
డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో తెరకెక్కుతున్న చిన్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో అంతా కొత్తవారితో తెరకెక్కుతున్న మరో డిఫరెంట్ మూవీ ‘హుషారు’. ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘ మేము వయసుకు వచ్చాం’ , ‘సినిమా చూపిస్త మావ’ లాంటి సినిమాలను తెరకెక్కించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం వేణుగోపాల్ తమ బ్యానర్‌లో 9వ ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నటీనటులుగా అంతా కొత్తవారే కనిపించనున్నారు. ‘అర్జున్ రెడ్డి’ తో పాపులర్ అయిన సంగీత దర్శకుడు రథన్ , సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ చిత్ర లోగో ని అగ్రనిర్మాత ‘దిల్ రాజు’ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు . ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘మా బ్యానర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమా ఇది.
కథా కథనాలు చాలా ఇన్నోవేటివ్ గా , ట్రెండీగా ఉంటాయి. దర్శకుడు శ్రీ హర్ష చాలా బాగా తెరకెక్కించారు. షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఆగష్టు నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment