రాహుల్ విజయ్
‘‘కన్నడలో ఘన విజయం సాధించిన ‘కాలేజ్ కుమార్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశాం. తండ్రీ కొడుకుల మధ్య సన్నివేశాలు ఈ సినిమాలో మెయిన్ హైలైట్. ప్రస్తుతం విద్యావిధానం ఎలా ఉంది? మన చదువుకు తగ్గట్లు ఉద్యోగం చేస్తున్నామా?.. వంటి విషయాల్ని ఈ సినిమాలో చర్చించాం’’ అన్నారు రాహుల్ విజయ్. కన్నడ ‘కాలేజ్ కుమార్’ చిత్రదర్శకుడు హరి సంతోష్ ఈ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాహుల్ విజయ్, ప్రియ వడ్లమాని జంటగా రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో నటించారు. లక్ష్మణ్ గౌడ సమర్పణలో ఎల్. పద్మనాభ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా రాహుల్ విజయ్ మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ డ్రామా, ఎమోష¯Œ ్స ఉన్న ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. నేను ప్రతి సినిమా నుండి కొంత నేర్చుకుంటూ వస్తున్నాను. ఒక నటుడిగా నా వంతు పూర్తి కృషి చేస్తాను.. ఫలితం అనేది మన చేతిలో ఉండదు. కన్నడ ప్రేక్షకులు ఆదరించిన ట్టు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఇందులో రాజేంద్రప్రసాద్, మధుబాల, నాజర్‌గార్లతో పని చేయడం సంతోషంగా అనిపించింది.. వారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రసుతం ‘బ్లాక్ అండ్ వైట్‘ అనే థ్రిల్లర్ సినిమా చేస్తున్నాను. మరో రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment