ఓటీటీలో సలార్.. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ రేంజ్‌లో! | Prabhas Salaar Streaming On Netflix also In English Language | Sakshi
Sakshi News home page

Salaar Part:1 Ceasefire: ఓటీటీలో సలార్.. రెబల్ స్టార్‌ రేంజ్ వేరే లెవెల్!

Published Mon, Feb 5 2024 8:42 PM | Last Updated on Mon, Feb 5 2024 8:44 PM

Prabhas Salaar Streaming On Netflix also In English Language - Sakshi

పాన్‌ ఇండియా రెబల్ స్టార్‌ ప్రభాస్ నటించిన చిత్రం 'సలార్: పార్ట్-1 సీజ్‍ఫైర్'. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలోకి వచ్చింది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన సలార్ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 20వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం టాప్‌ టెన్‌ మూవీస్‌లో ట్రెండ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చిన సలార్ ఓటీటీలో దూసుకెళ్తోంది. 

అయితే గ్లోబల్‌ వైడ్‌గా ఉన్న అభిమానుల నుంచి డిమాండ్ రావడంతో ఇంగ్లీష్‌లో స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఫిబ్రవరి 5 నుంచి సలార్‌ ఇంగ్లీష్ వర్షన్‌ అందుబాటులోకి వచ్చేసింది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌ ట్వీట్ చేసింది. ఇక ఇప్పటి నుంచి సలార్ పాన్ ఇండాయా కాదు.. గ్లోబల్‌ సినిమాగా మారిపోయింది. ఇప్పటికే గ్లోబల్‌గా దూసుకెళ్తోన్న సలార్‌ మరింత ట్రెండ్‌ అవకాశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సలార్ మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే సలార్ హిందీ వెర్షన్ మాత్రం ఇప్పటి వరకు ఓటీటీలోకి రాలేదు. ఈ విషయంపై అప్‍డేట్ కూడా ఇవ్వలేదు. 90 రోజుల వరకు వెయింటింగ్ పీరియడ్ ఉండడంతో హిందీ వర్షన్ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. సలార్ హిందీ వర్షన్ మార్చిలో వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలోనే నెట్‍ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరి రావు, శ్రీయారెడ్డి, టినూ ఆనంద్, దేవరాజ్, బాబీ సింహా కీలకపాత్రల్లో కనిపించారు. కాగా.. చిత్రానికి సీక్వెల్‍గా సలార్: పార్ట్-2 శౌర్యంగపర్వం ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement