Cinema Chupistha Mava
-
అంతా కొత్తవారితో ‘హుషారు’
డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో తెరకెక్కుతున్న చిన్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో అంతా కొత్తవారితో తెరకెక్కుతున్న మరో డిఫరెంట్ మూవీ ‘హుషారు’. ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘ మేము వయసుకు వచ్చాం’ , ‘సినిమా చూపిస్త మావ’ లాంటి సినిమాలను తెరకెక్కించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం వేణుగోపాల్ తమ బ్యానర్లో 9వ ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నటీనటులుగా అంతా కొత్తవారే కనిపించనున్నారు. ‘అర్జున్ రెడ్డి’ తో పాపులర్ అయిన సంగీత దర్శకుడు రథన్ , సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ చిత్ర లోగో ని అగ్రనిర్మాత ‘దిల్ రాజు’ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు . ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘మా బ్యానర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమా ఇది. కథా కథనాలు చాలా ఇన్నోవేటివ్ గా , ట్రెండీగా ఉంటాయి. దర్శకుడు శ్రీ హర్ష చాలా బాగా తెరకెక్కించారు. షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఆగష్టు నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం’ అన్నారు. -
సినిమా ఎలా ఉంది మావ..
పట్టణంలో ‘సినిమా చూపిస్తా మావ’ చిత్ర యూనిట్ సందడి విజయనగరం టౌన్ : ‘సినిమా చూపించాను మావ... ఎలా ఉంది... మంచి చిత్రాలను తీసి మీ ఆదరణ పొందుతాను.’ అంటూ యువ హీరో రాజ్ తరుణ్ స్థానిక ఆదిత్య థియేటర్లో ఆదివారం రాత్రి సందడి చేశారు. ‘సినియా చూపిస్తా మావ’ చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం వచ్చామన్నారు. కథలో ప్రతి అంశాన్ని కొత్తదనంతో చూపించేందుకు దర్శకులు ప్రయత్నం చేశారన్నారు. సినిమాను ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుకుమార్ నిర్మాతగా కుమారి -21లోనూ, శ్రీశైలేంద్ర మూవీస్ బ్యానర్‌పై మరో చిత్రంలోనూ నటించనున్నామన్నారు. డెరైక్టర్‌ను అవుదామని సినీ ఫీల్డ్‌కు వచ్చానని, షార్ట్ ఫిల్మ్ తీస్తే హీరోగా అవకాశం వచ్చిందన్నారు. మహేష్‌బాబు, బన్నీలంటే చాలా ఇష్టమని తెలిపారు. సహాయ నటుడు సంతోష్ మాట్లాడుతూ తాను మెంటాడకు చెందిన వాడినని, జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తానన్నారు. కార్యక్రమంలో డైలాగ్ రైటర్ ప్రసన్న, రాజ్‌భాయ్, థియేటర్ మేనేజర్ బి.హరివర్మ తదితరులు పాల్గొన్నారు.