bekkam venugopal
-
Roti Kapada Romance: ‘రోటి కపడా రొమాన్స్’ మూవీ రివ్యూ
టైటిల్: రోటి కపడా రొమాన్స్నటీనటులు: హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగ, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులునిర్మాణ సంస్థ: లక్కీ మీడియానిర్మాత: బెక్కెం వేణుగోపాల్దర్శకత్వం: విక్రమ్ రెడ్డివిడుదల తేది: నవంబర్ 28, 2024కంటెంట్ బాగుంటే చాలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్లో వరుసగా చిన్న సినిమాలు వస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో చిన్న చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. పబ్లిసిటీ సరిగా చేయకపోవడంతో కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయిన విషయం కూడా తెలియడం లేదు. చాలా రోజుల తర్వాత మంచి బజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న చిత్రమే ‘రోటి కపడా రొమాన్స్’(Roti Kapada Romance Movie Telugu Review). వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 22నే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎట్టకేలకు నేడు(నవంబర్ 28) రిలీజైంది. ఈ నేపథ్యంలో మీడియా కోసం ప్రివ్యూ వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘రోటి కపడా రొమాన్స్’ కథేంటంటే..?ఈవెంట్ ఆర్గనైజర్ హర్ష(హర్ష నర్రా), సాఫ్ట్వేర్ రాహుల్(సందీప్ సరోజ్), ఆర్జే సూర్య(తరుణ్), విక్కీ(సుప్రజ్ రంగ) నలుగురు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కలిసి ఓకే గదిలో ఉంటారు. విక్కీ ఏ పని చేయకుండా స్నేహితులు సంపాదిస్తున్న డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. ఫ్యాన్ అంటూ ఆర్జే సూర్యతో దివ్య(నువేక్ష), ఒక్కరోజు బాయ్‌ప్రెండ్‌గా ఉండి ఫిజికల్‌గా హెల్ప్ చేయమని కోరుతూ హర్షతో సోనియా(కుష్బూ చౌదరి), ఉద్యోగం ఇప్పించండి అంటూ విక్కీతో శ్వేత(మేఘలేఖ) పరిచయం చేసుకుంటారు. ఇక రాహుల్‌ది మరో విచిత్రం. తన ఆఫీస్‌లో పని చేసే ప్రియ(ఠాకూర్)ని ఇష్టపడతాడు. కానీ పెళ్లి చేసుకుందాం అనేసరికి తప్పించుకొని తిరుగుతాడు. ఈ నలుగురి లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు వచ్చిన తర్వాత వాళ్ల జీవితం ఎలా మారిపోయింది? ప్రేమలో పడి మళ్లీ ఎందుకు విడిపోయారు? లవ్ బ్రేకప్ తరువాత వాళ్ల రియలైజేషన్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. నలుగురు కుర్రాళ్లు.. స్నేహం.. లవ్, బ్రేకప్..ఈ కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. రోటి కపడా రొమాన్స్ కూడా ఆ కోవకు చెందిన కథే. నలుగురు అబ్బాయిల జీవితంలోకి నలుగురు అమ్మాయిలు వచ్చాక ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఇది అందరికి తెలిసిన కథే.. చాలా సినిమాల్లో చూసిన కథే. కానీ దర్శకుడు విక్రమ్ రెడ్డి చాలా కొత్తగా తెరపై చూపించాడు. ఎలాంటి గజిబిజి లేకుండా నాలుగు డిఫరెంట్ లవ్స్టోరీస్ని ఒకే కథలో చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రతి లవ్‌స్టోరీని చాలా కన్విన్సింగ్‌గా చూపిస్తూ.. ప్రస్తుతం యూత్‌లో ఉన్న కన్ఫ్యూజన్స్కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మెచ్యూరిటీ లేక తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా జరిగే నష్టాలు, అపార్థాలు, లవ్‌తో వచ్చే ప్రాబ్లమ్స్, పెళ్లి విషయంలో యువతీయువకుల ఆలోచన ఎలా ఉంటుంది?.. ఇవన్నీ నాలుగు లవ్‌స్టోరీలతో చెప్పేశాడు. దర్శకుడు ట్రెండ్‌కు తగ్గ కథను ఎంచుకోవడంతో పాటు అంతే ట్రెండీగా కథనాన్ని నడిపించాడు. ఫస్టాఫ్‌లో రొమాన్స్ కాస్త ఎక్కువే ఉన్నా.. సెకండాఫ్ వచ్చేసరికి అంతా సెట్ అయిపోతుంది. ఇక చివరి 15 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా సాగుతుంది.గోవా ట్రిప్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఒక్కొక్కరి లవ్ స్టోరీ రివీల్ అవుతుంటే కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్జే సూర్య- దివ్య, హర్ష- సోనియాల లవ్‌స్టోరీలో రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువే ఉంటుంది. రాహుల్-ప్రియల లవ్‌స్టోరీలో ఓ సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక విక్కీ- శ్వేతల లవ్‌స్టోరీ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. విక్కీ క్యారెక్టర్ పండించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం నలుగురు లవ్‌స్టోరీ చెప్పి.. సెకండాఫ్‌లో బ్రేకప్ స్టోరీలను చెప్పాడు. ద్వితియార్థంలో కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో ఇచ్చే సందేశం ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో నటించినవారంతా దాదాపు కొత్తవాళ్లే అయినా తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. హీరోలుగా నటించిన హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగ.. తమదైన నటనతో ఆకట్టుకున్నారు. విక్కీ పాత్ర అందరికి గుర్తుండిపోతుంది. ఇక నలుగురు హీరోయిన్లు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. నటీనటుల నుంచి మంచి ఫెర్పార్మెన్స్ తీసుకోవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. సాంకేతికంగా కూడా సినిమా బాగుంది. సన్నీ ఎంఆర్, హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధృవన్ అందించిన నేపథ్య సంగీతం నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. పాటలు కథలో భాగంగా వచ్చి వెళ్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - రేటింగ్: 2.75/5 -
అవకాశం ఇస్తే ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమా చేస్తా : డైరెక్టర్ విక్రమ్ రెడ్డి
ఏ డైరెక్టర్ అయినా తొలిసారే బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతాలు సృష్టించడు. అంత గొప్ప సినిమాలు తీసిన రాజమౌళి కూడా ఫస్ట్‌టైం స్టూడెంట్ నెం.1 లాంటి చిన్న సినిమాతో తన జర్నీ స్టార్ట్ చేశాడు. రాజమౌళికి స్టూడెంట్ నెం.1 సినిమా ఎలానే నాకు రోటీ కపడా రొమాన్స్ చిత్రం కూడా అంతే. ఆయనకు ఇచ్చినట్లే నాకు స్పెస్ ఇస్తే.. భవిష్యత్తులో ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తీస్తా. అలాంటి గొప్ప కథలు నా దగ్గర ఉన్నాయి. కానీ తొలి చిత్ర దర్శకుడిని నిలబడే ఛాన్స్ ఇవ్వండి.. చిన్న సినిమాలకు స్పేస్ ఇవ్వండి’ అని కోరారు దర్శకుడు విక్రమ్ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించారు. బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విక్రమ్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. నేను సినీ రంగంలోకి రావడానికి కారణం మా అమ్మ. ఆమె నాకు ఇన్స్పిరేషన్. ప్రతి శుక్రవారం విడుదలైన ప్రతి సినిమా తన లేడీ గ్యాంగ్‌తో కలిసి చూసేది. అమ్మతో పాటు నేను కూడా వెళ్లేవాడిని. అలా నాకు తెలియకుండానే సినిమాపై ఇష్టం ఏర్పడింది. ఇక ఎలాగైనా సినిమా రంగంలోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యాను. అయితే దర్శకుడు తేజ 'చిత్రం' సినిమా పోస్టర్‌పై ఆయన పేరు చూసిన తరువాత దర్శకుడిని అవ్వాలని నిర్ణయించుకున్నాను.→ ఎవరి దగ్గరనైనా అసిస్టెంట్ దర్శకుడిగా జాయిన్ కావాలని అనుకుని ప్రయత్నించాను కానీ కుదరలేదు. కానీ పూరి జగన్నాథ్ ఇచ్చిన సలహాతో అసిస్టెంట్‌గా చేరాలనే ప్రయత్నాన్ని విరమించుకుని.. సినిమాలు చూడటం మొదలుపెట్టి.. సినిమాలు చూడటమే పనిగా అనుకుని సినిమాలోని అన్ని క్రాఫ్ట్‌లపై గ్రిప్ వచ్చిన తరువాత దర్శకత్వ ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఆ తరుణంలో నేను చెప్పిన కథ బెక్కం వేణుగోపాల్‌కు నచ్చి ఈ రోజు దర్శకుడిగా మీ ముందు ఉన్నాను.→ రొటీ కపడా రొమాన్స్ ఒక యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్, కామెడీ, ఫ్రెండ్షిప్ నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఈ సినిమాలో నాలుగు ప్రేమకథలు ఉంటాయి. నలుగురు అబ్బాయిల లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు వచ్చిన తరువాత వాళ్ల జీవితం ఎలా మారిపోయింది? లవ్ బ్రేకప్ తరువాత వాళ్ల రియలైజేషన్ ఏమిటి అనేది సినిమా. అన్ని ఎమోషన్స్ మిక్స్ అయిన పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఇది. సినిమాలోని పతాక సన్నివేశాలు పదిహేను నిమిషాలు అందరి హృదయాలకు హత్తుకుంటాయి. అందరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు.→ ఫస్ట్ ఈ సినిమా దిల్ రాజు చేద్దామని అనుకున్నారు. అయితే ఆయన కథలో మార్పులు చేయమని అడిగారు. ఆ మార్పుల వల్ల నా కథకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఒప్పుకోలేదు. ఇక ఆ తరువాత కూడా కథలో నేను ఎలాంటి మార్పులు చేయలేదు.నా కథకు నేనే క్రిటిక్‌ని . కథపై నాకున్న నమ్మకం అలాంటిది. ఈ విషయాన్ని రాజు గారు కూడా స్వాగతించారు. అంతే కాదు నా చిత్రానికి 'రోటి కపడా రొమాన్స్ అనే టైటిల్ కూడా దిల్ రాజు ఇచ్చారు.→ ఈ సినిమాకు సంబంధించి నాకళ్ల ముందు చూసినవి.. నా ఫ్రెండ్ష్ లైఫ్‌లో జరిగిన ఇన్సిండెంట్స్ ఇన్స్పిరేషన్.. ఇందులో వున్న నాలుగు విభిన్న ప్రేమకథలు చేయడం చాలా కష్టం ఇలాంటి సినిమాలు చేసినప్పుడే దర్శకుడి ప్రతిభ బయటపడుతుంది. ఈ సినిమా ఆల్రెడీ చూసిన వాళ్లంతా ఓ కొత్త దర్శకుడిలా సినిమా తీయలేదు అని అభినందించారు.→ ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చాలా నేచురల్‌గా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ఉన్నది ఉన్నట్లుగా ఉంటాయి. అప్పుడే సినిమాకు ఆ వైబ్ ఉంటుంది ఈ సినిమాలో రొమాన్ష్ శృతి మించి ఉండదు. ఈ సినిమా ఎక్స్ పీరియన్స్ చేసిన తరువాత మీకు మంచి కిక్ వస్తుంది. ఈ సినిమా ఒక్కరైనా బాగా లేదు అంటే నేను సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తాను. ఈ సినిమా నా బేబి.. లాంటింది ఈ సినిమాపై నాకున్న నమ్మకం అలాంటిది. పది మంది వచ్చి చూసి బాగాలేదు అంటే రిటైర్మెంట్ ఇస్తాను. నా సినిమాతో మల్లీప్లైక్ థియేటర్స్ అన్ని మాస్ థియేటర్లు అవుతాయి.చిరంజీవి, రామ్‌చరణ్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలి అది నా అల్టీమేట్ గోల్. దాని కోసం నేను కష్టపడతా. వాళ్లిద్దరి కోసం నా దగ్గర కథ కూడా రెడీగా ఉంది. -
Avika Gor: అవికా గోర్ ‘అగ్లీ స్టోరీ’
వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేమ్ అవికా గోర్. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఉత్తరాది భామ నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉంది. అందుకే తన కెరీర్లో ‘సినిమా చూపిస్త మావ’లాంటి భారీ హిట్ అందించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కం వేణుగోపాల్ నిర్మాణంలో కొత్త సినిమాను ప్రకటించింది. సినిమా చూపిస్త మామ, మేము వయసుకు వచ్చాం, హుషారు లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టెయినర్స్ ని నిర్మించిన బెక్కెం వేణుగోపాల్..రియా జియా ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యానర్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీనికి 'అగ్లీ స్టోరీ'అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌లో నందు హీరోగా నటిస్తున్నాడు. నూతన దర్శకుడు ప్రణవ స్వరూప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ కథ గురించి బెక్కెం వేణుగోపాల్ గారు మాట్లాడుతూ ఈ కథ విభిన్నమైన పాత్రలతో ఆద్యంతం ప్రేక్షకులని కట్టిపడేసేలా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ రోజు టైటిల్ లాంచ్ జరగగా ఈ చిత్రానికి "అగ్లీ స్టోరీ" అని టైటిల్ ని నిర్ణయించారు. 2024 ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని ఈ సందర్భంగా మీడియాకి తెలిపారు -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న ముక్కు అవినాష్
‘జబర్దస్త్’, ‘బిగ్ బాస్’ షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన అవినాష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్’. రాకేష్ దుబాసి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయికుమార్, సంగీత, రియాజ్, రూప ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. డెక్కన్ డ్రీమ్ వర్క్స్‌పై నబీ షేక్ నిర్మిస్తున్న ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్’ మూవీ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రచయిత కోన వెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ కోదండ రామిరెడ్డి క్లాప్ ఇచ్చారు. రాకేష్ దుబాసి దర్శకత్వం వహించారు. దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమా టైటిల్ లోగోని లాంచ్ చేయగా, దర్శకుడు వీరభద్రం చౌదరి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ అతిథులుగా పాల్గొన్నారు. నబీ షేక్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రకథ, స్క్రీన్ ప్లే చాలా వైవిధ్యంగా ఉంటాయి’’ అన్నారు. ‘‘మా సినిమా చూసి ప్రేక్షకులు నవ్వుకుంటారు.. భయపడతారు.. థ్రిల్ అవుతారు’’ అన్నారు అవినాష్. ‘‘నబీ షేక్గారి లాంటి నిర్మాత ఉంటే యువ ప్రతిభ పరిశ్రమలోకి వస్తుంది’’ అన్నారు రాకేష్ దుబాసి. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహాదేవ్. -
అదే ఇప్పుడున్న ట్రెండ్: అల్లు అర్జున్
‘‘చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అన్నది కాదు. ఇప్పుడున్న ట్రెండ్ ఒక్కటే.. మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే థియేటర్స్‌కు వస్తున్నారు. ‘అల్లూరి’ సినిమా విజయం సాధించాలి’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. శ్రీ విష్ణు హీరోగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల్లూరి’. కయదు లోహర్ కథానాయికగా నటించారు. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ ‘నారాయనుడయ్యేను నవ వరుడు..’ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘నాకు ఇష్టమైన వ్యక్తి శ్రీవిష్ణు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో తన నటన నచ్చడంతో పిలిచి మాట్లాడాను. ప్రతి సినిమాకు అంకితభావంతో పనిచేసే శ్రీవిష్ణు అంటే నాకు ఇష్టం.. గౌరవం కూడా. యాక్టర్‌గా తను ఇంకా పైకి ఎదగాలి’’ అన్నారు. శ్రీ విష్ణు మాట్లాడుతూ– ‘‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమా తర్వాత బన్నీగారు నన్ను పిలిచి, ‘భవిష్యత్‌లో కంటెంట్ ఉన్న సినిమాలే ఆడతాయి. సో... కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటించు.. లేకపోతే ఖాళీగా ఉండు’ అంటూ ఓ ముందు చూపుతో చెప్పారు. అవసరమైతే నా సినిమాని నిర్మిస్తానని భరోసా ఇచ్చారు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో నేను ఓ చిన్న రోల్ చేశాను. ఆ తర్వాత నేను కేరళ వెళ్లినప్పుడు బన్నీగారి ఫ్యాన్స్ నన్ను గుర్తుపట్టి మాట్లాడారు. బన్నీగారు టాలీవుడ్లో చేస్తే చాలు అది ప్యాన్ ఇండియా సినిమా అయిపోతుంది. ‘అల్లూరి’ చిత్రం పోలీస్ స్టోరీ. మా మూవీ చూసిన తర్వాత పోలీసు కనిపిస్తే సెల్యూట్ చేస్తారు’’ అన్నారు. ‘‘పోలీసు అంటే ఒక వ్యక్తి కాదు.. పోలీస్ అంటే ఒక వ్యవస్థ’ అనే డైలాగ్ ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నాను’’ అన్నారు ప్రదీప్ వర్మ. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్. ఈ కార్యక్రమంలో బెక్కెం బబిత, సహ నిర్మాతలు నాగార్జున, గంజి రమ్య, విజయలక్ష్షి్మ, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, దర్శకులు ప్రశాంత్ వర్మ, హర్ష, తేజ మార్ని, నటుడు తనికెళ్ల భరణి పాల్గొన్నారు. -
పోలీస్ అవ్వాలనుకున్నా...కానీ ఈ సినిమాతో అయ్యాను: నిర్మాత
‘‘అల్లూరి’లో శ్రీ విష్ణు విశ్వరూపం చూస్తారు. తన కెరీర్లో ఇది బెస్ట్ మూవీ అవుతుంది’’ అని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ అన్నారు. శ్రీ విష్ణు పోలీసాఫీసర్‌గా నటించిన చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలకానుంది. బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘నేను చిన్నప్పుడు పోలీస్ అవ్వాలనుకున్నాను.. కానీ కాలేకపోయాను. అందుకే ‘అల్లూరి’ సినిమాలో పోలీస్ పాత్రను చాలా ఇష్టంగా చేశాను. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ‘దిల్’ రాజుగారి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. ఈ మధ్య షూటింగ్స్ నిలిపివేసి చర్చించడం వల్ల చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి.. వాటిని త్వరలోనే వెల్లడిస్తాం. వైజాగ్‌లోని అల్లూరి సీతారామరాజుగారి సమాధి దగ్గర నుంచి ఈ నెల 3 నుండి ‘అల్లూరి’ యూనిట్ యాత్రని ప్రారంభిస్తున్నాం. వైజాగ్‌లో మొదలైన టూర్ వరంగల్, నిజామాబాద్ వరకూ కొనసాగుతుంది. ప్రస్తుతం ‘బూట్ కట్ బాలరాజు’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ నిర్మిస్తున్నాను’’ అన్నారు. -
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘నైన్త్ అవర్’ చిత్రం
విశ్వ కార్తికేయ, రిషికా కపూర్ జంటగా ఆనంద్ కొలగాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నైన్త్ అవర్’. రాజు గుడిగుంట్ల నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సీన్‌కి నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత దామోదర్ ప్రసాద్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత ఏయం రత్నం టైటిల్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఆనంద్ కొలగాని మాట్లాడుతూ.. ‘‘వినూత్నమైన అడ్వెంచర్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. సెప్టెంబర్ 6న మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘ఈ చిత్ర కథ వైవిధ్యంగా ఉంటుంది’’ అన్నారు రాజు గుడిగుంట్ల. ‘‘హీరోగా అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు విశ్వ కార్తికేయ. ‘‘ఈ సినిమా ద్వారా తెలుగుకి పరిచయం కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు రిషికా కపూర్. నిర్మాతలు అచ్చిరెడ్డి, ప్రసన్న కుమార్, డీయస్ రావు పాల్గొన్నారు. -
హీరో, నిర్మాత, డైరెక్టర్ ఒక్కరే.. కత్తి మీద సాములా బాధ్యతలు
Aye Bujji Neeku Nene Audio Launched By Producer Bekkam Venugopal: సాధారణంగా హీరోగా నటించి ప్రేక్షకుల హృదయాలను దోచుకోవడం కష్టమైన పని. అలాంటి కథానాయకుడిగా, కథ రచయితగా, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, నిర్మాత, దర్శకత్వ బాధ్యతలను చేపట్టడం కత్తిమీద సాము లాంటిదే. వాటన్నింటికి ఎంతో హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అయినా సక్సెస్ సాధిస్తామన్న గ్యారెంటీ లేదు. అయినా కూడా అన్ని బాధ్యతలను నెత్తిన వేసుకుని 'ఏయ్ బుజ్జి నీకు నేనే' అనే చిత్రంతో ముందుకు వచ్చాడు సతీష్ మేరుగు. సతీష్ మేరుగు, హృతికా సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఏయ్ బుజ్జి నీకు నేనే’. హీరోగానే కాకుండా ఈ చిత్రా నికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, నిర్మాత, దర్శకత్వ బాధ్యతలను సతీష్ మేరుగు నిర్వహించాడు. సంజన చరణ్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఆడియోను నిర్మాత బెక్కం వేణుగోపాల్ ఆవిష్కరించారు. ‘‘ఈ సినిమాలో మంచి ప్రేమకథే కాకుండా.. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలూ ఉంటాయి’’ అని సతీష్ మేరుగు తెలిపాడు. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ 1947లో పుట్టుక.. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మరణించిన నటి -
నేను నిర్మించిన సినిమాలేవీ డిజాస్టర్ కాలేదు: నిర్మాత
‘‘నేను ఇప్పటి వరకు నిర్మించిన సినిమాలేవీ నాకు చేదు అనుభవాన్ని ఇవ్వలేదు. అయితే కొన్నిసార్లు ఫలితం ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు. హిట్ అయినా ఫ్లాప్ అయినా నా మనసులో సినిమా తప్ప మరో ఆలోచన లేదు.. ఎందుకంటే నాకు తెలిసింది సినిమానే’’ అని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ అన్నారు. నేడు(బుధవారం) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ–‘‘లక్కీ మీడియా పతాకంపై నా మిత్రుడు శివాజీతో 2006లో ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ సినిమా తీశా. నిర్మాతగా అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఇన్నేళ్ల ప్రయాణంలో నాకు సహకరించిన అందరికీ థ్యాంక్స్. ‘పాగల్’ కరోనా టైంలో విడుదల కావడం వల్ల కలెక్షన్లు తగ్గాయి కానీ, నష్టాలు మాత్రం రాలేదు. శ్రీవిష్ణుతో గతంలో ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమా చేశాను. ప్రస్తుతం తనతో నిర్మిస్తున్న ‘అల్లూరి’ సినిమా చివరి షెడ్యూల్ వైజాగ్‌లో జరుగుతోంది. ఈ సినిమా నా కెరీర్‌కి బలమైన టర్నింగ్ పాయింట్ అవుతుంది. జూన్ లేదా జూలైలో ఈ సినిమా రిలీజ్ ఉంటుంది. ‘బిగ్‌బాస్’ ఫేమ్ సోహైల్ హీరోగా ‘బూట్‌కట్ బాలరాజు’ చిత్రం ప్రారంభించాం. ఆదిసాయికుమార్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాను. అలాగే మీడియా నేపథ్యంలో ఓ సినిమా చేయాలనుంది. డైరెక్టర్ అనేది పెద్ద బాధ్యత. నేనెప్పుడూ మెగాఫోన్ పట్టను. ‘ఓటీటీ’ అన్నది నిర్మాతలకు కొత్త ఆదాయ వనరులను తీసుకొచ్చింది. ఈ ఏడాది మా బ్యానర్ నుంచి మూడు సినిమాలు విడుదలవుతాయి’’ అన్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1681353966.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: పెళ్లి చేసుకున్న టీవీ నటి రష్మీ, ఫొటోలు వైరల్ దూరంగా ఉంటానన్న సింగర్, కానీ డబ్బుల కోసం మళ్లీ మొదలుపెట్టింది! -
నా కళ్లు చూసి హీరోయిన్గా అవకాశమిచ్చారు
సాయి దన్సిక, తేజ్ కూర పాటి, అభినవ్ మేడిశెట్టి, కేవీ ధీరజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం షికారు. హరి కొలగాని దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్న సందర్బంగా సోమవారం ఫిలిం ఛాంబర్లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బాబ్జి మాట్లాడుతూ.. 'కరోనా ఇబ్బందులు దాటుకొని సినిమా పూర్తి చేశాం, షికారు టైటిల్ లాగానే సినిమా కూడా బాగా వచ్చింది. మా హీరోయిన్ ధన్సిక, నలుగురు యువ హీరోలు చాలా బాగా చేశారు, సిద్ శ్రీ రామ్ పాడిన పాట బాగా వచ్చింది. ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ అవుతుంది, మా డైరెక్టర్ హరి గారు కధ చెప్పునప్పుడు ఎంత ఎక్సయిట్ అయ్యానో, సినిమా తీసిన విధానం చూసి అంతకు మించి ఎక్సయిట్ అయ్యాను. జనవరి 26న మా సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు. డైరెక్టర్ హరి మాట్లాడుతూ.. 'ఒక చిన్న సినిమా ముందుకు రావాలి అంటే ప్రొడ్యూసర్ కావాలి, ఇలాంటి సినిమాని డైరెక్ట్ చేయమని నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ బాబ్జిగారికి థాంక్స్, నేను ఏ ఆర్టిస్ట్ లు కావాలంటే వాళ్ళని నాకు ఇచ్చారు బాబ్జి గారు. రైటర్ కరుణ్ నాకు నా సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పాలి, ఆర్ట్ డైరెక్టర్ షర్మిల కూడా ఈ రోజు తన మ్యారేజ్ పనుల్లో బిజీ గా ఉండి ఇక్కడకి రాలేక పోయారు, తనకి నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను' అన్నారు. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. 'ప్రొడ్యూసర్ బాబ్జి ఇండస్ట్రీలో తెలుగు సినిమా చరిత్రలో ఆరువందల సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసారు. ప్రొడ్యూసర్‌గా చేయటం తన డ్రీం. ఈ సినిమా ఆయనకి నిర్మాతగా మంచి జర్నీకి పునాది కావాలి అని కోరుకుంటున్నాను' అని తెలిపారు. హీరోయిన్ సాయి ధన్సిక మాట్లాడుతూ.. 'ఈ సినిమా నాకు చాలా స్పెషల్, తమిళంలో చాలా ఫిల్మ్స్ చేశాను, కబాలిలో చేశాను, హరి గారు చెన్నయ్ వచ్చి కథ చెప్పారు. నా కళ్ళు చూసి ఈ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ అని హరి గారు చెప్పారు, ఈ క్యారెక్టర్ నాకు చాలా స్పెషల్' అని చెప్పుకొచ్చింది. -
మళ్లీ నిరూపించుకోవాలి!
