PREMA ISHQ KADHAL
-
సుమంత్ జిందగీ?
సుమంత్ ఓ వైవిధ్యమైన చిత్రంలో నటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ తర్వాత సుమంత్ ఒప్పుకున్న సినిమా ఇదే. రహదారిలో ముగ్గురు మిత్రుల ప్రయాణమే ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం రూపొందనుందట. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ చిత్రంతో ప్రతిభ గల దర్శకునిగా విమర్శకుల ప్రశంసలందుకున్న పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘కలర్స్’ స్వాతి, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేం విష్ణు ఇందులో కీలక భూమికలు పోషించనున్నారట. ‘జిందగీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. సెప్టెంబర్‌లో చిత్రీకరణ మొదలు కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపొందనుందని వినికిడి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రం తర్వాత పవన్ సాదినేని, నారా రోహిత్ హీరోగా ఓ సినిమా చేయనున్నారు. -
ప్రేమ ఇష్క్ కాదల్.
-
ప్రేమ ఇష్క్ కాదల్
-
విభిన్న ప్రేమానుభవాలు
ప్రేమంటే... ఎడారిలో కురిసే వాన. ప్రేమంటే... వసంతం లేకపోయినా విరిసే పూలవనం. ప్రేమంటే... రెండు హృదయాల మౌన కచ్చేరీ. అయితే అన్ని ప్రేమలూ ఆ ప్రేమ తాలూకూ అనుభవాలూ ఒకేలా ఉండవు. ఎవరి ప్రేమ వారికే ప్రత్యేకం. ఓ మూడు జంటల ప్రేమకథల్ని ఓ కాఫీ షాప్ నేపథ్యంలో ఆవిష్కరిస్తే ఎలా ఉంటుంది? దర్శకుడు పవన్ సాదినేని అదే చేశారు. డి.సురేష్‌బాబు సమర్పణలో లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం ‘ప్రేమ ఇష్క్ కాదల్’. షిర్డీసాయి కంబైన్స్ భాగస్వామ్యంతో రూపొందిన ఈ చిత్రంలో హర్షవర్థన్ రాణే, విష్ణు, హరీష్, వితిక షేరు, రీతూవర్మ, శ్రీముఖి ముందులో హీరో హీరోయిన్లు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ -‘‘భారీ నిర్మాణ విలువలతో స్టయిలిష్‌గా రూపొందిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇంతకు ముందు మా సంస్థలో వచ్చిన ‘టాటా బిర్లా మధ్యలో లైలా, సత్యభామ, మా ఆయన చంటిపిల్లాడు, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, మేం వయసుకు వచ్చాం’ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. శ్రావణ్ స్వరపరచిన పాటలు ఇప్పటికే విశేషాదరణ పొందాయి. సినిమా కూడా కచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, కళ: మోహన్, కూర్పు: గౌతమ్ నెరుసు, పాటలు: కృష్ణచైతన్య. -
అదే టెన్షన్ వీళ్లల్లో చూస్తున్నాను - అనుష్క
‘‘నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. అందులోనూ మెలొడీస్ అంటే చెవి కోసుకుంటాను. ఈ సినిమా పాటలు విన్నాను. శ్రవణ్ మంచి పాటలిచ్చాడు. ఆడియో బాగున్నట్లే, సినిమా కూడా బాగుంటుందని నా నమ్మకం’’ అని అనుష్క అన్నారు. డి.సురేష్‌బాబు సమర్పణలో హర్షవర్దన్ రాణే, వితిక శేరు, విష్ణువర్దన్, రీతువర్మ, హరీష్, శ్రీముఖి ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘ప్రేమ ఇష్క్ కాదల్’. పవన్ సాదినేని దర్శకుడు. బెక్కం వేణుగోపాల్ నిర్మాత. ఈ చిత్రం ఆడియో సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న అనుష్క ఇంకా మాట్లాడుతూ -‘‘నా తొలి చిత్రం ‘సూపర్’లో నటిస్తున్నప్పుడు నేనెంత టెన్షన్ పడ్డానో, అదే టెన్షన్ ఈ టీమ్ కళ్లల్లో చూస్తున్నాను. పాటలు, ప్రచార చిత్రాలు చూశాక ఈ సినిమాకోసం వీరెంత ఎఫర్ట్స్ పెట్టారో అర్థమవుతోంది. నిర్మాత వేణుగోపాల్ నాకు ఆరేళ్లుగా తెలుసు. నేను అన్నయ్య అని పిలుస్తాను. రొటీన్ చిత్రాలు కాకుండా మంచి సినిమాలు తీయాలని తపన పడే వ్యక్తి ఆయన. ఈ సినిమా ఆయన అభిరుచికి తగ్గట్టు ఉంటుందనుకుంటున్నా’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు ఎంవీకె రెడ్డి, గుత్తా జ్వాల, మధుర శ్రీధర్, అతిథి చంగప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘ప్రేమ.. ఇష్క్... కాదల్’
టాటా బిర్లా మధ్యలో లైలా, సత్యభామ, మా ఆయన చంటిపిల్లాడు, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, మేము వయసుకు వచ్చాం చిత్రాలతో నిర్మాతగా తనకంటూ ఓ ఫేమ్‌ను సంపాదించుకున్నారు లక్కీమీడియా సంస్థ అధినేత బెక్కెం వేణుగోపాల్(గోపి), తాజాగా ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమ.. ఇష్క్... కాదల్’. పవన్ సాదినేని దర్శకునిగా పరిచయమవుతున్నారు. అగ్ర నిర్మాత డి.సురేష్‌బాబు ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. హర్షవర్థన్, రాణే, విష్ణు, హరీష్, వితిక షేరు, రీతూ వర్మ, శ్రీముఖి ఇందులో హీరోహీరోయిన్లు. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రచార చిత్రాలను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఆవిష్కరించి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలందించారు. ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్(గోపి) మాట్లాడుతూ -‘‘మూడు జంటల ప్రేమాయణం ఇది. రేడియో జాకీ, అసిస్టెంట్ డెరైక్టర్, రాక్‌స్టార్... ఈ ముగ్గురు కుర్రాళ్ల ప్రేమలోని మలుపులే ఈ సినిమా ప్రధాన కథాంశం. సినిమా అంతా ఫన్ జనరేట్గా ఉంటుంది. త్వరలోనే పాటల్ని ఆవిష్కరిస్తాం’’ అని తెలిపారు. భారీ బడ్జెట్లో స్టయిలిష్‌గా రూపొందుతోన్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్, ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, కళ: మోహన్, కూర్పు: గౌతమ్ నెరుసు, పాటలు: కృష్ణచైతన్య.