నా కళ్లు చూసి హీరోయిన్‌గా అవకాశమిచ్చారు | Sai Dhanshika Debut Shikaru Release Date Locked | Sakshi
Sakshi News home page

షికారు రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!

Published Mon, Dec 13 2021 7:28 PM | Last Updated on Mon, Dec 13 2021 7:28 PM

Sai Dhanshika Debut Shikaru Release Date Locked - Sakshi

సాయి దన్సిక, తేజ్ కూర పాటి, అభినవ్ మేడిశెట్టి, కేవీ ధీరజ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం షికారు. హరి కొలగాని దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్న సందర్బంగా సోమవారం ఫిలిం ఛాంబర్‌లో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బాబ్జి మాట్లాడుతూ.. 'కరోనా ఇబ్బందులు దాటుకొని సినిమా పూర్తి చేశాం, షికారు టైటిల్ లాగానే సినిమా కూడా బాగా వచ్చింది. మా హీరోయిన్ ధన్సిక, నలుగురు యువ హీరోలు చాలా  బాగా చేశారు, సిద్ శ్రీ రామ్ పాడిన పాట బాగా వచ్చింది. ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ అవుతుంది, మా డైరెక్టర్ హరి గారు కధ చెప్పునప్పుడు  ఎంత  ఎక్సయిట్ అయ్యానో, సినిమా తీసిన విధానం చూసి అంతకు మించి ఎక్సయిట్ అయ్యాను. జనవరి 26న మా సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.   

డైరెక్టర్ హరి మాట్లాడుతూ.. 'ఒక చిన్న సినిమా ముందుకు రావాలి అంటే ప్రొడ్యూసర్ కావాలి, ఇలాంటి సినిమాని డైరెక్ట్ చేయమని నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ బాబ్జిగారికి  థాంక్స్, నేను ఏ ఆర్టిస్ట్ లు కావాలంటే వాళ్ళని నాకు ఇచ్చారు బాబ్జి గారు. రైటర్ కరుణ్ నాకు నా సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పాలి, ఆర్ట్ డైరెక్టర్ షర్మిల కూడా ఈ రోజు తన మ్యారేజ్ పనుల్లో బిజీ గా ఉండి ఇక్కడకి రాలేక పోయారు, తనకి నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను' అన్నారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. 'ప్రొడ్యూసర్ బాబ్జి ఇండస్ట్రీలో తెలుగు సినిమా చరిత్రలో ఆరువందల సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసారు. ప్రొడ్యూసర్‌గా చేయటం తన డ్రీం. ఈ సినిమా ఆయనకి నిర్మాతగా మంచి జర్నీకి పునాది కావాలి అని కోరుకుంటున్నాను' అని తెలిపారు.

హీరోయిన్ సాయి ధన్సిక మాట్లాడుతూ.. 'ఈ సినిమా నాకు చాలా స్పెషల్, తమిళంలో చాలా ఫిల్మ్స్ చేశాను, కబాలిలో చేశాను, హరి గారు చెన్నయ్ వచ్చి కథ చెప్పారు. నా కళ్ళు చూసి ఈ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ అని హరి గారు చెప్పారు, ఈ క్యారెక్టర్ నాకు చాలా స్పెషల్' అని చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement