ఆ సినిమా రోజులు గుర్తొస్తున్నాయి: విశ్వక్‌ సేన్‌ | Vishwak Sen Talks About Roti Kapada Romance | Sakshi
Sakshi News home page

ఆ సినిమా రోజులు గుర్తొస్తున్నాయి: విశ్వక్‌ సేన్‌

Published Wed, Jul 17 2024 9:58 AM | Last Updated on Wed, Jul 17 2024 10:36 AM

Vishwak Sen Talks About Roti Kapada Romance

హర్ష నర్రా, సందీప్‌ సరోజ్, తరుణ్, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్‌’. విక్రమ్‌ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్‌ కుమార్‌ బొజ్జం నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘గలీజ్‌..’ సాంగ్‌ రిలీజ్‌ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ– ‘‘రోటి కపడా రొమాన్స్‌’ టీమ్‌ను చూస్తుంటే నాకు మా ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా రోజులు గుర్తొస్తున్నాయి. నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌కు ప్రేమకథలపై మంచి జడ్జ్‌మెంట్‌ ఉంది. ఈ సినిమా విజయం సాధించి, మంచి వసూళ్లను రాబట్టాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

‘‘మంచి ఎమోషనల్‌ రైడ్‌ ఫిల్మ్‌ ఇది’’ అన్నారు విక్రమ్‌ రెడ్డి. ‘‘ఓ కొత్త పాయింట్‌ను యువతకు చె΄్పాలని ‘రోటి కపడా రొమాన్స్‌’లాంటి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీని తీశాం’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్‌. ‘‘ప్రేక్షకులందర్నీ అలరించే సినిమా ఇది’’ అన్నారు నిర్మాత సృజన్‌కుమార్‌. కృష్ణ కాంత్‌ లిరిక్స్‌ అందించిన ఈ ‘గలీజ్‌’ పాటను రాహుల్‌ సిప్లిగంజ్, పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ పాడారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement