‘‘నేను ఇప్పటి వరకు నిర్మించిన సినిమాలేవీ నాకు చేదు అనుభవాన్ని ఇవ్వలేదు. అయితే కొన్నిసార్లు ఫలితం ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు. హిట్ అయినా ఫ్లాప్ అయినా నా మనసులో సినిమా తప్ప మరో ఆలోచన లేదు.. ఎందుకంటే నాకు తెలిసింది సినిమానే’’ అని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ అన్నారు. నేడు(బుధవారం) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ–‘‘లక్కీ మీడియా పతాకంపై నా మిత్రుడు శివాజీతో 2006లో ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ సినిమా తీశా. నిర్మాతగా అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఇన్నేళ్ల ప్రయాణంలో నాకు సహకరించిన అందరికీ థ్యాంక్స్. ‘పాగల్’ కరోనా టైంలో విడుదల కావడం వల్ల కలెక్షన్లు తగ్గాయి కానీ, నష్టాలు మాత్రం రాలేదు. శ్రీవిష్ణుతో గతంలో ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమా చేశాను.
ప్రస్తుతం తనతో నిర్మిస్తున్న ‘అల్లూరి’ సినిమా చివరి షెడ్యూల్ వైజాగ్‌లో జరుగుతోంది. ఈ సినిమా నా కెరీర్‌కి బలమైన టర్నింగ్ పాయింట్ అవుతుంది. జూన్ లేదా జూలైలో ఈ సినిమా రిలీజ్ ఉంటుంది. ‘బిగ్‌బాస్’ ఫేమ్ సోహైల్ హీరోగా ‘బూట్‌కట్ బాలరాజు’ చిత్రం ప్రారంభించాం. ఆదిసాయికుమార్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాను. అలాగే మీడియా నేపథ్యంలో ఓ సినిమా చేయాలనుంది. డైరెక్టర్ అనేది పెద్ద బాధ్యత. నేనెప్పుడూ మెగాఫోన్ పట్టను. ‘ఓటీటీ’ అన్నది నిర్మాతలకు కొత్త ఆదాయ వనరులను తీసుకొచ్చింది. ఈ ఏడాది మా బ్యానర్ నుంచి మూడు సినిమాలు విడుదలవుతాయి’’ అన్నారు.
చదవండి: పెళ్లి చేసుకున్న టీవీ నటి రష్మీ, ఫొటోలు వైరల్
దూరంగా ఉంటానన్న సింగర్, కానీ డబ్బుల కోసం మళ్లీ మొదలుపెట్టింది!
Comments
Please login to add a commentAdd a comment