Naga Chaitanya Wraps Up Venkat Prabhu's 'Custody', Video Goes Viral - Sakshi
Sakshi News home page

'కస్టడీ' నుంచి విడుదలైన నాగచైతన్య.. వీడియో వైరల్‌

Published Sat, Feb 25 2023 1:23 PM | Last Updated on Sat, Feb 25 2023 1:42 PM

Naga Chaitanya Wraps Up Venkat Prabhu Custody - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతున్న ఈ సినిమాలో నాగచైతన్యకు జంటగా కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. బంగార్రాజు తర్వాత వీరిద్దరు మరోసారి జంటగా నటిస్తున్నారు.

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చై పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను చై సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఇందులో డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు కట్‌ చెప్పి.. చై నీకు మా కస్టడీ నుంచి విడుదల అంటూ షూటింగ్‌ను ముగించారు. ఇక ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, ప్రియమణి, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement