
లక్ష్మీకాంత్, సుధీర్ వర్మ, హరీష్ శంకర్, సిమ్రత్, విరాట్, రియాజ్
‘‘పరిచయం’ టీజర్ చాలా బాగుంది. ఫొటోగ్రఫీ చక్కగా ఉంది. మంచి తెలుగు టైటిల్ పెట్టారు. లక్ష్మీకాంత్ చెన్నా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలతో ముందుకెళుతున్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ జంటగా లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రియాజ్ నిర్మించిన చిత్రం ‘పరిచయం’. శేఖర్ చంద్ర స్వరాలందించారు. ఈ చిత్రంలోని ‘అటు ఇటు అని ఏమైందో మనసా’ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. లక్ష్మీకాంత్ చెన్నా మాట్లాడుతూ– ‘‘ప్రేమ అంటే ఏంటి? అనే ప్రశ్న వేసుకుని ఈ సినిమా కథని ప్రారంభించా.
ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా ఎవరికైనా ఏదైనా చేయగలిగితే అదే ప్రేమ. తన ప్రాణం పోయినా పర్లేదని తల్లి అనుకుంటూ బిడ్డకు జన్మనిస్తుంది. అదే.. ప్రేమంటే’’ అన్నారు. ‘‘ఇప్పటికీ అందరూ నన్ను ‘పెళ్ళి’ పృథ్వీరాజ్ అనే పిలుస్తుంటారు. ఏడేళ్ల తర్వాత నేను నటిస్తున్న తెలుగు చిత్రమిది. హీరోయిన్ ఫాదర్‌గా చేశా’’ అన్నారు పృథ్వీ. ‘‘ఓ మంచి సినిమాతో నిర్మాణ రంగంలోకి వచ్చినందుకు హ్యాపీ’’ అన్నారు రియాజ్. డైరెక్టర్ సుధీర్ వర్మ, నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, బిక్ష్మమయ్య, విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్, కెమెరామేన్ నరేష్ రానా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment