సలార్ మేకర్స్ బిగ్‌ ప్లాన్‌.. అక్కడ కూడా! | Prabhas Salaar Part 1 Ceasefire Movie Will Be Released In Foreign Languages, Post Goes Viral - Sakshi
Sakshi News home page

Prabhas Salaar: సలార్ సూపర్‌ హిట్‌.. ఆ దేశాల్లో రిలీజ్‌కు రెడీ!

Published Fri, Jan 5 2024 4:56 PM | Last Updated on Fri, Jan 5 2024 5:52 PM

Prabhas Salaar Will Be Released In This Language Countries  - Sakshi

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. డిసెంబర్‌ 22న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే భారీ కలెక్షన్స్‌తో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.  తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఆదరణ పెరుగుతుండడంతో విదేశీ భాషల్లోనూ సలార్‌ రిలీజ్‌ చేయనునట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని స్పానిష్ భాషలో రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని స్పానిష్ భాషలో రాస్తూ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.  దీంతో సలార్‌ సీజ్‌ఫైర్‌ పార్ట్-1 మార్చి 7న లాటిన్ అమెరికా దేశాల్లో విడుదల కానుంది.  విదేశాల్లోనూ తమ అభిమాన హీరో మూవీ రిలీజ్‌ కావడంపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement