విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్
విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘పాగల్’. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు సమర్పిస్తున్నారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ప్రేమ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి, మేఘలేఖ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. తాజాగా మరో నాయికగా నివేదా పేతురాజ్ పేరును అనౌన్స్ చేశారు.
తీర అనే పాత్రను నివేదా పోషిస్తున్నట్లు గురువారం ఓ పోస్టర్ ద్వారా చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, టైటిల్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదల చేసిన విశ్వక్–నివేద లుక్ వైరల్ అయ్యింది. మే 1న ‘పాగల్’ సినిమా విడుదలవుతుంది’’ అన్నారు. రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్. మణికందన్, సంగీతం: రధన్.
Comments
Please login to add a commentAdd a comment