‘‘సినిమా పరిశ్రమలో లాక్డౌన్ తర్వాత మార్పు వచ్చింది. మరో కొత్త అధ్యాయం మొదలైనట్లుంది. గత చిత్రాలతో సంబంధం లేకుండా మళ్లీ యాక్టర్స్‌గా నిరూపించుకోవాల్సి వస్తోంది’’ అని అన్నారు విశ్వక్ సేన్ . నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ‘దిల్’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న సినిమా ‘పాగల్’. ఏప్రిల్ 30న ఈ సినిమా విడుదల కానుంది. నేడు విశ్వక్సేన్ బర్త్ డే. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేశాను. ‘పాగల్’ సినిమా కూడా ఓ కొత్త ప్రయత్నం. ప్రేమించేప్పుడు కొందరు పిచ్చోడిలా ఆలోచిస్తుంటారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ అలానే ఉంటుంది. అందుకే ఈ టైటిల్ పెట్టాం. మా సినిమా టీజర్లో ఎంటర్టైన్ మెంట్ మాత్రమే చూపించాం... సినిమాలో ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇవాళ్టితో ‘పాగల్’ సినిమా షూటింగ్ పూర్తయింది. నా బర్త్ డే రోజు కూడా షూటింగ్లో పాల్గొనడం హ్యాపీగా ఉంది. నరేష్ బాగా డైరెక్ట్ చేశారు. నేను చేస్తున్న ‘ప్రాజెక్ట్ గామీ’ సినిమా పూర్తయింది. నిర్మాతలు పీవీపీ, బీవీఎస్ఎన్ ప్రసాద్గార్లతో వర్క్ చేయబోతున్నాను. ఈ ఏడాది నావి మూడు సినిమాలు రిలీజవుతాయి’’ అని అన్నారు. -
టీజర్: హీరో నిజంగా పిచ్చోడే!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం "పాగల్". పాగల్ అంటే పిచ్చి. గురువారం ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఇందులో హీరోకు నిజంగానే పిచ్చి ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ అది ప్రేమ పిచ్చి. నచ్చిన అమ్మాయి సంతోషంగా ఉండేందుకు తనను తాను కష్టపెట్టుకునేంత పిచ్చి. రౌడీలు తల మీద సీసాలు పగలగొడుతుంటే ఎదిరించి వారిని తరిమికొట్టాల్సింది పోయి లవర్ ఫేస్‌లో హ్యాపీనెస్ కనిపించట్లేదు, ఇంకా వైల్డ్‌గా కొట్టండని రెచ్చగొడుతున్నాడు. ఫలితంగా వాళ్లు చితకబాదగా అతడి శరీరం రక్తంతో తడిసిపోయింది. అప్పుడు మనోడు హీరోయిజం చూపిస్తూ వారిని చితక్కొట్టాడు. ఈ సినిమాలో హ్యాండ్సమ్గా కనిపిస్తున్న విశ్వక్ సేన్ ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్‌తో అదరహో అనిపించాడు. తన ప్రతి సినిమాకు నటనా నైపుణ్యాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. ఈ టీజర్ చూసిన నెటిజన్లు బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రేమ పిచ్చి అంత ఈజీగా తగ్గేది కాదని, ప్రేమలో పడితే హీరో కూడా పిచ్చోడే అవుతాడని కుర్రకారు హీరోలో తమను తాము చూసుకుంటున్నారు. నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. రధన్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 30న సినిమా విడుదల కానుంది. చదవండి: కామెడీ సినిమాలో నరేశ్ బాగా చేశాడని అనేవారు నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: శృతి నటుడి ఆత్మహత్య: భార్య, అత్తపై ఎఫ్ఐఆర్ -
సరికొత్త పాత్రలో
వైవిధ్యమైన కథలు, నటనకు అవకాశం ఉన్న పాత్రలతో దూసుకుపోతున్నారు శ్రీ విష్ణు. ఆయన నటిస్తున్న ‘రాజ రాజ చోళ’ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ‘గాలి సంపత్’ చిత్రంతో పాటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఓ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్‌లో ఉండగా తాజాగా మరో సినిమా అంగీకరించారు శ్రీ విష్ణు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా రూపొందనున్న చిత్రమిది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ చేయని సరికొత్త పాత్రలో శ్రీవిష్ణు కనిపిస్తారు. 2021 మొదట్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర, సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్. -
బిగ్ స్క్రీన్ అనుభూతే వేరు
‘‘ప్రస్తుతం అందరూ ఓటీటీ వేదికల్లో సినిమాలు చూస్తున్నారు. కానీ ఈ ప్రభావం థియేటర్స్ మీద ఉండదనుకుంటున్నాను. ఎందుకంటే థియేటర్‌కి ప్రత్యామ్నాయం థియేటరే. బిగ్ స్క్రీన్ అనుభూతే వేరు’’ అన్నారు నిర్మాత బెక్కం వేణు గోపాల్. ‘టాటా బిర్లా మధ్యలో లైలా, ప్రేమ ఇష్క్ కాదల్, హుషారు’ వంటి సినిమాలు నిర్మించారాయన. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ– ‘‘ఇలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. పరిస్థితులన్నీ సాధారణంగా మారిపోవాలని కోరుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. కరోనా ప్రభావం అన్ని ఇండస్ట్రీలపై ఉంది. దీన్ని అందరూ బాధ్యతగా భావించి పోరాడాలి. ఓటీటీ ప్రభావం థియేటర్స్ మీద ఉండదు. ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో సినిమాలకు రారు అన్నారు. కానీ అలా ఏం జరగలేదు. ప్రస్తుతం విశ్వక్ సేన్‌తో ‘పాగల్’ అనే సినిమా చేస్తున్నాను. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ మొదలుపెడతాం. ఆ తర్వాత శ్రీ విష్ణుతో కూడా ఓ సినిమా ప్లాన్ చేశాం. ‘రోటీ– కపడా– రొమాన్స్’ అనే మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాం. అలాగే ‘దిల్’ రాజుగారితో కొన్ని సినిమాలు కలసి చేయబోతున్నాను’’ అని తెలిపారు. -
పాగల్ ప్రారంభం
‘హిట్’ వంటి హిట్ చిత్రం తర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పాగల్’. ఈ చిత్రం ద్వారా నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. విశ్వక్సేన్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పి. కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా హీరో రానా దగ్గుబాటి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత ‘దిల్’ రాజు స్క్రిప్ట్‌ని సినిమా యూనిట్‌కు అందజేశారు. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘విశ్వక్‌తో ‘పాగల్’ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఒక క్రేజీ సబ్జెక్టుతో ఈ చిత్రం తీస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డాక షెడ్యూళ్లను ప్లాన్ చేస్తాం. నరేష్ లాంటి ప్రతిభావంతుడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘నరేష్ చెప్పిన స్క్రిప్ట్ ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో ‘పాగల్’ చిత్రాన్ని అంగీకరించా. సరికొత్త జానర్లో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు విశ్వక్సేన్. ‘‘టైటిల్‌ని బట్టి ఇది యాక్షన్ సినిమానా? అని అడుగుతున్నారు. లవ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుంది. ఒక మంచి సినిమా చూశామనే తృప్తి ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు నరేష్ కుప్పిలి. సంగీత దర్శకుడు రథన్, కెమెరామేన్ మణికంద¯Œ , ఎడిటర్ గ్యారీ, ప్రొడక్షన్ డిజైనర్ లతా తరుణ్ తదితరులు మాట్లాడారు. -
