Vishwak Sen Paagal Movie, Official Teaser Released | హీరో నిజంగా పిచ్చోడే!- Sakshi
Sakshi News home page

విశ్వక్‌ సేన్‌ పాగల్‌ టీజర్‌ వచ్చేసింది..

Published Thu, Feb 18 2021 11:22 AM | Last Updated on Thu, Feb 18 2021 1:37 PM

Vishwak Sen Paagal Teaser Out Now - Sakshi

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న తాజా చిత్రం "పాగల్‌". పాగల్‌ అంటే పిచ్చి. గురువారం ఈ సినిమా టీజర్‌ రిలీజైంది. ఇందులో హీరోకు నిజంగానే పిచ్చి ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ అది ప్రేమ పిచ్చి. నచ్చిన అమ్మాయి సంతోషంగా ఉండేందుకు తనను తాను కష్టపెట్టుకునేంత పిచ్చి. 

రౌడీలు తల మీద సీసాలు పగలగొడుతుంటే ఎదిరించి వారిని తరిమికొట్టాల్సింది పోయి లవర్‌ ఫేస్‌లో హ్యాపీనెస్‌ కనిపించట్లేదు, ఇంకా వైల్డ్‌గా కొట్టండని రెచ్చగొడుతున్నాడు. ఫలితంగా వాళ్లు చితకబాదగా అతడి శరీరం రక్తంతో తడిసిపోయింది. అప్పుడు మనోడు హీరోయిజం చూపిస్తూ వారిని చితక్కొట్టాడు. ఈ సినిమాలో హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్న విశ్వక్‌ సేన్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, యాక్టింగ్‌తో అదరహో అనిపించాడు. తన ప్రతి సినిమాకు నటనా నైపుణ్యాన్ని పెంచుకుంటూ పోతున్నాడు.

ఈ టీజర్‌ చూసిన నెటిజన్లు బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రేమ పిచ్చి అంత ఈజీగా తగ్గేది కాదని, ప్రేమలో పడితే హీరో కూడా పిచ్చోడే అవుతాడని కుర్రకారు హీరోలో తమను తాము చూసుకుంటున్నారు. నరేశ్‌ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్నారు. రధన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్‌ 30న సినిమా విడుదల కానుంది.

చదవండి: కామెడీ సినిమాలో నరేశ్‌ బాగా చేశాడని అనేవారు

నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: శృతి

నటుడి ఆత్మహత్య: భార్య, అత్తపై ఎఫ్‌ఐఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement