మాస్ కా దాస్, యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘పాగల్’. ఈ మూవీలో విశ్వక్ లవర్‌బాయ్‌గా అలరించనున్నాడు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ అగష్టు 14న థియేటర్లల్లో వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో నేడు పాగల్ ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కరోనాతో మూత పడిన థియేటర్లను పాగల్‌తో ఓపెన్ అయ్యేలా చేస్తానని, అలా జరగకపోతే పేరు మార్చుకుంటా అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి.
ఈ సందర్భంగా విశ్వక్ ‘ఇప్పుడే సినిమా ఫైనల్ కాపీ చూశా. బొమ్మ అదిరిపోయింది. నన్ను డైరెక్టర్ నరేశ్ పిలిచి ‘పాగల్’ కథ వివరించాడు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని అప్పడే అనిపించింది. మా టీం అద్భుతంగా వర్క్ చేసింది. వారందరికి ధన్యవాదాలు. శనివారం నాడు పబ్బులు, బార్లలోనే కాదు నా సినిమా ఆడే థియేటర్లలో కూడా పార్టీలు జరుగుతాయి. పూర్తిగా థియేటర్లు తెరుచుకోకముందే ఇప్పుడేందుకు ‘పాగల్’ విడుదల చేస్తున్నారని అడిగిన వారందరికి నేను చెప్పేది ఒక్కటే.
సర్కస్‌లో సింహంతో ఎవరైనా ఆడుకుంటారు. నేను అడవి కొచ్చి ఆడుకునే టైప్. ఈ సినిమాతో మూసుకున్న థియేటర్లు కూడా ఓపెన్ అయ్యేలా చేస్తా. గుర్తుపెట్టుకోండి. నా పేరు విశ్వక్ సేన్.. నేను చెప్పింది జరగకపోతే నా పేరు మార్చుకుంటా’ అని అన్నాడు. ఇక హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి చెబుతూ.. ఏ ఇంటర్వ్యూలోనైనా తను ఇలియాన ఫ్యాన్ అని చెప్పుకున్నానని, కానీ ఇప్పటి నుంచి తాను నివేదా పేతురాజ్ అభిమానిని అన్నాడు. నమ్మండి మీరు కూడా ఆమెకు ఫ్యాన్స్ అయిపోతారని, ఈ సినిమాలో ఆమె చాలా బాగా చేసిందంటూ విశ్వక్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment