నవంబర్ 16న ‘హుషారు’ | Hushaaru Movie Release Date | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 24 2018 3:57 PM | Last Updated on Wed, Oct 24 2018 3:57 PM

Hushaaru Movie Release Date - Sakshi

‘టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం  వేణుగోపాల్ తరువాత ‘ మేము వయసుకు వచ్చాం’ , ‘ సినిమా చూపిస్త మావ’ లాంటి సూపర్ హిట్లు అందించారు. ఈ సంస్థలో 9 వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా ‘హుషారు’.

రియాజ్ మరో నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ చుంచు, దినేష్ తేజ్, దక్ష నాగర్కర్, ప్రియా వడ్లమాని,హేమ ఇంగ్లే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ‘అర్జున్ రెడ్డి’ ఫేం రధన్ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను నవంబర్‌ 16న రిలీజ్‌ చేస్తున్నట్టుగా తెలిపారు చిత్రయూనిట్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement