poster release - Sakshi

విజయ్‌ సేతుపతి

కథ డిమాండ్‌ మేరకు కథానాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోతుంటారు విజయ్‌ సేతుపతి. తాజాగా ఆయన హీరోగా రూపొందుతున్న తమిళ చిత్రం ‘సంగతమిళన్‌’. ఈ చిత్రంలో రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. ‘స్కెచ్‌’ ఫేమ్‌ విజయ్‌చందర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో పదునైన చూపులతో కోపంగా కనిపిస్తున్నారు విజయ్‌ సేతుపతి. మరి.. ఆ ఆగ్రహానికి గల కారణం తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. బాలీవుడ్‌ నటుడు అశుతోష్‌ రాణా ఈ సినిమాలో విలన్‌గా నటించబోతున్నట్లు  తెలిసింది. జల్లికట్టు నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement