మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల మెకానిక్ రాకీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఇతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ లైలా రిలీజ్‌కు రెడీ అవుతోంది. సోమవారం చిత్రయూనిట్ లైలా విడుదల తేదీ ప్రకటించింది. మాస్ కా దాస్‌ను సరికొత్త అవతారంలో చూడనున్నారు. ఈ ప్రేమికుల దినోత్సవానికి లైలా మీ ముందుకు వచ్చేస్తోంది. 2025లో ఫిబ్రవరి 14న లైలా విడుదల కానుంది అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు.
రామ్ నారాయణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. ఆకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తోంది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్‌లోనూ కనిపించనున్నాడు. ఇకపోతే విశ్వక్.. జాతిరత్నాలు డైరెక్టర్ కేవీ అనుదీప్‌తో ఫంకీ సినిమా చేస్తున్నాడు.
MASS KA DAS in never seen before AVATARS 😎
This Valentine's Day, it's going to be an entertaining blast in theatres 💥#Laila GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th ❤🔥
First Rose of Laila out for New Year 2025 🌹#LailaFromFeb14
'Mass Ka Das' @VishwakSenActor… pic.twitter.com/ZprdOvH3kN— Shine Screens (@Shine_Screens) December 16, 2024
Comments
Please login to add a commentAdd a comment