ఫలక్ నుమా దాస్, హిట్ లాంటి సినిమాల తర్వాత విశ్వక్ సేన్ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా ఈ కుర్ర హీరో నటించిన పాగల్ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ మంగళవారం విడుదల చేసింది. లవ్ డ్రామా కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఇందులో కనిపించిన ప్రతీ అమ్మాయిని ప్రేమించే పాగల్ ప్రేమికుడిగా కనిపించబోతున్నాడు విశ్వక్ సేన్.
అలా లవ్ స్టోరీస్ కంటిన్యూ చేస్తున్న మన హీరో చివరికి ఒక్క అమ్మాయితో (నివేథా పేతురాజ్) సీరియస్‌గా ప్రేమలో పడతాడు. ఆ తర్వాత సినిమా ఏంటని తెరపై చూడాల్సిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడం తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ‘పాగల్’ సినిమా పై అంచనాలు పెరిగాయనే చెప్పాలి.
నరేష్ కుప్పలి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తైన కరోనా కారణంగా వాయిదా పడుతూ ఎట్టికేలకు విడుదలకు సిద్ధం అయ్యింది. దిల్ రాజు సమర్పిస్తున్న ఈ సినిమాను బెక్కం వేణుగోపాల్ నిర్మించగా, రథన్ సంగీతం సమకూర్చారు. ఆగస్ట్ 14న ‘పాగల్’ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment