‘‘ఏ సీజన్‌లో అయినా మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఇప్పుడు మేం తీసిన ‘మను చరిత్ర’ కూడా ఓ మంచి చిత్రంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనే గ్యారంటీ ఇవ్వగలను’’ అని శివ కందుకూరి అన్నారు. శివ కందుకూరి హీరోగా భరత్ పెదగాని దర్శకత్వంలో ఎన్. శ్రీనివాసరెడ్డి నిర్మించిన చిత్రం ‘మను చరిత్ర’. మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ హీరోయిన్లు. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో శివ కందుకూరి మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో మను అనే క్యారెక్టర్ చేశాను. నా క్యారెక్టర్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఏడెనిమిదేళ్ల టైమ్ పీరియడ్‌లో ఈ సినిమా సాగుతుంది. అందుకే ‘మను చరిత్ర’ అని టైటిల్ పెట్టాం. ట్రైలర్‌లో యాక్షన్ కనిపిస్తున్నప్పటికీ సినిమాలో మంచి లవ్‌స్టోరీ కూడా ఉంది.
తన నిజజీవితంలోని వ్యక్తుల నుంచి స్ఫూర్తి ΄÷ంది ఈ సినిమాలోని ΄ాత్రలను డిజైన్ చేసినట్లు, అలాగే తన ముగ్గురు స్నేహితుల వ్యక్తిత్వాలను మిళితం చేసి మను ΄ాత్రను డిజైన్ చేసినట్లు దర్శకుడు భరత్ నాతో చె΄్పారు. మా నాన్నగారు (నిర్మాత రాజ్ కందుకూరి) ‘మను చరిత్ర’ సినిమా చూసి, నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి బాగా యాక్ట్ చేశావని అన్నారు. దాన్ని పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment