Priya Vadlamani, Ayesha Khan talk about Mukhachitram Movie in an interview - Sakshi
Sakshi News home page

‘ముఖచిత్రం’.. మా కెరీర్‌కు బ్రేక్ నిచ్చే సినిమా

Published Tue, Dec 6 2022 5:56 PM | Last Updated on Tue, Dec 6 2022 6:08 PM

Priya Vadlamani, Ayesha Khan Talk About Mukhachitram Movie - Sakshi

‘ముఖచిత్రం’ నా తొలి తెలుగు సినిమా.  మొదటి చిత్రంలోనే ఓ డిఫరెంట్ రోల్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో యాక్సిడెంట్ సీన్స్ చేసేప్పుడు కష్టపడ్డాను. నాకూ గాయాలయ్యాయి. రెండు నెలలు రెస్ట్ తీసుకున్నాను. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ లో జరిగిన యాక్సిడెంట్ వల్ల పెయిన్స్ వస్తుంటాయి. ఏమైనా కష్టపడితే గానీ లైఫ్ లో ఏదీ దక్కదు అన్నట్లు ఈ సినిమాకు గాయపడినా మంచి చిత్రంలో భాగమవడం సంతృప్తిగా ఉంది’అని హీరోయిన్‌ అయేషా ఖాన్ అన్నారు. 

వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "ముఖచిత్రం". ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందించగా, గంగాధర్ దర్శకత్వం వహించారు.  ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియా వడ్లమాని మాట్లాడుతూ...నేను ఇప్పటిదాకా ఐదు సినిమాల్లో నటించాను. ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటించాను. ఈ చిత్రంలో ఒక మంచి సందేశాన్ని చూపిస్తున్నాం. మన రియల్ లైఫ్ లో చాలాసార్లు విన్నదే, చూసిందే కానీ ఇప్పటిదాకా తెరపై ఇలాంటి పాయింట్ ను ఎవరూ తెరకెక్కించలేదు. . మేము మా విజన్ కంటే దర్శకుడు సందీప్ ఎలా మమ్మల్ని తెరపై చూపించాలనుకుంటున్నాడు అనే విజన్ ను నమ్మాము. దాన్నే ఫాలో అయ్యాము. సందీప్ ఒక కొత్త తరహా సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాడు. తప్పకుండా ఆదరిస్తాని కోరుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ అయేషా ఖాన్ మాట్లాడుతూ...ఈ సినిమాలో సిటీ గర్ల్ మాయా ఫెర్నాండేజ్ పాత్రలో నటించాను. లైఫ్ లో ఎలా ఉండాలనే విషయంలో కంప్లీట్ గా అవేర్ నెస్ ఉన్న అమ్మాయి తను. దేనికీ కాంప్రమైజ్ కాకుండా, తను అనుకున్న పని చేస్తుంటుంది. నాకు తెలుగులో తొలి సినిమా. మొదటి చిత్రంలోనే ఓ డిఫరెంట్ రోల్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ చిత్రం నా డెబ్యూ మూవీగా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement