మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ దర్శకుడిగా, నటుడిగా తనేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం పాగల్ సినిమాతో లవర్‌బాయ్‌గా నటిస్తున్నాడీ కుర్ర హీరో. పాగల్ టీజర్ కూడా యూత్‌కు విపరీతంగా నచ్చేసింది. అందులో విశ్వక్‌సేన్ పాత్రకు అప్పుడే కనెక్ట్ అయిపోయారు. తాజాగా ఈ యంగ్ హీరో అభిమానులతో చిట్‌చాట్ చేశాడు. ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చాడు. సమాధానాలివ్వడం లేదని కొంతమంది అలగడంతో వారికి కూడా ఆన్సరిస్తున్నాడు.
ఈ సందర్భంగా తన క్రష్ పేరును బయటపెట్టేశాడు విశ్వక్. చిన్నప్పుడే కాదు, ఇప్పటికీ తన క్రష్ ఇలియానా అని పేర్కొన్నాడు. పని కోసం పరితపిస్తూ నిద్రలేని రాత్రిళ్లు గడిపానని, కానీ పనితో పాటు మంచి నిద్ర కూడా అవసరమని తెలుసుకున్నానన్నాడు. తన ఫేవరెట్ పబ్ తన ఇంటి టెర్రస్ అని, ఇంటర్‌లో దమ్కీలు ఇచ్చేవాడిని అని చెప్పాడు. పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు సంబంధాలు ఉంటే చెప్పమని కొంటెగా బదులిచ్చాడు. మీ నంబర్ ఇవ్వొచ్చుగా అన్నదానికి తప్పకుండా ఇస్తానంటూ.. ఇంతకీ షర్ట్‌దా? జీన్స్‌దా? ఈ రెండింటిలో ఏది గిఫ్ట్ ఇవ్వబోతున్నావు? అని తిరిగి ప్రశ్నించాడు. నా మనసులో ఉంటున్నందుకు 10 వేల రూపాయలు పంపించు అన్న నెటిజన్‌కు అద్దె చాలా తక్కువగా ఉంది అని నవ్వేశాడు.
'అన్నా నువ్వు రిప్లై ఇవ్వకపోతే సూసైడ్ చేస్కుంటా, నీ మీద ఒట్టు' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీంతో ఖంగు తిన్న విశ్వక్ ఏం మాట్లాడుతున్నావ్ బ్రో అని షాకయ్యాడు. మీరు ఎక్కడుంటారు? అని అడ్రస్ కూపీ లాగిన నెటిజన్‌కు మీ గుండెలో ఉంటున్నా అంటూ అదిరిపోయే ఆన్సరిచ్చాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుదంటూ ఓ మహిళా అభిమాని మనసులో కోరికను బయటపెట్టడంతో ఆశ్చర్యపోయాడీ హీరో.
పనిలో పనిగా తన సినిమా అప్‌డేట్‌లు కూడా ఇచ్చేశాడు. పాగల్ సినిమా టైటిల్ కన్నా ఓ రేంజ్‌లో ఉండబోతుంది అన్నాడు. కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తామనేది కరోనా తీవ్రతను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. కపేలా రీమేక్ చేయడం లేదని, ఓ మై కడవులే రీమేక్‌లో నటిస్తున్నానని, దీనికి సంబంధించిన 30 శాతం షూటింగ్ కూడా పూర్తైందని స్పష్టం చేశాడు.
చదవండి: అందుకే 7 ఏళ్ల రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెప్పా: త్రిశాలా
Comments
Please login to add a commentAdd a comment