టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వైవిద్యమైన సినిమాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. వెళ్లి పోమాకే సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన విశ్వక్ సేన్.. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నామ దాస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల పాగల్‌తో ప్రేక్షకులను పలకరించాడు. ఆయన హీరోగా నటించిన మరోచిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ విడుదలకు సిద్దంగా ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేశాడు ఈ మాస్ హీరో. ఈ చిత్రానికి ‘దాస్ కా ధమ్కీ’అనే మాస్ టైటిల్ ని ఫిక్స్ చెశారు. ఈ మూవీకి నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహిస్తుండగా, ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. వణ్మయి క్రియేషన్స్ మరియు విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేతా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment