![director ram narayan interview for laila movie](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Ram-Narayana.jpg.webp?itok=LBgfSC7L)
‘‘లైలా’(laila) చిత్రకథని ఇద్దరు ముగ్గురు యువ హీరోలకి చెప్పా. కథ వారికి నచ్చినప్పటికీ లైలా అనే లేడీ గెటప్ వేసేందుకు ఆసక్తి చూపలేదు. ఈపాత్ర చేయడానికి చాలా ధైర్యం కావాలి. అందుకే హీరోని వెతకడం సవాల్‌గా అనిపించింది. నిర్మాత సాహుగారికి ఈ కథ బాగా నచ్చి, విశ్వక్ సేన్‌గారికి చెప్పమని సలహా ఇచ్చారు. విశ్వక్‌గారు కథ వినగానే.. ఇలాంటి లేడీ గెటప్ వేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను.
మనం ఈ సినిమా చేస్తున్నాం అన్నారు’’ అని డైరెక్టర్ రామ్ నారాయణ్(Ram Narayan) చెప్పారు. విశ్వక్ సేన్(Vishwak Sen), ఆకాంక్షా శర్మ జంటగా నటించిన చిత్రం ‘లైలా’. సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్ నారాయణ్ మాట్లాడుతూ– ‘‘‘బట్టల రామస్వామి బయోపిక్, దిల్ దివాన, ఉందిలే మంచి కాలం’ సినిమాలకు మ్యూజిక్ చేశాను.
దర్శకుడిగా నా తొలి చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్’ (2021) మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత ఓ యునిక్ స్టోరీగా ‘లైలా’ రాశా. హీరో లేడీ గెటప్ వేయడం వంటి చిత్రాలు ఈ మధ్య రాలేదు. ఆ నేపథ్యంలో వస్తున్న వినోదాత్మక చిత్రమిది. ఇందులో సోను మోడల్, లైలాగా విశ్వక్ నటించారు. ఈ చిత్రంలో ఎమోషన్, యాక్షన్, రొమాన్స్... ఇలా అన్నీ ఉన్నాయి’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment