
రాశీ ఖన్నా; విజయ్ సేతుపతితో సెల్ఫీ
‘‘ప్రతి సినిమా చిత్రీకరణ కోసం చేసే ప్రయాణం ఓ జ్ఞాపకం అవుతుంది. ‘తుగ్లక్ దర్బార్’ చిత్రానికి చేసిన ప్రయాణం నాకెప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం’’ అంటున్నారు రాశీ ఖన్నా. తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా ఢిల్లీ ప్రసాద్ దీనదయాల్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ ‘తుగ్లక్ దర్బార్’. రాశీ ఖన్నా, మంజిమా మోహన్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ గురువారం పూర్తయింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు రాశీ ఖన్నా. ‘‘మరో అద్భుతమైన ప్రయాణం పూర్తయింది. విజయ్ సేతుపతిలాంటి ప్రతిభ ఉన్న నటుడితో యాక్ట్ చేయడం మంచి అనుభవం. ఈ అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా మీ అందరికీ త్వరగా చూపించేయాలని ఉంది’’ అని పేర్కొన్నారు రాశీ. అలానే చిత్రీకరణ చివరి రోజు టీమ్‌తో దిగిన కొన్ని సెల్ఫీలను షేర్ చేశారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment