
‘‘ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. మంచి కంటెంట్ ఉంటనే సినిమా చూడటానికి థియేటర్స్‌కు వస్తున్నారు’’ అని దర్శకుడు హర్ష కొనుగంటి అన్నారు. తేజస్ కంచర్ల, దక్షా, ప్రియా వడ్లమాని, రమ్య, తేజ్, అభినవ్, దినేష్ ముఖ్యతారలుగా ‘హుషారు’ అనే చిత్రం రిలీజైన సంగతి తెలిసిందే. బెక్కెం వేణుగోపాల్ నిర్మాత. ఇందులో రాహుల్ రామకృష్ణ కీలక పాత్ర చేశారు. వచ్చే నెల 1కి ఈ సినిమా 50రోజులు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు హర్ష మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా నా సినిమా 50 రోజుల పూర్తి చేసుకోబోతుండటం చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా ఈ శుక్రవారం ఓ వేడుక నిర్వహించాలనుకుంటున్నాం.
ఈ సినిమాను స్టార్ట్ చేసిన తర్వాత సరిగ్గా ఆడదని చాలామంది నాతో అన్నారు. అయినప్పటికీ నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. నటీనటులందరూ బాగా నటించారు. రథన్ మంచి మ్యాజిక్ ఇచ్చారు. ఎవరైతే ఈ సినిమా ఆడదు అన్నారో రిజల్ట్ వచ్చిన తర్వాత వారే శుభాకాంక్షలు చెప్పారు. మా టార్గెట్ ఆడియన్స్ యూత్ అనుకున్నాం. వాళ్లు మళ్లీ మళ్లీ మా సినిమాను చూశారు. ఇందులో ‘ఉండిపోరాదే’ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ పాట బాగుందని అల్లు అర్జున్‌గారు ట్వీట్ చేయడం హ్యాపీ. ఈ సినిమా తమిళం, హిందీలో రీమేక్ కాబోతుంది. నేను డైరెక్ట్ చేయడం లేదు. నా నెక్ట్స్ మూవీ కోసం రెండు సబ్జెక్ట్స్‌ను అనుకుంటున్నాను. ఇందులో ఒక యూత్‌ఫుల్ మూవీ ఉంది. విజయ్ దేవరకొండకు వినిపించాలనుకుంటున్నాను’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment