
నరేశ్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘పాగల్’. ‘దిల్’ రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం అగష్టు 14న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో విశ్వక్ ప్రేక్షకులకు, అభిమానులకు, సినీ విమర్శకులకు ఓ సందేశం ఇచ్చాడు. సోమవారం ఉదయం విశ్వక్ తన ప్రకటనలో ప్రేక్షకులను బ్యాగ్రౌండ్‌లేకుండా వచ్చిన తనకు అండ.. దండ మీరు అని పేర్కొన్నాడు.
అంతేగాక.. ‘నేను మీ విశ్వక్ సేన్. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతదూరం వచ్చిన నన్ను.. ‘పాగన్’ సినిమాను ఆదరిస్తారనీ.. సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ తెరిచిన సినిమా థియేటర్లను నిలబెడతారని కోరుకుంటున్నాను. మా ప్రయత్నంలో మీకు ఏదైనా చిన్న లోపం అనిపిస్తే.. విమర్శించండి. కానీ, దయచేసి దాడి చేయకండి. తట్టుకునే శక్తి.. ఉన్నా లేకపోయినా.. ఎన్నో వేలమందికి ఉపాధి కలిగించే.. సినిమా థియేటర్స్‌ను కాపాడండి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన నాకు మీరే అండ.. దండ..’ అని పేర్కొన్నాడు.
కాగా ఇటీవల జరిగిన పాగల్ ప్రిరిలీజ్ వేడుకలో విశ్వక్ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కరోనాతో మూత పడిన థియేటర్లను పాగల్‌తో ఓపెన్ అయ్యేలా చేస్తానని, అలా జరగకపోతే పేరు మార్చుకుంటా అంటూ అతడు చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఇక సినిమా విడుదలైన అనంతరం ‘పాగల్’ మూవీ విజయంపై తనకు నమ్మకం ఉందని, ప్రీ రిలీజ్ వేడుకలో తను మాట్లాడిన ఏ మాటను కూడా వెనక్కి తీసుకోవడం లేదన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment