
సుమంత్ జిందగీ?
సుమంత్ ఓ వైవిధ్యమైన చిత్రంలో నటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ తర్వాత సుమంత్ ఒప్పుకున్న సినిమా ఇదే. రహదారిలో ముగ్గురు మిత్రుల ప్రయాణమే ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం రూపొందనుందట. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ చిత్రంతో ప్రతిభ గల దర్శకునిగా విమర్శకుల ప్రశంసలందుకున్న పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘కలర్స్’ స్వాతి, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేం విష్ణు ఇందులో కీలక భూమికలు పోషించనున్నారట. ‘జిందగీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. సెప్టెంబర్‌లో చిత్రీకరణ మొదలు కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపొందనుందని వినికిడి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రం తర్వాత పవన్ సాదినేని, నారా రోహిత్ హీరోగా ఓ సినిమా చేయనున్నారు.