
‘‘నిర్మాత బెక్కం వేణుగోపాల్‌గారు ఇప్పటివరకు తీసిన 14 సినిమాల ద్వారా ఎందరో దర్శకులను, రచయితలను, నటీనటులను పరిచయం చేశారు. ‘రోటి కపడా రొమాన్స్’’ చిత్రంతోనూ చాలా మంది కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నారు. ఆయన్ని చూస్తే ఎంతో స్ఫూర్తిగా ఉంటుంది. ఈ చిత్రం యూనిట్‌కి బ్రేక్ ఇవ్వాలి’’ అని హీరో తేజ సజ్జా అన్నారు. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి ముఖ్య తారలుగా విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’.
బెక్కం వేణుగోపాల్, సృజన్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కినుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా తేజ సజ్జా, అతిథులుగా దర్శకులు యదు వంశీ, పవన్ సాధినేని, హర్ష, రచయిత కోన వెంకట్, నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, చదలవాడ శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ‘‘నేటి తరం యువతకి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు విక్రమ్ రెడ్డి. ‘‘ప్రేమకథలో ఓ భిన్నమైన కోణాన్ని దర్శకుడు ఈ చిత్రంలో ఆవిష్కరించాడు’’ అన్నారు బెక్కం వేణుగోపాల్, సృజన్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment