![Shruti Haasan Finishes Shooting In Prabhas Salaar Movie - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/24/SALAAR.jpg.webp?itok=1p_t_F8R)
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా సలార్. శ్రుతిహాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా హీరోయిన్ శ్రుతిహాసన్ చిత్రీకరణ పూర్తయ్యింది.
ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్‌తో దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ మేకర్స్‌కు కృతఙ్ఞతలు తెలిపింది.'థాంక్యూ ప్రశాంత్ సార్.. నన్ను మీ ఆధ్యాగా మార్చినందుకు. మీ అందరితో కలిసిసినిమాలో పనిచేయడం చాలా హ్యాపీ' అంటూ శ్రుతి తన పోస్ట్‌లో పేర్కొంది. ఇదిలా ఉంటే ప్రభాస్ కూడా గ్యాప్ లేకుండా షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. ఏప్రిల్ నాటికి షూటింగ్ దాదాపుగా కంప్లీట్ చేయనున్నారని తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment