‘ప్రేమ.. ఇష్క్... కాదల్’
టాటా బిర్లా మధ్యలో లైలా, సత్యభామ, మా ఆయన చంటిపిల్లాడు, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, మేము వయసుకు వచ్చాం చిత్రాలతో నిర్మాతగా తనకంటూ ఓ ఫేమ్‌ను సంపాదించుకున్నారు లక్కీమీడియా సంస్థ అధినేత బెక్కెం వేణుగోపాల్(గోపి), తాజాగా ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమ.. ఇష్క్... కాదల్’. పవన్ సాదినేని దర్శకునిగా పరిచయమవుతున్నారు.
అగ్ర నిర్మాత డి.సురేష్‌బాబు ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. హర్షవర్థన్, రాణే, విష్ణు, హరీష్, వితిక షేరు, రీతూ వర్మ, శ్రీముఖి ఇందులో హీరోహీరోయిన్లు. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రచార చిత్రాలను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఆవిష్కరించి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలందించారు. ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్(గోపి) మాట్లాడుతూ -‘‘మూడు జంటల ప్రేమాయణం ఇది.
రేడియో జాకీ, అసిస్టెంట్ డెరైక్టర్, రాక్‌స్టార్... ఈ ముగ్గురు కుర్రాళ్ల ప్రేమలోని మలుపులే ఈ సినిమా ప్రధాన కథాంశం. సినిమా అంతా ఫన్ జనరేట్‌గా ఉంటుంది. త్వరలోనే పాటల్ని ఆవిష్కరిస్తాం’’ అని తెలిపారు. భారీ బడ్జెట్‌లో స్టయిలిష్‌గా రూపొందుతోన్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్, ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, కళ: మోహన్, కూర్పు: గౌతమ్ నెరుసు, పాటలు: కృష్ణచైతన్య.