లక్కీ మీడియా సంస్థలో వస్తున్న 9వ చిత్రం ‘హుషారు’. శ్రీహర్ష కోనుగంటి దర్శకుడు. తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, అభినవ్ మేడిశెట్టి హీరోలుగా, దక్ష నగరకల్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ‘‘ఇటీవలే మా యూనిట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్సు టూర్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ టీమ్ ప్రధాన నగరాల్లోని అన్ని కాలేజీలకు వెళ్లాం. వెళ్లిన కాలేజీల్లో విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొని చిత్ర యూనిట్‌లోని నటీనటులతో ఆడి పాడారు. ‘ఉండి పోరాదే’..., ‘పిచాక్...’ పాటలను ఆలపించి మా టీమ్‌లో ఆనందాన్ని నింపారు’’ అని చిత్రనిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment