Paagal Movie
-
అమెజాన్ ప్రైంలోకి ‘పాగల్’ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Paagal Movie OTT Release: ‘‘డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, నిర్మాతలు సంతోషంగా ఉన్నప్పుడే ఓ సినిమా సూపర్ హిట్ అయినట్లుగా భావిస్తాను’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్. విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నరేశ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ‘పాగల్’ ఆగస్టు 14న విడుదలైంది. ఈ సినిమా ఈ నెల 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘‘పాగల్’కి వసూళ్లు బాగా వచ్చాయి. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం సంతోషంగా ఉంది. కరోనా ఫస్ట్‌వేవ్ తర్వాత థియేటర్స్‌లో సినిమాను చూడటానికి ప్రేక్షకులు బాగా వచ్చారు. చదవండి: కృష్ణగారు అలా అనగానే కన్నీళ్లొచ్చాయి! ఆ సమయంలో వచ్చి, హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత ఆడియన్స్ ఆశించిన స్థాయిలో థియేటర్స్‌కు రావడం లేదు. థర్డ్ వేవ్ వస్తుందని వినిపిస్తున్న వార్తలు కూడా ఓ కారణం కావొచ్చు. మిడిల్ క్లాస్ ఆడియన్స్ థియేటర్స్‌కు వచ్చినప్పుడే పెద్ద స్థాయి కలెక్షన్స్ చూడొచ్చు. ప్రస్తుతం శ్రీవిష్ణు హీరోగా ఓ సినిమా చేస్తున్నాం. డిసెంబరులో రిలీజ్ అనుకుంటున్నాం. ఓటీటీ ప్లాట్ఫామ్స్వల్ల మార్కెట్ పెరిగింది. నిజానికి అందరూ థియేటర్స్‌కు రారు. అలా రానివారు ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నారు. ఆ వ్యూయర్స్ అంతా ఎక్స్ట్రా ఆడియన్సే’’ అని అన్నారు. -
విమర్శించండి.. కానీ దాడి చేయకండి: విశ్వక్ సేన్
నరేశ్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘పాగల్’. ‘దిల్’ రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం అగష్టు 14న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో విశ్వక్ ప్రేక్షకులకు, అభిమానులకు, సినీ విమర్శకులకు ఓ సందేశం ఇచ్చాడు. సోమవారం ఉదయం విశ్వక్ తన ప్రకటనలో ప్రేక్షకులను బ్యాగ్రౌండ్‌లేకుండా వచ్చిన తనకు అండ.. దండ మీరు అని పేర్కొన్నాడు. అంతేగాక.. ‘నేను మీ విశ్వక్ సేన్. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతదూరం వచ్చిన నన్ను.. ‘పాగన్’ సినిమాను ఆదరిస్తారనీ.. సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ తెరిచిన సినిమా థియేటర్లను నిలబెడతారని కోరుకుంటున్నాను. మా ప్రయత్నంలో మీకు ఏదైనా చిన్న లోపం అనిపిస్తే.. విమర్శించండి. కానీ, దయచేసి దాడి చేయకండి. తట్టుకునే శక్తి.. ఉన్నా లేకపోయినా.. ఎన్నో వేలమందికి ఉపాధి కలిగించే.. సినిమా థియేటర్స్‌ను కాపాడండి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన నాకు మీరే అండ.. దండ..’ అని పేర్కొన్నాడు. కాగా ఇటీవల జరిగిన పాగల్ ప్రిరిలీజ్ వేడుకలో విశ్వక్ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కరోనాతో మూత పడిన థియేటర్లను పాగల్‌తో ఓపెన్ అయ్యేలా చేస్తానని, అలా జరగకపోతే పేరు మార్చుకుంటా అంటూ అతడు చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఇక సినిమా విడుదలైన అనంతరం ‘పాగల్’ మూవీ విజయంపై తనకు నమ్మకం ఉందని, ప్రీ రిలీజ్ వేడుకలో తను మాట్లాడిన ఏ మాటను కూడా వెనక్కి తీసుకోవడం లేదన్నాడు. -
అక్కడ అజిత్ సార్... ఇక్కడ విశ్వక్ సేన్
-
గరం గరం ముచ్చట్లు 14 August 2021
-
పాగల్ మూవీ రివ్యూ
టైటిల్ : పాగల్ జానర్ : రొమాంటిక్ కామెడీ నటీనటులు : విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ , సిమ్రాన్ చౌదరి, మేఘలేఖ, మురళీశర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా నిర్మాతలు : బెక్కెం వేణుగోపాల్ దర్శకత్వం: నరేష్ కుప్పిలి సంగీతం : రధన్ సినిమాటోగ్రఫీ : ఎస్. మణికందన్ విడుదల తేది : ఆగస్ట్ 14,2021 టాలీవుడ్లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ‘వెళ్లిపోమాకే’ తో తెలుగు సినిమాకు పరిచయమైన విశ్వక్ సేన్ తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత మలయాళ హిట్ సినిమా అంగమలై డైరీస్ తెలుగు రీమేక్ ఫలక్‌నుమా దాస్‌లో నటించి నిర్మించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. ఇక ‘హిట్’ అంటూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో అందరినీ ఆశ్చర్చపరిచారు. ఇలా వైవిధ్యమైన సినిమాను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విశ్వక్.. తాజాగా నటించిన చిత్రం ‘పాగల్’. ఇందులో విశ్వక్ సేన్ ప్రేమికుడిగా కనిపించడం, దిల్ రాజ్ ఈ సినిమాను సమర్పిస్తుండడంతో ‘పాగల్’పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దీనికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌తో పాటు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘మాస్కా దాస్’అందుకున్నాడా? లేదా? ‘పాగల్’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథ ప్రేమ్(విశ్వక్ సేన్)కు తన తల్లి (భూమిక)అంటే చాలా ఇష్టం. ప్రపంచంలో అమ్మలాగా ఎవరూ ప్రేమించలేరని నమ్ముతాడు. అయితే తన ఏడేళ్ల వయసులో తల్లిని కోల్పోతాడు ప్రేమ్. అమ్మ ప్రేమకి దూరమై ప్రేమ్‌కి ఆ ప్రేమని పొందాలంటే అమ్మాయి వల్లే సాధ్యమని తన స్నేహితుడు సలహా ఇస్తాడు. ప్రేమలో ఏమీ ఆశించకూడదు అని చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలను కూడా ప్రేమ్ మనసులో పెట్టుకొని కనిపించిన ప్రతి అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. నన్ను ప్రేమిస్తే అమ్మలా చూసుకుంటానంటూ.. అమ్మాయిల చుట్టూ తిరుగుతాడు. కానీ అందరూ ప్రేమ్ ప్రేమని తిరస్కరిస్తారు. కొంతమంది అమ్మాయిలు డబ్బు కోసం అతన్ని వాడుకొని వదిలేస్తారు. ఇలా ప్రేమలో విఫలం అయినా ప్రేమ్.. చివరకు రాజకీయ నాయకుడు రాజిరెడ్డి అలియాస్ రాజీ (మురళీశర్మ)తో ప్రేమలో పడతాడు. తనను లవ్ చేయమని రాజీ చుట్టూ తిరుతాడు. పురుషుడైన రాజీని ప్రేమ్ ఎందుకు లవ్ చేశాడు? ప్రేమ్‌కి జీవితంలోకి తీర(నివేతా పేతురాజ్) ఎలా వచ్చింది? అమ్మ ప్రేమ కోసం వెతికిన ప్రేమ్‌కి చివరకు అలాంటి ప్రేమ దక్కిందా? లేదా? అనేదే మిగతా కథ నటీ, నటులు లవర్ బాయ్ ప్రేమ్ పాత్రలో విశ్వక్ సేన్ ఒదిగిపోయాడు. కామెడీ, ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. తీర పాత్రకి నివేతా పేతురాజ్ న్యాయం చేసింది. నిడివి తక్కువే అయినా ఉన్నంత సేపు తెరపై అందంగా కనిపించింది. ఇక విశ్వక్ సేన్ తర్వాత బాగా పండిన పాత్ర మురళీ శర్మది. ఎమ్మెల్యే అభర్థిగా పోటీ చేస్తూ.. ప్రేమ్ పెట్టే ప్రేమ టార్చర్‌ని భరిస్తూ అద్భుత కామెడీని పండించాడు. రాహుల్ రామకృష్ణ, మహేశ్‌లు కామెడీతో మెప్పించారు. సిమ్రాన్ చౌదరి, మేఘలేఖ తదితరులు తమ పాత్రల పరిధి మేర ఆకట్టుకున్నారు. విశ్లేషణ తల్లిలా ప్రేమించే అమ్మాయి కోసం వెతికే ఓ యువకుడి కథే ‘పాగల్’.‘ మనం ఎవర్ని ప్రేమించినా తిరిగి ప్రేమిస్తారు.. నువ్ అన్ కండిషనల్‌గా ప్రేమించు’ అని చిన్నప్పుడు తల్లి చెప్పిన మాటలు విని.. కనిపించిన ప్రతి అమ్మాయికి ప్రపోజ్ చేసుకుంటూ వెళ్తాడు హీరో. కథతో కాస్త కొత్తదనం, చమత్కారం ఉన్నప్పటీ.. తెరపై అది వర్కౌట్ కాలేదనిపిస్తుంది. మదర్ సెంటిమెంట్‌కి కామెడీ టచ్ ఇచ్చి కథను నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు నరేశ్. కానీ అది బెడిసి కొట్టింది. చాలా చోట్ల లాజిక్ మిస్ అవుతుంది. అమ్మాయిలను ప్రేమించడానికి హీరో వైజాగ్ వెళ్లడం, తిరిగి హైదరాబాద్‌కు రావడం, అక్కడ రాజకీయనాయకుడితో గే లవ్ లాంటి సీన్స్ సిల్లీగా అనిపించినప్పటికీ మురళీ శర్మ కామెడీ మాత్రం నవ్వులు పూయిస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. ఫస్టాఫ్ అంతా కామెడీతో పర్వాలేదనిపించినా...సెకండాఫ్‌లో మాత్రం కొన్ని సీన్స్ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి. హీరో, హీరోయిన్ల మధ్య పరిచయం. అది ప్రేమగా మారడం, 6 నెలలు ప్రేమించుకునేలా కండీషన్ పెట్టడం అంతా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అలాగే ఒక వ్యక్తిలో మార్పు తీసుకురావడం కోసం హీరో చేసింది సిల్లీగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా రోటీన్‌గా ఉండడం కాస్త ప్రతికూల అంశమే . ఇక సినిమాకు ఉన్నంతతో ప్రధాన బలం రధన్ సంగీతమనే చెప్పాలి. ఫస్టాఫ్‌లోని `గూగుల్ గూగుల్..`, `ఈ సింపుల్ చిన్నోడు’పాటతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించాడు. ఎస్. మణికందన్ సినమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, మురళి శర్మ నటన సంగీతం సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ కథ, కథనం వర్కౌట్ కానీ లవ్ సీన్స్ సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్స్ రొటీన్ క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ మాటల్ని వెనక్కి తీసుకోను : విశ్వక్ సేన్
‘పాగల్’ సినిమా విజయంపై నమ్మకం ఉంది కాబట్టే ప్రీ రిలీజ్ వేడుకలో నేను మాట్లాడిన ఏ మాటను కూడా వెనక్కి తీసుకోవడం లేదు. నా స్నేహితులు, ఇతరులు మా చిత్రం ప్రివ్యూ చూసి, ‘నువ్వు పేరేం మార్చుకోనక్కర్లేదు’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. నరేశ్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘పాగల్’. ‘దిల్’ రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘సినిమా మొదలైన తొలి ఐదు, పది నిమిషాల్లోనే కథ ఏంటనేది ప్రేక్షకులకు స్పష్టత వచ్చేస్తుంది. ‘నీ అంత బాగా నన్నెవరు చూసుకుంటారమ్మా?’ అని హీరో తన తల్లిని అడిగినప్పుడు, ‘మనం నిజాయతీగా ప్రేమిస్తే వాళ్లు తిరిగి ప్రేమిస్తారు’ అని అంటుంది. ఏ అమ్మాయిని అయినా అన్కండిషనల్గా ప్రేమిస్తే తన తల్లి చూపించే అంతటి ప్రేమ దొరుకుతుందని హీరోకి అనిపిస్తుంది. ఆ పాయింట్ మీదనే సినిమా నడుస్తుంది. ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చే ముందు నా సినిమాను ఒకసారి చూసుకుంటాను. ఎక్కువ, తక్కువ కాకుండా సినిమాని బట్టి వేదికపై మాట్లాడతాను. ‘పాగల్’ సినిమా గురించి థియేటర్ నుంచి ఇంటికెళ్లిన తర్వాత కూడా మాట్లాడుకుంటారు. మాది పెద్ద సినిమా కాదు కానీ గొప్ప సినిమా అని చెప్పగలను. ఇప్పటి వరకు నేను నాలుగైదు సినిమాలు చేశాను. వాటిని చూసిన నా ఫ్రెండ్స్ నన్ను పొగడలేదు. కానీ ‘పాగల్’ ప్రివ్యూ చూసి బాగుందని పొగిడారు. ఈ సినిమాని నమ్ముకుని చాలామంది భవిష్యత్ ఉంది. పైగా ప్రేక్షకులకు థియేటర్ అనుభూతి ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఓటీటీకి వెళ్లకుండా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. ప్రస్తుతం పీవీపీ, ‘దిల్’ రాజుగార్లు నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నాను. ఇప్పటికే 70 శాతం పూర్తయింది. ఈ చిత్రం తర్వాత బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడుగార్లు నిర్మించనున్న ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా చేస్తాను’’ అన్నారు. -
‘పాగల్’ ప్రీరిలీజ్: విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు, వీడియో వైరల్
మాస్ కా దాస్, యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘పాగల్’. ఈ మూవీలో విశ్వక్ లవర్‌బాయ్‌గా అలరించనున్నాడు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ అగష్టు 14న థియేటర్లల్లో వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో నేడు పాగల్ ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కరోనాతో మూత పడిన థియేటర్లను పాగల్‌తో ఓపెన్ అయ్యేలా చేస్తానని, అలా జరగకపోతే పేరు మార్చుకుంటా అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ సందర్భంగా విశ్వక్ ‘ఇప్పుడే సినిమా ఫైనల్ కాపీ చూశా. బొమ్మ అదిరిపోయింది. నన్ను డైరెక్టర్ నరేశ్ పిలిచి ‘పాగల్’ కథ వివరించాడు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని అప్పడే అనిపించింది. మా టీం అద్భుతంగా వర్క్ చేసింది. వారందరికి ధన్యవాదాలు. శనివారం నాడు పబ్బులు, బార్లలోనే కాదు నా సినిమా ఆడే థియేటర్లలో కూడా పార్టీలు జరుగుతాయి. పూర్తిగా థియేటర్లు తెరుచుకోకముందే ఇప్పుడేందుకు ‘పాగల్’ విడుదల చేస్తున్నారని అడిగిన వారందరికి నేను చెప్పేది ఒక్కటే. సర్కస్‌లో సింహంతో ఎవరైనా ఆడుకుంటారు. నేను అడవి కొచ్చి ఆడుకునే టైప్. ఈ సినిమాతో మూసుకున్న థియేటర్లు కూడా ఓపెన్ అయ్యేలా చేస్తా. గుర్తుపెట్టుకోండి. నా పేరు విశ్వక్ సేన్.. నేను చెప్పింది జరగకపోతే నా పేరు మార్చుకుంటా’ అని అన్నాడు. ఇక హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి చెబుతూ.. ఏ ఇంటర్వ్యూలోనైనా తను ఇలియాన ఫ్యాన్ అని చెప్పుకున్నానని, కానీ ఇప్పటి నుంచి తాను నివేదా పేతురాజ్ అభిమానిని అన్నాడు. నమ్మండి మీరు కూడా ఆమెకు ఫ్యాన్స్ అయిపోతారని, ఈ సినిమాలో ఆమె చాలా బాగా చేసిందంటూ విశ్వక్ చెప్పుకొచ్చాడు. -
సినిమా జాతర మొదలైంది... ఈ వారం ఏకంగా 9 చిత్రాలు విడుదల
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో, థియేటర్స్ కి మెల్ల మెల్లగా పూర్వవైభవం వస్తోంది. కరోనా భయాన్ని వదిలి ప్రేక్షకులు సినిమా హాళ్లకు వస్తుండటంతో నిర్మాతలు కూడా ఎలాంటి సందేహం లేకుండా సినిమాలను విడుదల చేస్తున్నారు. గత శుక్రవారం నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. వాటిలో కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ ఆర్ కల్యాణ మండపం మంచి ఓపెనింగ్స్‌ని రాబట్టింది. మిగతా చిత్రాలు పర్వాలేదనిపించాయి. ఆశించిన స్థాయిలో కలెక్షన్లు వస్తుండడంతో నిర్మాతలు పోటీపడి మరీ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈ శుక్రవారం(ఆగస్ట్ 13) అయితే ఏకంగా తొమ్మిది సినిమాలు విడుదల అవుతున్నాయి. వాటిలో సుందరి, బ్రాందీ డైరీస్, సలాం నమస్తే, చైతన్య, రావే నా చెలియా, ఒరేయ్ బామర్ది, ది కంజూరింగ్ 3 ఉన్నాయి. శనివారం(ఆగస్ట్ 14) విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న పాగల్ సినిమా విడుదలవుతోంది. ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రైతన్న సినిమా కూడా శనివారమే వస్తోంది. రెండు రోజుల వ్యవధిలో ఏకంగా తొమ్మిది సినిమాలు విడుదల అవుతుండడంతో బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. మరి ఈ వారం బాక్సాఫీస్ బరిలో ఎవరు నిలుస్తారో చూడాలి. -
‘పాగల్’స్టోరీ రివీల్ చేసిన విశ్వక్ సేన్.. అమ్మ సెంటిమెంట్ అదుర్స్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పాగల్’.నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. విశ్వక్సేన్కు జోడీగా . నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తుంది. భూమిక, సిమ్రన్ చౌదరి, మేఘాలేఖ, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘పాగల్’స్టోరీ ఏంటో చెప్పేశాడు. ‘ఈ సినిమా కథ మీకు చెప్తా.. ప్రేమ్ అనే బాలుడికి తన తల్లి తప్ప వేరే వాళ్లు ఎవరూ ఉండరు. ఆమే వాడికి అన్నీ. ఒకరోజు వాడు రాత్రి మొత్తం మేల్కొని అమ్మ పెయింటింగ్ వేస్తాడు. ‘ఎందుకు నాన్నా రాత్రి మొత్తం నా బొమ్మనే వేస్తూ ఉన్నావ్’ అని ఆ తల్లి అడిగితే.. ‘నీ అంత బాగా నన్ను ఎవరూ చూసుకోరు కదమ్మా’ అని అంటాడు. కానీ ఆ తల్లికి తెలుసు.. మరో రెండునెలల్లో ఆమె చనిపోతున్నట్టు. అందుకే ఆమె ఆ కొడుకుతో చెప్తుందీ.. మనం ఎవర్ని ప్రేమించినా తిరిగి ప్రేమిస్తారు.. నువ్ అన్ కండిషనల్‌గా ప్రేమించు అని చెప్తుంది. అలా చెప్పిన కొన్నిరోజుల తరువాత ఆ తల్లి చనిపోతుంది. అప్పుడు వాడు ఒంటరి వాడు అవుతాడు. తల్లి ఉండదు. ఆ టైంలో వాడికి తన తల్లి చెప్పింది మాత్రమే గుర్తుకువస్తుంది. నువ్ అందర్నీ ప్రేమించు.. ఎక్కడో చోట నేను దొరుకుతా అని చెప్పిన మాటను గుర్తించుకుని వాడు.. తన తల్లి ప్రేమను వెతుక్కుంటూ మొదలుపెట్టిన జర్నీనే ఈ పాగల్. ఆ తరువాత ఏం జరిగింది అనేదే ఈ సినిమా’అని విశ్వక్ సేన్ చెప్పాడు. -
Paagal Teaser: 1600 మంది అమ్మాయిలని ప్రేమించా..
ఫలక్ నుమా దాస్, హిట్ లాంటి సినిమాల తర్వాత విశ్వక్ సేన్ టాలీవుడ్లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా ఈ కుర్ర హీరో నటించిన పాగల్ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ మంగళవారం విడుదల చేసింది. లవ్ డ్రామా కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్గా సాగింది. ఇందులో కనిపించిన ప్రతీ అమ్మాయిని ప్రేమించే పాగల్ ప్రేమికుడిగా కనిపించబోతున్నాడు విశ్వక్ సేన్. అలా లవ్ స్టోరీస్ కంటిన్యూ చేస్తున్న మన హీరో చివరికి ఒక్క అమ్మాయితో (నివేథా పేతురాజ్) సీరియస్‌గా ప్రేమలో పడతాడు. ఆ తర్వాత సినిమా ఏంటని తెరపై చూడాల్సిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడం తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ‘పాగల్’ సినిమా పై అంచనాలు పెరిగాయనే చెప్పాలి. నరేష్ కుప్పలి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తైన కరోనా కారణంగా వాయిదా పడుతూ ఎట్టికేలకు విడుదలకు సిద్ధం అయ్యింది. దిల్ రాజు సమర్పిస్తున్న ఈ సినిమాను బెక్కం వేణుగోపాల్ నిర్మించగా, రథన్ సంగీతం సమకూర్చారు. ఆగస్ట్ 14న ‘పాగల్’ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. -
ఎర్రగులాబీతో వచ్చేస్తున్న హీరో విశ్వక్సేన్
టాలెంటెడ్ యంగ్ హీరో విష్వక్సేన్కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎంపిక చేసుకునే చిత్రాలు యూత్ ఆడియెన్స్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఈ యంగ్ హీరో తాజాగా నటించిన చిత్రం పాగల్. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా రద్దయ్యింది. ప్రస్తుతం థియేటర్లు తిరిగి తెరుచుకోవడంతో ఆగస్టు14న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్గా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో విశ్వక్ సేన్ ఎర్ర గులాబీని పట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. కాగా నరేశ్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వక్సేన్కు జోడీగా . నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తుంది. రధన్ సంగీతం అందిస్తుండగా ఎస్.మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. -
న్యూ లవ్‌లో Freshగా పడ్డానంటున్న విశ్వక్సేన్
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘పాగల్’. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి ‘‘ఈ సింగిల్ చిన్నోడే.. న్యూ లవ్వులో ఫ్రెష్షుగా పడ్డాడే.. సిగ్నల్ గ్రీనే చూశాడే.. పరుగులు పెట్టాడే..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటని రధన్ స్వరపరచగా బెన్నీ దయాల్ పాడారు. కృష్ణ కాంత్ సాహిత్యం అందించారు. ‘‘మ్యూజికల్ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న చిత్రమిది. హీరో ప్రతిసారీ వేర్వేరు అమ్మాయిలతో ప్రేమలో పడడం.. ఆ ప్రేమలో ఉన్న తాజాదనాన్ని అనుభవించే సందర్భంలో వచ్చే పాట ఇది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. మణికందన్ , సంగీతం: రధన్ . -
ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అయిన తెలుగు సినిమాలివే!
గతేడాది కరోనా ప్రభావం చిత్ర పరిశ్రమను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆ ఎఫెక్ట్ నుంచి ఈ ఏడాది మొదట్లో కాస్త కోలుకుంటున్నట్లు అనుకునేలోపే మళ్లీ సెకండ్ వేవ్ విజృంభించింది. దీంతో రిలీజ్ డేట్ కూడా ప్రకటించిన చాలా సినిమాలు వెనక్కి తగ్గాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలవుతుండటంతో థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియని సందిగ్ధత ఏర్పడింది. దీంతో నిర్మాతలు కూడా ఇప్పుడు ఓటీటీకే జై కొడుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు సైతం త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. అవేంటో చూసేద్దాం.. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన మలయాళ రీమేక్ సినిమా దృశ్యం 2 షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫే తెలుగు ‘దృశ్యం 2’కు కూడా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ కి అమ్మేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందే ఈ సినిమాను ఓటీటీలో చేయాలని భావించినా నిర్మాత సురేశ్ బాబు వాటిని ఖండించారు. అయితే తాజాగా సినిమాల విడుదలకు ఆలస్యం అవుతుండటంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ ద్వారా 'దృశ్యం 2' సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అభిప్రాయపడుతున్నారట. ఈ విషయంలో వెంకటేష్ కూడా సముఖత వ్యక్తం చేశారని, 'దృశ్యం 2'ను ఓటీటీలో రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పినట్లు ఇండస్ర్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. బాలీవుడ్ సూపర్‌హిట్ ‘అంధాదున్’కి రీమేక్ ఇది. నటా నటేశ్ హీరోయిన్గా నటిస్తోండగా తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను జూన్ 11న విడుదల చేయాలని బావించినా కరోనా కారణంగా బ్రేక్ పడింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని బావిస్తున్నారట. ఇందుకు సంబంధించి నిర్మాతలు ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థతో డీల్ మాట్లాడినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన తాజా చిత్రం `పాగల్`.నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇక జూన్‌లో ఈ మూవీని థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని భావించినా ప్రస్తుతం అందుకు తగ్గ పరిస్థితులు లేవు. లాక్డౌన్ కారణంగా ఈ మూవీ రిలీజ్‌కు బ్రేక్ పడింది. దీంతో ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌తో డీల్ మాట్లాడినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. చదవండి : ప్రియాంకకు షారుఖ్ కిస్: విడాకులిస్తానని భార్య బెదిరింపులు! Prabhas-Nag Ashwin Movie: రెమ్యునరేషనే రూ.200 కోట్లట! -
నీ మీద ఒట్టు, చచ్చిపోతా: విశ్వక్సేన్కు బెదిరింపులు
మాస్ కా దాస్ విశ్వక్సేన్ దర్శకుడిగా, నటుడిగా తనేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం పాగల్ సినిమాతో లవర్‌బాయ్‌గా నటిస్తున్నాడీ కుర్ర హీరో. పాగల్ టీజర్ కూడా యూత్‌కు విపరీతంగా నచ్చేసింది. అందులో విశ్వక్సేన్ పాత్రకు అప్పుడే కనెక్ట్ అయిపోయారు. తాజాగా ఈ యంగ్ హీరో అభిమానులతో చిట్‌చాట్ చేశాడు. ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చాడు. సమాధానాలివ్వడం లేదని కొంతమంది అలగడంతో వారికి కూడా ఆన్సరిస్తున్నాడు. ఈ సందర్భంగా తన క్రష్ పేరును బయటపెట్టేశాడు విశ్వక్. చిన్నప్పుడే కాదు, ఇప్పటికీ తన క్రష్ ఇలియానా అని పేర్కొన్నాడు. పని కోసం పరితపిస్తూ నిద్రలేని రాత్రిళ్లు గడిపానని, కానీ పనితో పాటు మంచి నిద్ర కూడా అవసరమని తెలుసుకున్నానన్నాడు. తన ఫేవరెట్ పబ్ తన ఇంటి టెర్రస్ అని, ఇంటర్లో దమ్కీలు ఇచ్చేవాడిని అని చెప్పాడు. పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు సంబంధాలు ఉంటే చెప్పమని కొంటెగా బదులిచ్చాడు. మీ నంబర్ ఇవ్వొచ్చుగా అన్నదానికి తప్పకుండా ఇస్తానంటూ.. ఇంతకీ షర్ట్దా? జీన్స్దా? ఈ రెండింటిలో ఏది గిఫ్ట్ ఇవ్వబోతున్నావు? అని తిరిగి ప్రశ్నించాడు. నా మనసులో ఉంటున్నందుకు 10 వేల రూపాయలు పంపించు అన్న నెటిజన్‌కు అద్దె చాలా తక్కువగా ఉంది అని నవ్వేశాడు. 'అన్నా నువ్వు రిప్లై ఇవ్వకపోతే సూసైడ్ చేస్కుంటా, నీ మీద ఒట్టు' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీంతో ఖంగు తిన్న విశ్వక్ ఏం మాట్లాడుతున్నావ్ బ్రో అని షాకయ్యాడు. మీరు ఎక్కడుంటారు? అని అడ్రస్ కూపీ లాగిన నెటిజన్‌కు మీ గుండెలో ఉంటున్నా అంటూ అదిరిపోయే ఆన్సరిచ్చాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుదంటూ ఓ మహిళా అభిమాని మనసులో కోరికను బయటపెట్టడంతో ఆశ్చర్యపోయాడీ హీరో. పనిలో పనిగా తన సినిమా అప్డేట్లు కూడా ఇచ్చేశాడు. పాగల్ సినిమా టైటిల్ కన్నా ఓ రేంజ్లో ఉండబోతుంది అన్నాడు. కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తామనేది కరోనా తీవ్రతను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. కపేలా రీమేక్ చేయడం లేదని, ఓ మై కడవులే రీమేక్‌లో నటిస్తున్నానని, దీనికి సంబంధించిన 30 శాతం షూటింగ్ కూడా పూర్తైందని స్పష్టం చేశాడు. చదవండి: అందుకే 7 ఏళ్ల రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెప్పా: త్రిశాలా -
మళ్లీ నిరూపించుకోవాలి!
‘‘సినిమా పరిశ్రమలో లాక్డౌన్ తర్వాత మార్పు వచ్చింది. మరో కొత్త అధ్యాయం మొదలైనట్లుంది. గత చిత్రాలతో సంబంధం లేకుండా మళ్లీ యాక్టర్స్‌గా నిరూపించుకోవాల్సి వస్తోంది’’ అని అన్నారు విశ్వక్ సేన్ . నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ‘దిల్’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న సినిమా ‘పాగల్’. ఏప్రిల్ 30న ఈ సినిమా విడుదల కానుంది. నేడు విశ్వక్సేన్ బర్త్ డే. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేశాను. ‘పాగల్’ సినిమా కూడా ఓ కొత్త ప్రయత్నం. ప్రేమించేప్పుడు కొందరు పిచ్చోడిలా ఆలోచిస్తుంటారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ అలానే ఉంటుంది. అందుకే ఈ టైటిల్ పెట్టాం. మా సినిమా టీజర్లో ఎంటర్టైన్ మెంట్ మాత్రమే చూపించాం... సినిమాలో ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇవాళ్టితో ‘పాగల్’ సినిమా షూటింగ్ పూర్తయింది. నా బర్త్ డే రోజు కూడా షూటింగ్లో పాల్గొనడం హ్యాపీగా ఉంది. నరేష్ బాగా డైరెక్ట్ చేశారు. నేను చేస్తున్న ‘ప్రాజెక్ట్ గామీ’ సినిమా పూర్తయింది. నిర్మాతలు పీవీపీ, బీవీఎస్ఎన్ ప్రసాద్గార్లతో వర్క్ చేయబోతున్నాను. ఈ ఏడాది నావి మూడు సినిమాలు రిలీజవుతాయి’’ అని అన్నారు. -
పాగల్ కోసం మూడో హీరోయిన్!
విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘పాగల్’. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు సమర్పిస్తున్నారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ప్రేమ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి, మేఘలేఖ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. తాజాగా మరో నాయికగా నివేదా పేతురాజ్ పేరును అనౌన్స్ చేశారు. తీర అనే పాత్రను నివేదా పోషిస్తున్నట్లు గురువారం ఓ పోస్టర్ ద్వారా చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, టైటిల్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదల చేసిన విశ్వక్–నివేద లుక్ వైరల్ అయ్యింది. మే 1న ‘పాగల్’ సినిమా విడుదలవుతుంది’’ అన్నారు. రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్. మణికందన్, సంగీతం: రధన్. చదవండి: డాక్టర్ రవి శంకర్ నక్సలైట్ రవన్నగా ఎలా మారాడు? -
టీజర్: హీరో నిజంగా పిచ్చోడే!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం "పాగల్". పాగల్ అంటే పిచ్చి. గురువారం ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఇందులో హీరోకు నిజంగానే పిచ్చి ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ అది ప్రేమ పిచ్చి. నచ్చిన అమ్మాయి సంతోషంగా ఉండేందుకు తనను తాను కష్టపెట్టుకునేంత పిచ్చి. రౌడీలు తల మీద సీసాలు పగలగొడుతుంటే ఎదిరించి వారిని తరిమికొట్టాల్సింది పోయి లవర్ ఫేస్‌లో హ్యాపీనెస్ కనిపించట్లేదు, ఇంకా వైల్డ్‌గా కొట్టండని రెచ్చగొడుతున్నాడు. ఫలితంగా వాళ్లు చితకబాదగా అతడి శరీరం రక్తంతో తడిసిపోయింది. అప్పుడు మనోడు హీరోయిజం చూపిస్తూ వారిని చితక్కొట్టాడు. ఈ సినిమాలో హ్యాండ్సమ్గా కనిపిస్తున్న విశ్వక్ సేన్ ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్‌తో అదరహో అనిపించాడు. తన ప్రతి సినిమాకు నటనా నైపుణ్యాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. ఈ టీజర్ చూసిన నెటిజన్లు బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రేమ పిచ్చి అంత ఈజీగా తగ్గేది కాదని, ప్రేమలో పడితే హీరో కూడా పిచ్చోడే అవుతాడని కుర్రకారు హీరోలో తమను తాము చూసుకుంటున్నారు. నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. రధన్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 30న సినిమా విడుదల కానుంది. చదవండి: కామెడీ సినిమాలో నరేశ్ బాగా చేశాడని అనేవారు నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: శృతి నటుడి ఆత్మహత్య: భార్య, అత్తపై ఎఫ్ఐఆర్