అవకాశం ఇస్తే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి సినిమా చేస్తా : డైరెక్టర్‌ విక్రమ్‌ రెడ్డి | Director Vikram Reddy Talks About Roti Kapada Romance | Sakshi
Sakshi News home page

రాజమౌళికి స్టూడెంట్‌ నెం.1 అయితే..నాకు రోటీ కపడా రొమాన్స్‌: డైరెక్టర్‌ విక్రమ్‌ రెడ్డి

Published Tue, Nov 26 2024 5:07 PM | Last Updated on Tue, Nov 26 2024 5:18 PM

Director Vikram Reddy Talks About Roti Kapada Romance

ఏ డైరెక్టర్‌ అయినా తొలిసారే బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి అద్భుతాలు సృష్టించడు. అంత గొప్ప సినిమాలు తీసిన రాజమౌళి కూడా ఫస్ట్‌టైం స్టూడెంట్‌ నెం.1 లాంటి చిన్న సినిమాతో తన జర్నీ స్టార్ట్‌ చేశాడు. రాజమౌళికి స్టూడెంట్‌ నెం.1 సినిమా ఎలానే నాకు రోటీ కపడా రొమాన్స్‌ చిత్రం కూడా అంతే. ఆయనకు ఇచ్చినట్లే నాకు స్పెస్‌ ఇస్తే.. భవిష్యత్తులో ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి సినిమా తీస్తా. అలాంటి గొప్ప కథలు నా దగ్గర ఉన్నాయి. కానీ తొలి చిత్ర దర్శకుడిని నిలబడే ఛాన్స్‌ ఇవ్వండి.. చిన్న సినిమాలకు స్పేస్‌ ఇవ్వండి’ అని కోరారు దర్శకుడు విక్రమ్‌ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘రోటి కపడా రొమాన్స్‌’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించారు. బెక్కెం వేణుగోపాల్‌, సృజన్‌ కుమార్ బొజ్జం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విక్రమ్‌ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. నేను సినీ రంగంలోకి రావడానికి కారణం మా అమ్మ. ఆమె నాకు ఇన్‌స్పిరేషన్‌. ప్రతి శుక్రవారం విడుదలైన ప్రతి సినిమా తన లేడీ గ్యాంగ్‌తో కలిసి చూసేది. అమ్మతో పాటు నేను కూడా వెళ్లేవాడిని. అలా నాకు తెలియకుండానే సినిమాపై ఇష్టం ఏర్పడింది. ఇక ఎలాగైనా సినిమా రంగంలోకి వెళ్లాలని ఫిక్స్‌ అయ్యాను. అయితే దర్శకుడు తేజ 'చిత్రం' సినిమా పోస్టర్‌పై ఆయన పేరు చూసిన తరువాత దర్శకుడిని అవ్వాలని నిర్ణయించుకున్నాను.

ఎవరి దగ్గరనైనా అసిస్టెంట్‌ దర్శకుడిగా జాయిన్‌ కావాలని అనుకుని ప్రయత్నించాను కానీ కుదరలేదు. కానీ పూరి జగన్నాథ్‌ ఇచ్చిన సలహాతో అసిస్టెంట్‌గా చేరాలనే ప్రయత్నాన్ని విరమించుకుని.. సినిమాలు చూడటం మొదలుపెట్టి.. సినిమాలు చూడటమే పనిగా అనుకుని సినిమాలోని అన్ని క్రాఫ్ట్‌లపై గ్రిప్‌ వచ్చిన తరువాత దర్శకత్వ ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఆ తరుణంలో నేను చెప్పిన కథ బెక్కం వేణుగోపాల్‌కు నచ్చి ఈ రోజు దర్శకుడిగా మీ ముందు ఉన్నాను.

రొటీ కపడా రొమాన్స్‌ ఒక యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌, కామెడీ, ఫ్రెండ్‌షిప్‌ నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఈ సినిమాలో  నాలుగు ప్రేమకథలు ఉంటాయి. నలుగురు అబ్బాయిల లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు వచ్చిన తరువాత వాళ్ల జీవితం ఎలా మారిపోయింది? లవ్‌ బ్రేకప్‌ తరువాత వాళ్ల రియలైజేషన్‌ ఏమిటి అనేది సినిమా.  అన్ని ఎమోషన్స్‌ మిక్స్‌ అయిన పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. సినిమాలోని పతాక సన్నివేశాలు పదిహేను నిమిషాలు అందరి హృదయాలకు హత్తుకుంటాయి. అందరూ ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతారు.

ఫస్ట్‌ ఈ సినిమా దిల్‌ రాజు చేద్దామని అనుకున్నారు. అయితే ఆయన కథలో  మార్పులు చేయమని అడిగారు. ఆ మార్పుల వల్ల నా  కథకు చాలా ఎఫెక్ట్‌ అవుతుంది. అందుకే ఒప్పుకోలేదు. ఇక ఆ తరువాత కూడా కథలో నేను ఎలాంటి మార్పులు చేయలేదు.నా కథకు నేనే క్రిటిక్‌ని . కథపై నాకున్న నమ్మకం అలాంటిది. ఈ విషయాన్ని రాజు గారు కూడా స్వాగతించారు. అంతే కాదు నా చిత్రానికి 'రోటి కపడా రొమాన్స్‌ అనే  టైటిల్‌ కూడా దిల్‌ రాజు ఇచ్చారు.

ఈ సినిమాకు సంబంధించి నాకళ్ల ముందు చూసినవి.. నా ఫ్రెండ్ష్‌ లైఫ్‌లో జరిగిన ఇన్‌సిండెంట్స్‌ ఇన్‌స్పిరేషన్‌.. ఇందులో వున్న  నాలుగు విభిన్న ప్రేమకథలు చేయడం చాలా  కష్టం ఇలాంటి సినిమాలు చేసినప్పుడే దర్శకుడి ప్రతిభ బయటపడుతుంది. ఈ సినిమా ఆల్‌రెడీ చూసిన వాళ్లంతా ఓ కొత్త దర్శకుడిలా సినిమా తీయలేదు అని అభినందించారు.

ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్‌ ఇచ్చారు. సినిమా చాలా నేచురల్‌గా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ఉన్నది ఉన్నట్లుగా ఉంటాయి. అప్పుడే సినిమాకు  ఆ వైబ్‌ ఉంటుంది ఈ సినిమాలో రొమాన్ష్ శృతి మించి ఉండదు. ఈ సినిమా ఎక్స్‌ పీరియన్స్‌ చేసిన తరువాత మీకు మంచి కిక్‌ వస్తుంది.

 


ఈ సినిమా ఒక్కరైనా బాగా లేదు అంటే నేను సినిమాలకు రిటైర్‌మెంట్‌ ఇస్తాను.  ఈ సినిమా నా బేబి.. లాంటింది ఈ సినిమాపై నాకున్న నమ్మకం అలాంటిది. పది మంది వచ్చి చూసి బాగాలేదు అంటే రిటైర్‌మెంట్‌ ఇస్తాను. నా సినిమాతో మల్లీప్లైక్‌ థియేటర్స్‌ అన్ని మాస్‌ థియేటర్లు అవుతాయి.

చిరంజీవి, రామ్‌చరణ్‌తో కలిసి ఓ మల్టీస్టారర్‌ సినిమా చేయాలి అది నా అల్టీమేట్‌ గోల్‌. దాని కోసం నేను కష్టపడతా. వాళ్లిద్దరి కోసం నా దగ్గర కథ కూడా రెడీగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement