
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'సలార్'. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. అయితే రెబల్ స్టార్ సినిమాకు సైతం లీకుల బెడద తప్పడం లేదు. సలార్ సెట్‌లో ప్రభాస్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో మాస్ లుక్‌లో ప్రభాస్ దర్శనమించారు. ఇది చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
ప్రముఖ దివంగత నటుడు కృష్ణంరాజు ఈ నెల 11న కన్నుమూశారు. పెదనాన్న మరణించడంతో ప్రభాస్ తన తాజా చిత్రాల షూటింగ్ డేట్స్‌ని మళ్లీ ప్లాన్ చేయాల్సి వచ్చింది. పది రోజుల బ్రేక్ తర్వాత ‘సలార్’ సెట్స్‌లో జాయిన్ అయ్యారు హీరో ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘సలార్’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు కీ రోల్ చేస్తున్నారు. ప్రభాస్.. వచ్చే నెల మొదటివారం వరకూ ప్రభాస్ ఈ సినిమా షూటింగ్‌తోనే బిజీగా ఉంటారని తెలిసింది.
(చదవండి: ‘సలార్’ షురూ.. పుట్టెడు శోకంలోనూ షూటింగ్‌కి ప్రభాస్ హాజరు)
ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు ప్రభాస్. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ‘సలార్’ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది. ‘ప్రాజెక్ట్ కె’ 2024లో రిలీజ్ కానుందని తెలిసింది. అలాగే ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్’ వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది.
Salaar leaked one feat Rolex bgm #Prabhas #Adipurush #Salaar pic.twitter.com/Jyp6doEIOH
— . (@Smartkurrodu) September 24, 2022
Comments
Please login to add a commentAdd a comment