కష్టాలు దాటుకుంటూ వచ్చాం
కార్తీక్ ఆనంద్, సయ్యద్ సోహైల్ రియాన్, డింపుల్ హయతి, షాలిని ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘యురేక’. ప్రశాంత్ నిర్మించిన ఈ సినిమాకు లలిత కుమారి సహ–నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాలవారు కష్టాలు పడుతున్నారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారు సినిమాల నిర్మాణం, విడుదల వంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలి’’ అన్నారు. ‘‘ఓ కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో సాగే మర్డర్ మిస్టరీ ఈ చిత్రం. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూ, ఓ లీడ్ రోల్ చేస్తానని కథ చెప్పినప్పుడు ఎక్కువమంది ఒప్పుకోలేదు. కానీ నిర్మాత ప్రశాంత్ నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు’’అన్నారు కార్తీక్ ఆనంద్. ‘‘భవిష్యత్‌లో కార్తీక్ మంచి స్థాయిలోకి వెళతాడు’’ అన్నారు సయ్యద్. ‘‘యువత తలచుకుంటే ఏమైనా సాధించగలరు అన్నదే మా సినిమా’’ అన్నారు ప్రశాంత్. ‘‘కొత్తవారు తీసిన సినిమా అని కాకుండా తప్పక చూడండి’’ అన్నారు లలితకుమారి. నటుడు ఆర్కే, సంగీత దర్శకుడు నరేష్, ఎడిటర్ అనిల్ పాల్గొన్నారు. -
1980 ప్రేమకథ
రతన్ కిషోర్, సన్యాసిన్హా, సాగారెడ్డి, సత్య, ధన, గౌతమ్ రాజ్ ముఖ్య తారలుగా సాగారెడ్డి తుమ్మ దర్శకత్వంలో ఆగాపే అకాడమీ పతాకంపై రూపొందిన చిత్రం ‘నేను కేర్ ఆఫ్ నువ్వు’. అతుల, శేషిరెడ్డి, పోలీస్ వెంకటరెడ్డి, శరద్ మిశ్రా సహ నిర్మాతలు. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘నేను కేర్ ఆఫ్ నువ్వు’ ట్రైలర్ బాగుంది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందనిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయ్యి నిర్మాతలకు మంచి పేరు, డబ్బు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 1980లో జరిగిన కథ ఇది. ఓ పేదింటి అబ్బాయి.. ఉన్నతమైన అమ్మాయి మధ్య జరిగిన కథను ఈ సినిమాలో అందంగా చూపించారు దర్శకుడు. ఫిబ్రవరి 14న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు వెంకట్ రెడ్డి. ‘‘ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో పాటూ విలన్ పాత్రలో నటించాను. చిన్న సినిమాలు సక్సెస్ కావాలంటే అందరి సహకారం కావాలి. మనిషిని ప్రేమ జయిస్తుందని ఈ సినిమాలో చెప్పాం’’ అన్నారు సాగారెడ్డి తుమ్మ. పాటల రచయిత ప్రణవం మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: జి.కృష్ణ ప్రసాద్, సంగీతం: ఎన్.ఆర్.రఘునందన్. -
మా ఫ్యామిలీకి రుణపడి ఉంటా
నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు గణేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం శనివారం హైదరా బాద్‌లో ప్రారంభమైంది. బీటెల్ లీఫ్ ప్రొడక్షన్స్‌తో కలిసి లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి పవన్ సాదినేని దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి హీరో సాయి శ్రీనివాస్ కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. వినాయక్ మాట్లాడుతూ– ‘‘నన్ను బెల్లంకొండ సురేశ్ దర్శకునిగా పరిచయం చేస్తే, వాళ్ల పెద్దబ్బాయి సాయిని నేను హీరోగా పరిచయం చేశాను. ఇప్పుడు గణేష్ హీరోగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. ‘బ్రోచేవారెవరురా’ చిత్రదర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి మాటలు రాయటం విశేషం’’ అన్నారు. ‘‘మా అబ్బాయిని నేనే లాంచ్ చేద్దామనుకున్నాను. కానీ, బెక్కం వేణు, పవన్ సాదినేని మంచి కథతో వచ్చారు’’ అన్నారు బెల్లంకొండ సురేష్. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘ఏడాదిగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాము. గణేష్ ఈ కథకు సరిపోతాడని భావించి సురేష్‌గారికి చెప్పటంతో ఆయనకు కథ నచ్చి సరే అన్నారు’’ అని చెప్పారు. గణేష్ మాట్లాడుతూ– ‘‘ఈ కథ విన్నప్పుడు ఎమోషనల్ అయ్యాను. నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉండటానికి కారణమైన నా ఫ్యామిలీకి రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘‘నా తమ్ముడు హీరోగా పరిచయం అవటం సంతోషంగా ఉంది. మంచి కథతో హీరోగా లాంచ్ అవుతున్నాడు’’ అన్నారు సాయి శ్రీనివాస్. పవన్ సాదినేని మాట్లాడుతూ– ‘‘బ్యూటిఫుల్ లవ్‌స్టోరీతో మీ ముందుకు వస్తున్నాం. గణేశ్ ఈ కథకు కరెక్ట్‌గా సెట్ అయ్యాడు. రథన్ సంగీతం, కార్తీక్ ఘట్టమనేని కెమెరా సినిమాకు అదనపు ఆకర్షణ’’ అన్నారు. ‘‘కథ నచ్చి ఈ చిత్రానికి మాటలు రాస్తున్నాను’’ అన్నారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. -
బంధాలు మళ్లీ గుర్తొస్తాయి
‘‘నీకోసం’ సినిమా నాకు బాగా నచ్చింది. సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ హైలైట్‌గా ఉంటాయి. ఊహించని మలుపులతో కథ సాగుతుంది. ఈ చిత్రంతో అవినాష్ వంటి మరో ప్రతిభావంతుడైన దర్శకుడు టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నాడు. ఇలాంటి మంచి సినిమాను అందరూ ఆదరించాలి’’ అని నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్నారు. అరవింద్ రెడ్డి, అజిత్ రాధారామ్ హీరోలుగా, çశుభాంగి పంత్, దీక్షితా పార్వతి హీరోయిన్లుగా అవినాష్ కోకటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీకోసం’. రాజలింగం సమర్పణలో అల్లూరమ్మ (భారతి) నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. అవినాష్ కోకటి మాట్లాడుతూ– ‘‘ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. ప్రివ్యూ చూసిన పెద్దలందరూ సినిమా చాలా బావుందని మెచ్చుకున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. మర్చిపోయిన లేదా వదిలేసిన బంధాలన్నీ మళ్లీ గుర్తొస్తాయి’’ అన్నారు. ‘‘అందరం కొత్తవాళ్లమే అయినా చాలా కొత్తదనం ఉన్న కథతో వస్తున్నాం’’ అన్నారు అరవింద్ రెడ్డి. ‘‘మా సినిమాలో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు అజిత్ రాధారామ్. ‘‘ఈ సినిమాకి రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడే మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం కుదిరింది’’ అన్నారు సంగీత దర్శకుడు శ్రీనివాస్ శర్మ. శుభాంగి పంత్, దీక్షితా పార్వతి మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: శివక్రిష్ణ యెడుల పురమ్. -
‘పాగల్’గా ‘ఫలక్‌నుమా దాస్’
టాటా బిర్లా మధ్యలో లైలా, మేం వయసుకు వచ్చాం, సినిమా చూపిస్తా మామా లాంటి సినిమాలు అందించిన లక్కీ మీడియా బ్యానర్, రీసెంట్ గా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ హుషారు తో మరో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ ఇప్పుడు మరో క్రేజీ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇటీవల ఫలక్నమా దాస్‌తో సక్సెస్‌ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్ తో కలిసి ‘పాగల్’ అనే కొత్త చిత్రం నిర్మించనున్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్. ఈ మూవీతో నరేష్ రెడ్డి కుప్పిలి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. క్రేజీ లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ ద్వితీయార్థం నుండి మొదలుకానుంది. ఈ సందర్బంగా నిర్మాత బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ.. ‘ఫలక్ నమా దాస్ లాంటి సూపర్ హిట్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన హీరో విశ్వక్ సేన్‌తో మా లక్కీ మీడియా బ్యానర్ నెక్ట్ ప్రాజెక్ట్ చేయడం హ్యాపీగా ఉంది. మా గత చిత్రం హుషారు సక్సెస్ మాకు మరిన్ని మంచి చిత్రాలు చేయడానికి, కొత్త వాళ్ళను ఇంట్రడ్యూస్ చేయడానికి మంచి ఉత్సాహన్నిచ్చింది. ఈ మూవీ తో మా బ్యానర్ ద్వారా నరేష్ రెడ్డి కుప్పిలి అనే మరో యంగ్ డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. తను చెప్పిన ఇంట్రెస్టింగ్ పాయింట్‌కు అందరం బాగా కనెక్ట్ అయ్యాం.ఈ పాగల్ మూవీ బెస్ట్ లవ్ స్టొరీ అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. సెప్టెంబర్ ద్వితీయార్థం నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. మిగతా వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’ అన్నారు. దర్శకుడు నరేష్ రెడ్డి కుప్పిలి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ -
ఫీల్ గుడ్ మూవీ
శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ జంటగా సతీష్‌చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినరా సోదరా వీరకుమార’. లక్ష్మీస్ సినీ విజన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్ క్యాదారి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత బెక్కం వేణుగోపాల్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నెల క్రితమే ఈ చిత్రం ట్రైలర్‌ను చూశాను. చాలా బావుంది. ఇదొక ఫీల్ గుడ్ మూవీ. ఎన్నో ఎమోషన్స్ ఉన్న చిత్రమిది’’ అన్నారు. ‘‘ఇందులో నాది చాలా మంచి పాత్ర. మొదటిసారి హీరో ఫాదర్ క్యారెక్టర్ చేశాను’’ అన్నారు నటుడు ఉత్తేజ్. సతీష్ నాదెళ్ల మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ అవ్వాలని ఎన్నో ఏళ్లుగా ట్రై చేస్తున్నాను. నాకీ అవకాశం ఇచ్చిన లక్ష్మణ్‌గారికి కృతజ్ఞతలు. ఇది చాలా జెన్యూన్‌గా రాసిన కథ. ఈ చిత్రం మొత్తాన్ని కాకినాడలో 50 రోజుల సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేశాం’’ అన్నారు. ‘‘మా సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు లక్ష్మణ్ క్యాదారి. కెమెరామెన్ రవి.వి, మాటల రచయిత లక్ష్మీభూపతి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనిల్ మైలాపుర్. -
ఆడదన్నవాళ్లే అభినందిస్తున్నారు
‘‘ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. మంచి కంటెంట్ ఉంటనే సినిమా చూడటానికి థియేటర్స్‌కు వస్తున్నారు’’ అని దర్శకుడు హర్ష కొనుగంటి అన్నారు. తేజస్ కంచర్ల, దక్షా, ప్రియా వడ్లమాని, రమ్య, తేజ్, అభినవ్, దినేష్ ముఖ్యతారలుగా ‘హుషారు’ అనే చిత్రం రిలీజైన సంగతి తెలిసిందే. బెక్కెం వేణుగోపాల్ నిర్మాత. ఇందులో రాహుల్ రామకృష్ణ కీలక పాత్ర చేశారు. వచ్చే నెల 1కి ఈ సినిమా 50రోజులు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు హర్ష మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా నా సినిమా 50 రోజుల పూర్తి చేసుకోబోతుండటం చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా ఈ శుక్రవారం ఓ వేడుక నిర్వహించాలనుకుంటున్నాం. ఈ సినిమాను స్టార్ట్ చేసిన తర్వాత సరిగ్గా ఆడదని చాలామంది నాతో అన్నారు. అయినప్పటికీ నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. నటీనటులందరూ బాగా నటించారు. రథన్ మంచి మ్యాజిక్ ఇచ్చారు. ఎవరైతే ఈ సినిమా ఆడదు అన్నారో రిజల్ట్ వచ్చిన తర్వాత వారే శుభాకాంక్షలు చెప్పారు. మా టార్గెట్ ఆడియన్స్ యూత్ అనుకున్నాం. వాళ్లు మళ్లీ మళ్లీ మా సినిమాను చూశారు. ఇందులో ‘ఉండిపోరాదే’ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ పాట బాగుందని అల్లు అర్జున్‌గారు ట్వీట్ చేయడం హ్యాపీ. ఈ సినిమా తమిళం, హిందీలో రీమేక్ కాబోతుంది. నేను డైరెక్ట్ చేయడం లేదు. నా నెక్ట్స్ మూవీ కోసం రెండు సబ్జెక్ట్స్‌ను అనుకుంటున్నాను. ఇందులో ఒక యూత్‌ఫుల్ మూవీ ఉంది. విజయ్ దేవరకొండకు వినిపించాలనుకుంటున్నాను’’ అని అన్నారు. -
అందరికీ ధన్యవాదాలు
‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం’ ఇలా వరుసగా సినిమాలు చేస్తూ తనలోని నటుణ్ణి మరింత సానపెడుతున్నారు యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. గురువారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘సాయీ.. హ్యాపీ బర్త్‌డే. సాయి శ్రీనివాస్‌తో ‘అల్లుడు శీను’ సినిమా చేసాను. కొత్త హీరోతో చేసినట్లు అనిపించలేదు. అలవాటు ఉన్న హీరోతో చేసిన అనుభూతి కలిగింది. బోయపాటిగారితో మంచి యాక్షన్ సినిమా చేశాడు. ఆర్టిస్టుగా సాయి మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. సాయి ఇంకా పెద్ద హీరో అవుతాడు. సినిమా ఫెయిల్యూర్స్ అందరికీ వస్తాయి. కానీ సాయి మాత్రం ఫెయిల్ అవ్వలేదు. అవ్వడన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సాయి శ్రీనివాస్ బెల్లంకొండకు పుట్టినరోజు∙శుభాకాంక్షలు. సాయి హీరోగా కంటే ముందు మా ఫ్యామిలీ మెంబర్. సాయి హీరో అవుతానన్నప్పటి నుంచి అతని వర్క్ చూస్తూనే ఉన్నాం. సందేహం లేదు. సినిమా సినిమాకి యాక్టింగ్, డ్యాన్స్‌లో ప్రతిభను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మంచి కథలను ఎంపిక చేసుకుంటే టాలీవుడ్లో సాయి శ్రీనివాస్ వన్నాఫ్ ది బెస్ట్ హీరోస్ అవుతాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేదు. సరైన ఆర్టిస్టుకు మంచి సినిమా పడితే మంచి స్టార్ హీరోగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. సాయికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘ఇంతకుముందు ‘దిల్’ రాజుగారు మాట్లాడుతూ మంచి కథలను ఎంపిక చేసుకోవాలి అన్నారు.ఇప్పుడు మేం సాయితో చేస్తున్న సినిమా కథ భిన్నమైనదని అనుకుంటున్నాం. యాక్షన్, డ్యాన్స్‌ల్లో సాయిని పర్ఫెక్ట్గా చూసి ఉంటారు. ఈ సినిమాలో తన నటనలోని కొత్త కోణాన్ని బయటపెట్టాడు. అవుట్‌పుట్ పట్ల చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర. ‘‘ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల జాబితాలోకి సాయిగారి పేరు ఈ ఏడాదే చేరుతుందని చెప్పగలను’’ అన్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. ‘‘నన్ను హీరోగా లాంచ్ చేసిన వినాయక్ అంకుల్ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ఆయనకు ధన్యవాదాలు. నన్ను ఎప్పుడూ ప్రోత్సహించే ‘దిల్’ రాజుగారికి థ్యాంక్స్. అనిల్‌గారు వచ్చి ఆశీర్వదించినందుకు థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన అజయ్ భూపతిగారికి, ఇంకా నిర్మాతలు అభిషేక్ నామా, అభిషేక్ అగర్వాల్‌కి ఇలా అందరికీ థ్యాంక్స్’’ అన్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, బెక్కెం వేణుగోపాల్, మల్టీ డైమన్షన్ వాసు పాల్గొన్నారు. -
అది రాంగ్ స్టెప్
‘‘ఫ్రెండ్షిప్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాలు రాలేదు. ఈ నేపథ్యంలోని ‘ఈ నగరానికి ఏమైంది’, హుషారు’ ఒకేసారి మొదలయ్యాయి. అయితే ఆ సినిమా రిలీజ్ అయింది. నలుగురు స్నేహితులు కలిసి చేసే సాహసాలే మా చిత్రం’’ అని తేజస్ కంచర్ల అన్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తేజస్, దక్ష, అభినవ్, ప్రియా ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘హుషారు’. బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానున్న సందర్భంగా హీరో తేజస్ చెప్పిన విశేషాలు. ∙మాది సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాదు. సినిమాలపై ఇంట్రెస్ట్‌తో ఇంజనీరింగ్ మధ్యలోనే ఆపేసి అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టా. తేజాగారి ‘నీకు నాకు’లో హీరోగా అవకాశం ఫస్ట్ నాకే వచ్చింది. ‘అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయి, నెక్ట్స్ సినిమాలో హీరోగా చేద్దువుగానీ’ అని తేజాగారు అన్నారు. ఆ సినిమా చేయడంవల్ల చాలా విషయాలు నేర్చుకున్నా. ∙నిర్మాత కేయస్ రామారావుగారు, మా నాన్న స్నేహితులు. దాంతో ప్రకాశ్‌రాజ్‌గారి ‘ఉలవచారు బిర్యాని’ చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ సినిమా చేస్తున్నప్పుడే విభిన్న కథలు ఎంచుకోవాలని ఫిక్స్ అయ్యాను. రెండో సినిమా ‘కేటుగాడు’ చేశాను. అది రాంగ్ స్టెప్ అని అర్థం అయ్యింది. ‘హుషారు’ నా మూడో సినిమా. ఈ సినిమా మేకింగ్‌లో ఆలస్యం అయ్యింది. అయినా కూడా నిర్మాత వేణుగోపాల్‌గారు మాలో హుషారు నింపారు. ∙కాలేజ్ పూర్తయిన తర్వాత లైఫ్‌లో ఏం చేయాలి? అని ఆలోచిస్తున్న టైమ్‌లో మా ఫ్రెండ్‌కి క్యాన్సర్ వస్తుంది. అప్పుడు అతని స్నేహితులుగా మేం ఎలా రియాక్ట్ అయ్యాం? లైఫ్‌లో ఎలా ఎదిగాం? అన్నదే చిత్రకథ. ఇందులో నా రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉండే ఆర్య అనే పాత్ర చేశా. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా. ఇకపై లీడ్ క్యారెక్టర్స్ మాత్రమే చేద్దాం అనుకుంటున్నాను. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. పెద్ద బ్యానర్లో మరో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. -
డైరెక్షన్ మాత్రం చేయను
‘‘ఉద్యోగం అంటే ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం చేసే సాఫ్ట్వేర్ ఉగ్యోగి పాత్రలో నటించాను. నాకూ ఈ సినిమాలో హీరోలకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది ‘హుషారు’ సినిమాలో చూడాలి’’ అన్నారు నటుడు రాహుల్ రామకృష్ణ. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ చిత్రం ‘హుషారు’. బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించారు. తేజస్, అభినవ్, దక్ష, ప్రియా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాహుల్ రామకృష్ణ పలు విశేషాలు పంచుకున్నారు. ‘‘అర్జున్ రెడ్డి’ చిత్రం తర్వాత పూర్తిస్థాయి పాత్ర చేస్తున్నది ఈ చిత్రంలోనే. సెకండ్ హాఫ్ మొత్తం నా క్యారెక్టర్ కనిపిస్తుంది. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే జ్ఞాపకాలు తప్ప ఇంకేం ఉండవు అనే మెసేజ్‌ని దర్శకుడు చెప్పదలిచారు. నా పాత్ర కోసం నా సాఫ్ట్వేర్ స్నేహితులను స్ఫూర్తిగా తీసుకొని నటించా. ప్రస్తుతం వెబ్ సీరిస్‌ల కోసం కథలు రాస్తున్నాను. దర్శకత్వం మాత్రం చేసే ఆలోచన లేదు. అలాగే సందీప్ కిషన్ ‘నిను వీడని నీడను నేను’లో విలన్‌గా నటిస్తున్నాను. రాజమౌళిగారి ‘ఆర్ఆర్ఆర్’లో కీలక పాత్ర, రాజశేఖర్ ‘కల్కీ’ చిత్రంలో యాక్ట్ చేస్తున్నా’’ అన్నారు.